శ్రీకరణ్ మూడో చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

శ్రీకరణ్ మూడో చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

శ్రీకరణ్ మూడో చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

శ్రీకరణ్ ప్రొడక్షన్ బ్యానర్ పై గొంటి శ్రీకాంత్, గుంజ శ్రీనివాసులు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 ఫస్ట్ లుక్ ను జనవరి 12న హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. హైటెక్ లవ్,  బెస్ట్ లవర్స్ మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకరణ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడిగా జినుకల హరికృష్ణను పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నీలం ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం క్లాస్, మాస్ ఆడియెన్సును ఆకట్టుకునే అన్ని అంశాలు ఉంటాయని, సామాజిక విలువలతో పాటు కమర్షియల్ హంగులు కూడా ఉంటాయని  దర్శకుడు ఈ సందర్బంగా అన్నారు. ఫబ్రవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అన్నారు. ఈ సినిమా తనకు మంచి మాస్ హీరోగా గుర్తింపును తెస్తుందనీ, తన పుట్టినరోజు గుర్తుపెట్టుకొని మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు యూనిట్ కు శ్రీకరణ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కో ప్రొడ్యూసర్ గా డి. అల్లిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అల్లం నాగిశెట్టి నాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: హరి, మాటలు: అజయ్ వీర్; కెమెరా: రాము; ఎడిటింగ్ వేణు; సంగీతం: విజయ్ బాలాజీ; పాటలు: నాగరాజు కువ్వారపు, గోపి, సరిత నరేష్; కొరియోగ్రఫీ: శ్రీధన్ వి, నందు మాస్టర్; ఫైట్స్: కృష్ణంరాజు; డిజైనర్: ఎస్.శివ యాదవ్.

 
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )