ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి చిత్రం `అర‌ణ్య‌`  

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి చిత్రం `అర‌ణ్య‌`  

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి చిత్రం `అర‌ణ్య‌`  
 
దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్‌ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది.  రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `అర‌ణ్య‌`ను ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ తెలుగు స‌హా హిందీలో ‘హథీ మేరే సాథి’, త‌మిళంలో ‘కాండన్’ పేర్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తుంది. ఈ మూడు భాష‌ల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో పుల్కిత్ స‌మ్రాట్‌, విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్ శ్రియా పిల్‌గోయంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా 
 
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌ లుల్లా మాట్లాడుతూ – “ఈసినిమాను మూడు టైటిల్స్‌తో మూడు భాషల్లో విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌కు  చాలా స్పెషల్‌ మూవీగా భావిస్తున్నాం. యూనిక్‌ స్టోరీ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అన్నారు. 
 
చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ “హృదయానికి హత్తుకునేలా మావటివాడు, ఏనుగుకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఎమోషనల్‌ డ్రామానే ఈ చిత్రం. మానవజాతి  కజిరంగ, అస్సోమ్‌ ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు ఓ వ్యక్తి ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఆ  పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ సినిమాను చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో తెరకెక్కించాం. ప్రేక్షకులను మెప్పించేలా మూడు భాషల్లో సినిమాను తెరకెక్కించాం” అన్నారు.  
 
జంతు ప్రేమికుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘థోర్‌’, ‘బై మోక్ష్‌ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్‌.ఎక్స్‌ అందించిన ప్రాణ స్టూడియో ఈ  సినిమాకు వి.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తుంది. ‘త్రీ ఇడియట్స్’‌, ‘పీకే’, ‘పింక్‌’, ‘వజీర్‌’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత  రసూల్‌ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్‌ డిజైనింగ్‌ చేస్తున్నారు
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )