హీరో శింబు కొత్త చిత్రం “ఈశ్వరుడు”

హీరో శింబు కొత్త చిత్రం “ఈశ్వరుడు”

హీరో శింబు కొత్త చిత్రం “ఈశ్వరుడు”

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం “ఈశ్వరుడు”. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ – కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు తన స్టైల్ లో లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడ మీద వేసుకొని కనిపిస్తున్నాడు. శింబు లుక్ చూస్తుంటే గతంలో కంటే చాలా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )