MaaMovie.com https://maamovie.com Welcome to MaaMovie.com Mon, 20 Jan 2025 18:26:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://i0.wp.com/maamovie.com/wp-content/uploads/2020/06/icon.png?fit=31%2C31&ssl=1 MaaMovie.com https://maamovie.com 32 32 214709343 ‘కన్నప్ప’ చిత్రంపై అంచనాలు పెంచేసిన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ https://maamovie.com/2025/01/20/akshay-kumars-first-look-poster-that-raised-the-expectations-of-the-film-kannappa/ https://maamovie.com/2025/01/20/akshay-kumars-first-look-poster-that-raised-the-expectations-of-the-film-kannappa/#respond Mon, 20 Jan 2025 18:26:17 +0000 https://maamovie.com/?p=5009 ‘కన్నప్ప’ చిత్రంపై అంచనాలు పెంచేసిన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమా భారీ ఎత్తున రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ వస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లు, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సోమవారం శివుడిగా నటించిన అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

శివుడిగా అక్షయ్ కుమార్ పాత్ర ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్‌తో చూపించారు. శివ తాండవం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, శివుని ఆశీస్సులతో ఆడియెన్స్ ముందుకు ఏప్రిల్ 25న రాబోతోన్నామంటూ అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

]]>
https://maamovie.com/2025/01/20/akshay-kumars-first-look-poster-that-raised-the-expectations-of-the-film-kannappa/feed/ 0 5009
జనవరి 24న రాబోతోన్న ‘హత్య’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకురాలు శ్రీవిద్యా బసవ https://maamovie.com/2025/01/20/hatya-coming-on-january-24-will-impress-everyone-film-director-srividya-basava-at-the-press-meet/ https://maamovie.com/2025/01/20/hatya-coming-on-january-24-will-impress-everyone-film-director-srividya-basava-at-the-press-meet/#respond Mon, 20 Jan 2025 18:22:26 +0000 https://maamovie.com/?p=5006 జనవరి 24న రాబోతోన్న ‘హత్య’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకురాలు శ్రీవిద్యా బసవ

మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం. మధ మూవీని చాలా మందికి చూపించి రిలీజ్ చేయమని అడిగాను. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరినీ అడగలేదు. మా ట్రైలర్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు. మేం సినిమా చూశాం. మాకు నమ్మకం పెరిగింది. ఈ సినిమా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా టీం కూడా ఈ సినిమాను చూసి ఫుల్‌ హ్యాపీగా ఉంది. మేం తప్పులు చేస్తూనే ఫిల్మ్ మేకింగ్‌ను నేర్చుకున్నాం. రవి గారు అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. సుధ పాత్రలో ధన్య అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో ప్రిపేర్ అయి సెట్స్‌కు వస్తుంది. సలీమ కారెక్టర్‌లో పూజ మెప్పిస్తుంది. నేను ఓ మహిళా దర్శకురాలిగా.. మరిన్ని ఉమెన్ సెంట్రిక్ కథలు, కారెక్టర్‌లను రాయాలని అనుకుంటున్నాను. మా కెమెరామెన్‌ అభి సింక్‌లో పని చేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నరేష్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. అనిల్ ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

ధన్యా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఇంత పెద్ద పాత్రను నాకు ఇచ్చిన విద్యకు థాంక్స్. చిన్నప్పటి నుంచి నాకు విజయశాంతి, మాలాశ్రీలా యాక్షన్ చిత్రాలు చేయాలని ఉండేది. ఇప్పటికి ఆ కల నెరవేరింది. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మా చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాను అందరూ చూడండి. నచ్చితే అందరికీ చెప్పండి’ అని అన్నారు.

పూజా రామచంద్రన్ మాట్లాడుతూ.. ‘మళ్లీ తెలుగు పరిశ్రమకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు ఎంతో ప్రేమ లభిస్తుంటుంది. స్వామి రారా నుంచి నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శ్రీవిద్యకు థాంక్స్. ధన్యతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. డీఓపీ అభి, డైరెక్టర్ విద్య ద్వయం అద్భుతంగా పని చేసింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ శ్రీవిద్యకు థాంక్స్. మా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాకు నేను ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. నాకు ఆ అవకాశం ఇచ్చిన దర్శకురాలికి థాంక్స్. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హత్య ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్ మాట్లాడుతూ.. ‘వారం రోజుల్లో ఓ సినిమాను పూర్తి చేస్తానా? అని అనిపించింది. మా లిరిసిస్ట్ గాంధీ నా ప్రోగ్రామర్ కూడా. నాతో చాలా ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. మా డైరెక్టర్, యాక్టర్, డీఓపీ, ఎడిటర్‌లు అద్భుతంగా పని చేశారు. జనవరి 24న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

కెమెరామెన్ అభిరాజ్ రాజేంద్రన్ మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ విద్య ఎంతో మంది మహిళలకు స్పూర్తి. హత్య సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. పూజా, ధన్య అధ్బుతంగా నటించారు. నరేష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. జనవరి 24న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఎడిటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘హత్య టీజర్, ట్రైలర్ అందరూ చూశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీశారు. హత్య చిత్రంలో చాలా కోణాలు ఉంటాయి. అవేంటో మీకు జనవరి 24న తెలుస్తాయి’ అని అన్నారు.

నటీనటులు : ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శ్రీ విద్యా బసవా
నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్
సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్ పి
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ శ్రీకాంత్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి
సౌండ్ డిజైన్: సింక్ సినిమా- సచిన్ సుధాకరన్, హరిహరన్
సౌండ్ మిక్స్: అరవింద్ మీనన్

]]>
https://maamovie.com/2025/01/20/hatya-coming-on-january-24-will-impress-everyone-film-director-srividya-basava-at-the-press-meet/feed/ 0 5006
త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల https://maamovie.com/2025/01/20/trisha-tovino-thomas-vinay-roy-starrer-identity-telugu-trailer-launch-24th-telugu-release/ https://maamovie.com/2025/01/20/trisha-tovino-thomas-vinay-roy-starrer-identity-telugu-trailer-launch-24th-telugu-release/#respond Mon, 20 Jan 2025 18:13:34 +0000 https://maamovie.com/?p=5002 త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ఈ నెల 24వ తేదిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు హైదరాబాదులో చిత్ర యూనిట్ సమక్షంలో ఈ చిత్ర తెలుగు టైలర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఐడెంటిటీ చిత్ర ట్రైలర్ లంచ్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఈ చిత్రం మలయాళంలో జనవరి 2వ తేదీన విడుదలై ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి ఇక్కడ సినిమాలు ఉండటంవల్ల అదే సమయంలో విడుదల చేయలేకపోయాము. అందుకే ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాము. ఈ చిత్రంలో మన తెలుగువారి కొడుకుని యాక్షన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం మలయాళంలో బాగా ప్రేక్షకుల మరణ పొందడంతో తెలుగులో కూడా ఈ చిత్రం అలాగే ఉంటుందని ఎన్నో అంచనాలు ఉన్నాయి. అనుకొని కారణాలవల్ల హీరో టోవినో థామస్, హీరోయిన్ త్రిష ఈ వేడుకకు రాలేకపోయారు. దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతుంది. ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. దర్శకులు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది” అన్నారు.

చింతపల్లి రామారావు గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారికి, స్నేహితులకి, సన్నిహితులకి అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో సంచలన వసూలతో గొప్ప విజయం సాధించింది ఐడెంటిటీ సినిమా. మామిడాల శ్రీనివాసరావు గారితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాము. ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ సుపరిచితులు కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా దర్శకులకు తెలుగులో మంచి గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నాము. జనవరి 24వ తేదీన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. యాక్షన్ త్రిలరైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా వినోదపరుస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.

అఖిల్ పాల్ మాట్లాడుతూ… “ముందుగా మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలైనప్పటికి నుండి సుమారు రెండు మూడు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తున్న చిత్ర కథానాయకుడు టోవినో థామస్. చిత్ర నిర్మాతలతో కలిసి ఆయన కూడా ఈ సినిమా కోసం నిలబడ్డారు. మలయాళం సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఈ చిత్రం బడ్జెట్ కొంచెం ఎక్కువగానే అయింది. ఈ చిత్రం ఎంతోమంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ముందుకు వచ్చి పని చేశారు. ఈ చిత్రం మొదలైన సమయంలోనే ఈ చిత్రాన్ని దేశమంతుడు చూపించాలని మేము అనుకున్నాము. అందుకే ముందు నుండి కూడా ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తగా పని చేసాము. స్క్రిప్ట్ నుండి యాక్షన్ సీన్స్ వరకు చాలా జాగ్రత్త పడ్డాము. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురావడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. కేరళలో సాధించినట్లు ఎక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను. ట్రైలర్ ఎంత పవర్ఫుల్ గా వచ్చింది. అంతే పవర్ ఫుల్ గా ఈ సినిమా కూడా ఉండబోతుంది” అన్నారు.

నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ టైలర్ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు. రామారావు గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయిన చేశారో మలయాళం లో కూడా అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారు. నా 18 సంవత్సరాల కెరియర్ లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగువారికి ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగు నిర్మాతలకు ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నాను. జనవరి 24వ తేదీన ఈ చట్టం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది” అంటూ ముగించారు.

తారాగణం: టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి తదితరులు.

సాంకేతిక బృందం :
రచన దర్శకత్వం : అఖిల్ పాల్, అనాస్ ఖాన్
నిర్మాతలు : రాజు మల్లియాత్, రాయ్ సిజె
సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్
ఎడిటర్ : చామన్ చక్కో
సంగీతం : జేక్స్ బెజోయ్
సమర్పణ : మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల
తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ : శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

]]>
https://maamovie.com/2025/01/20/trisha-tovino-thomas-vinay-roy-starrer-identity-telugu-trailer-launch-24th-telugu-release/feed/ 0 5002
Tovino Thomas’ “IDENTITY” is Mollywood’s FIRST HIT OF THE YEAR 2025 https://maamovie.com/2025/01/15/tovino-thomas-identity-is-mollywoods-first-hit-of-the-year-2025/ https://maamovie.com/2025/01/15/tovino-thomas-identity-is-mollywoods-first-hit-of-the-year-2025/#respond Wed, 15 Jan 2025 13:53:52 +0000 https://maamovie.com/?p=4988 Tovino Thomas’ “IDENTITY” is Mollywood’s FIRST HIT OF THE YEAR 2025


After the sensational 2024, Malayalam cinema kickstarts 2025 in a blasting way with the mind-blowing thriller Identity. In 2024, the blockbuster films like Manjummel Boys, ARM, Aavesham, Kishkinda Kandam, Guruvayoor Ambalanadayil, Vaazha, Aadu Jeevitham, Anveshippin Kandethum, Osler, Bhramayugam, Vazhshangal Shesham, Premalu, and many others opened new avenues for Malayalam cinema across other states.

The films have grossed more than ₹50 crore and ₹100 crore marks at the box office. Now, the recently released thriller Identity joins the sensational hits league with record-breaking collections. The film starring Tovino Thomas, Trisha Krishnan, and Vinay Rai in lead roles hit theatres on 2nd January and received a blockbuster response from everyone.

The film delivered a massive worldwide box office collection of ₹23.20 crores within just four days. The film also achieved hit status in its Tamil version and collected good numbers. Now, it has crossed 40.23 crores gross in just two weeks. With the film running successfully in packed theatres, trade analysts anticipate that the film will join the 50 crore club very soon.

The film is all set to release in Telugu and Hindi in coming weeks. The numbers will surely increase. “Identity” serves as a clear indicator that theaters are poised for a busy year ahead. These consecutive box office successes play a significant role in bringing more audiences back to theaters.

The film is written and directed by Akhil Paul and Anas Khan, produced by Raju Malliath and Dr. CJ Roy, and distributed by Gokulam Movies through Dream Big Films.

]]>
https://maamovie.com/2025/01/15/tovino-thomas-identity-is-mollywoods-first-hit-of-the-year-2025/feed/ 0 4988
ఫ్యూజీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది – గ్లోబల్ డెలివరీకి కొత్త దిశ https://maamovie.com/2025/01/12/fuji-opens-new-office-in-hyderabad-new-direction-for-global-delivery/ https://maamovie.com/2025/01/12/fuji-opens-new-office-in-hyderabad-new-direction-for-global-delivery/#respond Sun, 12 Jan 2025 11:22:52 +0000 https://maamovie.com/?p=4982 ఫ్యూజీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది – గ్లోబల్ డెలివరీకి కొత్త దిశ

హైదరాబాద్, భారతదేశం – ఫ్యూజీ తన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలకు నాంది పలికే ఈ కార్యాలయం ఫ్యూజీ నాణ్యతకు నడిమెట్టు అని చెప్పవచ్చు. ఇది సృజనాత్మకత మరియు సహకారాన్ని పెంపొందించే చక్కని పని వాతావరణాన్ని కల్పించడానికి రూపొందించబడింది.
ప్రారంభోత్సవ వేడుకకు గౌరవ అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్య మరియు సమాచార సాంకేతిక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జయేశ్ రంజన్ గారు (IAS) మరియు భారతదేశంలో కోస్టా రికా రాయబార కార్యాలయం అధికారి శ్రీమతి సోఫియా సాలస్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) మరియు ప్రముఖ బహుళజాతి సంస్థల ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం విశేషం.

ఫ్యూజీ గ్లోబల్ డెలివరీ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) కార్యకలాపాలకు కీలక కేంద్రంగా రూపొందించబడింది. ఇందులో శక్తివంతమైన సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇచ్చే డైనమిక్ స్పేసులు, క్లయింట్ ఎంగేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆధునిక నగర వీక్షణలతో బాల్కనీ లాంజ్, నూతన పరిష్కారాల ఆవిష్కరణ కోసం హైటెక్ ఇన్నొవేషన్ రూమ్, క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, మరియు లీడర్‌షిప్ ఫోరమ్‌ల కోసం ప్రత్యేకమైన స్టేజ్ అరేనా వంటి అనేక ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

ప్రారంభోత్సవంలో ఫ్యూజీ వ్యవస్థాపకుడు మరియు CEO శ్రీ మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ కార్యాలయం మా సిబ్బంది మరియు క్లయింట్లు అభివృద్ధి చెందేందుకు ఉత్తమ వాతావరణం కల్పించాలన్న మా కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. హైదరాబాదు విశిష్టమైన ప్రతిభావంతుల అందుబాటుతో పాటు ఆవిష్కరణలకూ ఆహ్లాదకమైన వాతావరణం అందిస్తోంది. ఇది మా GCC వ్యూహానికి ముఖ్యమైన భాగంగా మారుతోంది,” అని చెప్పారు.

ఈ ప్రారంభోత్సవానికి ఫ్యూజీ గౌరవనీయ బోర్డు సభ్యులు, ఫార్చూన్ 500 కంపెనీలకు సలహాదారులైన డాక్టర్ రామ్ చరణ్ మరియు ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత శేఖర్ కమ్ముల గార్లు పాల్గొన్నారు. వారి నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం ఫ్యూజీకి నూతన ఆవిష్కరణలకు పునాది వేస్తోంది.

డల్లాస్, టెక్సాస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఫ్యూజీ, కోస్టా రికా మరియు భారతదేశం వంటి ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను అనుసంధానిస్తోంది.

హైదరాబాద్ కేంద్రం ఫ్యూజీ స్థిర అభివృద్ధి పయనంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది

]]>
https://maamovie.com/2025/01/12/fuji-opens-new-office-in-hyderabad-new-direction-for-global-delivery/feed/ 0 4982
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం: 1గా రానున్న చిత్రం https://maamovie.com/2025/01/11/splash-colors-media-aliniya-avigna-studios-settle-king-production-no-1-upcoming-film-shooting-at-fast-speed/ https://maamovie.com/2025/01/11/splash-colors-media-aliniya-avigna-studios-settle-king-production-no-1-upcoming-film-shooting-at-fast-speed/#respond Sat, 11 Jan 2025 14:54:39 +0000 https://maamovie.com/?p=4978 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం: 1గా రానున్న చిత్రం

స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం:1లో వేణుబాబు నిర్మాతగా ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వంలో పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తూ దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తూ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ అండగా త్వరలోనే ఇతర సినిమా అప్డేట్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నటి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ… “నేను ఈ నిర్మాణ సంస్థలో పనిచేయడం మొదటిసారి. జీవి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడైన జీవి గారు మొదటిసారి దర్శకత్వం చేస్తున్నారు. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది. అందుకుగాను ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున్న తోటి నటీనటులతో, ఈ చిత్ర బృందంతో పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

నటి ఆదర్శ్ పందిరి మాట్లాడుతూ… “మేము కొత్త కామెడీతో ముఖ్యంగా లింగ బేధాల పై మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాము. ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలకపాత్ర పోషించబోతుంది. త్వరలోనే థియేటర్లో కలుసుకుందాం” అన్నారు.

నటుడు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ… “మేమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నాము. ఈ చిత్ర కథని నమ్మి సినిమా చేస్తున్నాము. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాము. త్వరలోనే ఈ సినిమా ద్వారా థియేటర్లలో కలుద్దాము” అన్నారు.

నటి పూజిత పుందిర్ మాట్లాడుతూ… “జెండర్ సమానత్వంపై కామెడీ రూపంలో వస్తున్న ఈ చిత్రం మంచి కామెడీతో ఉండబోతుంది. జీవి గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

చిత్ర దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ… “స్ప్లాష్ కలర్స్ మీడియా బ్యానర్ పై మేము తొలి సినిమా చేస్తున్నాము. అశ్రిత్, ఆదర్శ్, ప్రియాంక సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న మొదలు పెట్టుకుని నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా 15 రోజులపాటు షూటింగ్ చేస్తూ నేటికి సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్నాము. మిగతా సగభాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాము. టెక్నాలజీ, ఎమోషన్, లింగ సమానత్వం పై ఉండబోతున్న ఈ చిత్రం 2025లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ నచ్చుతుందని, అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను” అన్నారు.

సినిమా ఆటోగ్రాఫర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ… “స్ప్లాష్ కలర్ మీడియా బ్యానర్ పై నేను తొలిసారిగా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాను. చిత్ర బంధం అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను” అన్నారు.

నటీనటులు : ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు.

సాంకేతిక బృందం :
దర్శకుడు : ఘంటసాల విశ్వనాథ్ (జివి)
నిర్మాత : వేణుబాబు ఎ
సంగీత దర్శకుడు : పవన్ చరణ్, జీవి
డిఓపి : దిలీప్ కుమార్ చిన్నయ్య
సహ నిర్మాతలు : శ్రీకాంత్ వెంపరల, విశ్వనాథ్ మాచికలపాటి, విక్రమ్ గార్లపాటి, మహీంద్ర అరవపల్లి, వెంకట్ చిలకల, సాయికుమార్ మేడి, స్వాతి వై, ప్రవీణ్ సంక్పాల్
ఎడిటర్ : కొట్టగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : రామకృష్ణ
లిరిక్స్ : కిట్టు విస్సప్రగడ, గౌతమ్ చింటూ, సుభాష్, నారాయణ్
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

]]>
https://maamovie.com/2025/01/11/splash-colors-media-aliniya-avigna-studios-settle-king-production-no-1-upcoming-film-shooting-at-fast-speed/feed/ 0 4978
తెలుగులో ఘనంగా హాలీవుడ్ యాక్షన్ , అడ్వెంచర్ చిత్రం “ఏజెంట్ గై 001” ట్రైలర్ విడుదల https://maamovie.com/2025/01/11/hollywood-action-adventure-film-agent-guy-001-trailer-released-in-telugu/ https://maamovie.com/2025/01/11/hollywood-action-adventure-film-agent-guy-001-trailer-released-in-telugu/#respond Sat, 11 Jan 2025 14:49:53 +0000 https://maamovie.com/?p=4975 తెలుగులో ఘనంగా హాలీవుడ్ యాక్షన్ , అడ్వెంచర్ చిత్రం “ఏజెంట్ గై 001” ట్రైలర్ విడుదల

డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్ గై 001. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందించగా డెన్నిస్ ఆండర్సన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. ఆంటోన్ కార్ల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పి శ్రీనివాస గౌడ్ నిర్మిస్తూ సహాయ నిర్మాతగా పి హేమంత్ వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో వస్తున్న మరొక అద్భుతమైన యాక్షన్ ఇంకా అడ్వెంచర్లు కలిగిన చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. టీజర్ ను చూస్తే డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా కనిపిస్తుంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్ అలాగే కొన్ని అడ్వెంచర్లు ఉన్నట్లు అర్థమవుతుంది. చిత్రం ఎంత నాణ్యంగా ఉండబోతుంది అనేది టీజర్ లోని నిర్మాణం విలువలు ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి.

నటీనటులు : బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా

సాంకేతిక బృందం :
దర్శకత్వం : డేవిడ్ ఆండర్సన్
నిర్మాత : ఎరిక్ ఆండర్సన్
స్క్రీన్ ప్లే : బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్
డిఓపి : ఆంటోన్ కార్ల్సన్
సంగీతం : ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్
ప్రొడక్షన్ డిజైన్ : డెన్నిస్ ఆండర్సన్
తెలుగు నిర్మాత : పి శ్రీనివాస గౌడ్
సహ నిర్మాత : పి హేమంత్
పిఆర్ఓ : మధు విఆర్

]]>
https://maamovie.com/2025/01/11/hollywood-action-adventure-film-agent-guy-001-trailer-released-in-telugu/feed/ 0 4975
ఘనంగా “రాజు గారి దొంగలు” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ https://maamovie.com/2025/01/04/raju-gari-dongalu-movie-teaser-launch-event/ https://maamovie.com/2025/01/04/raju-gari-dongalu-movie-teaser-launch-event/#respond Sat, 04 Jan 2025 17:14:58 +0000 https://maamovie.com/?p=4966 ఘనంగా “రాజు గారి దొంగలు” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనల్ హిటాసో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు రాజు గారి దొంగలు సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ వచ్చి నన్ను ఈ ఈవెంట్ కు పిలిచాడు. నేను బిజీగా ఉన్నా, వైజాగ్ వాళ్లు అని చెప్పగానే వస్తానని అన్నాను. వైజాగ్ అంటే నాకు ఒక ఎమోషన్. రాజు గారి దొంగలు టీజర్ బాగుంది. టైటిల్స్, తన పేరులోనే క్రియేటివిటీ చూపించారు డైరెక్టర్ లోకేష్. సినిమాను కూడా ఇలాగే కొత్తగా తెరకెక్కించాడని అనుకుంటున్నాను. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – సినిమా అంటే మనందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది. నేనూ మీలాగే సినిమా షూటింగ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చాను. ప్రొడ్యూసర్ గా ఎదిగాను. కష్టపడితే మీరు కూడా మంచి పొజిషన్ కు వెళ్లొచ్చు. రాజు గారి దొంగలు పోస్టర్, సాంగ్, టీజర్ బాగుంది. ఆర్టిస్టులంతా బాగా పర్ ఫార్మ్ చేశారు. దొంగ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాల్లో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది, ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలి. డైరెక్టర్ లోకేష్, ప్రొడ్యూసర్ బంగారునాయుడు మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – మనం ఇతర భాషల సినిమాలు చూసి అరే భలే చేశారే మూవీ అనుకుంటాం. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం రాజు గారి దొంగలు సినిమాతో డైరెక్టర్ లోకేష్ రనల్ హిటాసో చేశారు. టీజర్ లోనే ఆ కొత్తదనం కనిపించింది. కొడుకుని నమ్మిన తండ్రి సినిమాను ప్రొడ్యూస్ చేస్తే, ఫ్రెండ్స్ నటించారు. ఇలాంటి అనుబంధం ఉన్న మీకోసం రేపు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వస్తారు అన్నారు.

యాక్టర్ లోహిత్ కల్యాణ్ మాట్లాడుతూ – ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన దామోదర ప్రసాద్ గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి, జెమినీ సురేష్ గారికి థ్యాంక్స్. రాజు గారి దొంగలు సినిమాలో నేను నటించే అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ లోకేష్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే అంకుల్ బంగారునాయుడు లేకుంటే ఈ మూవీ ఉండేది కాదు. రాజు గారి దొంగలు టీజర్ , సాంగ్, పోస్టర్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం. సినిమా కూడా చాలా బాగుంటుంది. త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం అన్నారు.

యాక్టర్ రాజేష్ కుంచాడా మాట్లాడుతూ – రాజు గారి దొంగలు టీజర్ బాగుందని మీరంతా చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్, డైరెక్టర్ లోకేష్ కు థ్యాంక్స్. ఒక కొత్త ప్రయత్నం మేమంతా కలిసి చేశాం. మా చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు.

డైరెక్టర్ లోహిత్ రనల్ హిటాసో మాట్లాడుతూ – మా రాజు గారి దొంగలు టీజర్ లాంఛ్ కు వచ్చిన దామోదర ప్రసాద్ గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి, జెమినీ సురేష్ గారికి థ్యాంక్స్. నేను డైరెక్టర్ కావాలని కలగన్నాను. మరో ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్తే సినిమా అవకాశం ఇచ్చేందుకు ఎంత టైమ్ పడుతుందో తెలియదు. నా డ్రీమ్ ను, నన్ను నమ్మి మా నాన్న ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే నా ఫ్రెండ్స్ అంతా ఈ మూవీలో నటించారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. త్వరలోనే మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాం అన్నారు.

నిర్మాత నడిమింటి బంగారునాయుడు మాట్లాడుతూ – రాజు గారి దొంగలు సినిమాతో మా అబ్బాయి లోకేష్ డైరెక్టర్ గా మారుతుండటం సంతోషంగా ఉంది. ఒక మంచి కథతో ఈ మూవీ చేశాడు. టీజర్ ఎంత బాగుందో సినిమా కూడా అలాగే మీ అందరి ఆదరణ పొందుతుంది. త్వరలోనే మా రాజు గారి దొంగలు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.

యాక్టర్ జోషిత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ – రాజు గారి దొంగలు సినిమా టీజర్ మీ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఈ చిత్రంతో నటుడిగా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నటి పూజా విశ్వేశ్వర్ మాట్లాడుతూ – సలార్ చిత్రంతో మీ అందరి ఆదరణ పొందడం ఎంతో హ్యాపీగా ఉంది. డైరెక్టర్ లోకేష్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు తప్పకుండా నటించాలని అనుకున్నాను. వేరే ప్రాజెక్ట్స్ వదులుకుని మరీ ఈ మూవీలో నటించాను. మా టీమ్ అంతా హ్యాపీగా షూటింగ్ చేశాం. రాజు గారి దొంగలు సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

యాక్టర్ కైలాష్ మాట్లాడుతూ – రాజు గారి దొంగలు సినిమాలో నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. షూటింగ్ టైమ్ లో మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ లా మారిపోయాం. ఈ సినిమా యూనిట్ నాకు మరో ఫ్యామిలీ అనిపించింది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లోకేష్, ప్రొడ్యూసర్ బంగారునాయుడు గారికి థ్యాంక్స్ అన్నారు.

*నటీనటులు* – లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు , తదితరులు

*టెక్నికల్ టీమ్*
డీవోపీ – సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి
స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్
మ్యూజిక్ – నాఫల్ రాజా ఏఐఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజవంశీ
పీఆర్ఓ – చందు రమేష్
బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ
సమర్పణ – నడిమింటి లిఖిత
నిర్మాత – నడిమింటి బంగారునాయుడు
దర్శకత్వం – లోకేష్ రనల్ హిటాసో

]]>
https://maamovie.com/2025/01/04/raju-gari-dongalu-movie-teaser-launch-event/feed/ 0 4966
విజయ్ కనిష్క హీరోగా ఘనంగా ప్రారంభమైన ‘కలవరం’ మూవీ https://maamovie.com/2025/01/04/kalavaram-movie-started-grandly-with-vijay-kanishka-as-the-hero/ https://maamovie.com/2025/01/04/kalavaram-movie-started-grandly-with-vijay-kanishka-as-the-hero/#respond Sat, 04 Jan 2025 16:57:07 +0000 https://maamovie.com/?p=4964 విజయ్ కనిష్క హీరోగా ఘనంగా ప్రారంభమైన ‘కలవరం’ మూవీ

విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో మరియు ఇంకో హీరోయిన్లుగా సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, హనుమాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కలవరం. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి శశాంక్ కథని అందించగా సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ అలాగే మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస. నేడే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చదలవాడ శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. ఇది బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఉన్న సినిమా. ఇప్పటిదాకా చిన్న సినిమాలను పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైన చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పించాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వడం అదేవిధంగా మినీ థియేటర్లు కట్టి సపోర్ట్ ఇవ్వాలి. కలవరం టైటిల్ చాలా మంచి టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హీరో హీరోయిన్ల కి మూవీ టీంకి మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ : ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి సపోర్ట్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి గారు చెప్పడం జరిగింది. వెంటనే చెన్నై వెళ్లి హీరో కి కథ చెప్పాము. హీరో విజయ్ కనిష్క గారికి కూడా ఈ కథ చాలా నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాము అని అన్నారు. ఈ రోజున ఇలా గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. నన్ను నా కథని నమ్మి నాకే అవకాశం ఇచ్చిన శోభ రాణి గారికి హీరో విజయ్ కనిష్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ : మా నాన్నగారు విక్రమంగారు తమిళ్ లో ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. నా మొదటి సినిమా హిట్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పేరు నిలబెట్టారు నిలబెటవ్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఇప్పుడు ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. శోభ గారు డైరెక్టర్ హనుమాన్ గారు మంచి ప్యాషన్ తో ఈ కథని నాకు వినిపించారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మంచి సినిమాలు కొత్త టాలెంట్ ఇంకా ఎంతోమంది మీ ముందుకు వస్తారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.

కథ రచయిత శశాంక్ పి మాట్లాడుతూ : కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ శోభారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను, డైరెక్టర్ హనుమాన్ కలిసే స్క్రిప్ట్ ని తయారు చేశాం. అదేవిధంగా కథ విన్న వెంటనే హీరో విజయ్ కనిష్క గారు ఈ సినిమాను ఒప్పుకుని ముందుకు వచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత శోభారాణి గారు మాట్లాడుతూ : కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. విజయ్ కనిష్క కథ వినిన వెంటనే సినిమా మనం చేస్తున్నాము అని అన్నారు. శశాంక్ ఇచ్చిన కథ అలాగే డైరెక్టర్ హనుమాన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అదే కష్టంతో ఇష్టంతో ఈ సినిమాని పూర్తి చేస్తాము. అడగగానే మా ఈ సినిమా ఓపెనింగ్ కి వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి మరియు సి కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాము.ప్రేక్షకులు అందరూ మెచ్చే సినిమా అవుతుందని కచ్చితంగా చెప్తున్నాను అన్నారు.

నటీనటులు : విజయ్ కనిష్క(హిట్ లిస్ట్ ఫేమ్), గరిమ చౌహన్ , రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్)

టెక్నీషియన్స్ :
ప్రొడక్షన్ : సి ఎల్ ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
దర్శకత్వం : హనుమాన్ వసంశెట్టి
కథ : శశాంక్ పి
డి ఓ పి : వెంకటేష్
మ్యూజిక్ : వికాస్ బాడిస
ఎడిటర్ : శిరీష్ ప్రసాద్
పి ఆర్ ఓ : మధు విఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

]]>
https://maamovie.com/2025/01/04/kalavaram-movie-started-grandly-with-vijay-kanishka-as-the-hero/feed/ 0 4964
“పోకిరి” మూవీ నుంచి నా గుండె జారిపోయిందే సాంగ్ లాంచ్ https://maamovie.com/2024/12/31/the-song-launch-from-the-movie-pokiri-is-the-song-naa-guldi-pradi/ https://maamovie.com/2024/12/31/the-song-launch-from-the-movie-pokiri-is-the-song-naa-guldi-pradi/#respond Tue, 31 Dec 2024 12:03:35 +0000 https://maamovie.com/?p=4945 “పోకిరి” మూవీ నుంచి నా గుండె జారిపోయిందే సాంగ్ లాంచ్

వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణం లో, ఆయన హీరో గా నటిస్తున్న సినిమా పోకిరి. ఈ సినిమా లో మమతా హీరోయిన్ కాగా, వికాస్ దర్శకులు. వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమా లో నుంచి మొదటి పాట ని విడుదల చేసారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ చిత్ర యూనిట్ సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.
హీరోయిన్ మమత మాట్లాడుతూ, “ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్ గారికి, వరుణ్ గారికి తాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఈ సినిమా ని ఆదరించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
డైరెక్టర్ వికాస్ గారు మాట్లాడుతూ, “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరి నే సెట్ అవుతుందని ఈ టైటిల్ సెట్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాం” అన్నారు.
హీరో మరియు నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ, “ఈ సినిమా తో గట్టిగా హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నేను చిరంజీవి గారికి మహేష్ బాబు గారికి కూడా అంతే అభిమానిని. ఈ సినిమా టైటిల్ లో నే దమ్ముంది. పోకిరి కి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే!
మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, “ఈ సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. మా సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

బ్యానర్: రాజా మూవీస్
టైటిల్: పోకిరి
దర్శకుడు: వికాస్
నిర్మాత: వరుణ్ రాజు
సమర్పకులు: ప్రమోద్ రాజు
హీరో: వరుణ్ రాజు
హీరోయిన్: మమతా రెడ్డి
సంగీతం: ఉదయ్ కిరణ్ UK
కెమెరా: వెంకీ & వంశీ
నటీనటుల: చిత్రమ్ శ్రీను, సూర్య, గంగవ్వ, బెనర్జీ, సత్య ప్రకాష్, మరియు తదితరులు
పి ఆర్ ఓ : మధు విఆర్

]]>
https://maamovie.com/2024/12/31/the-song-launch-from-the-movie-pokiri-is-the-song-naa-guldi-pradi/feed/ 0 4945