Fashion

67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల

67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల

కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆద్వ‌ర్యంలో అట్టహాసంగా జ‌రిగిన 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల ప్ర‌ధానోత్స‌వ వేడుక‌

దక్షిణాది భాషలు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో అత్యుత్తమ కళాకారులను గౌరవిస్తూ  ఫిల్మ్‌ఫేర్ కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో కలిసి 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డులను ప్రకటించింది. ఈ సినిమాటిక్ ఎక్సలెన్స్ వేడుకకు తొలిసారి బెంగుళూరు వేధిక అయింది. 2020 మరియు 2021 సంవత్సరాల మధ్య నాలుగు భాషల్లో విడుదలైన చలనచిత్రాలలోని అత్యుత్తమ చలనచిత్రాలు, నటీనటులు, సాంకేతిక ప్రతిభావంతులకు గౌరవనీయమైన బ్లాక్ లేడీ ప్రదానం చేయబడింది. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మిరుమిట్లు గొలిపే రీతిలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్‌, సుకుమార్‌, సూర్య‌-జ్యోతిక‌, నాని, వైష్ణ‌వ్ తేజ్, పూజా హెగ్డె, సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మృణాల్‌ ఠాకూర్‌, ట‌బు, దేవి శ్రీ ప్ర‌సాద్‌, సందీప్ కిష‌న్‌, అల్లు అర‌వింద్‌, మైత్రి మూవీ మేక‌ర్స్ ర‌విశంక‌ర్‌, న‌వీన్ యెర్నేని, సుధా కొంగ‌ర‌, మాధ‌వ‌న్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, జీవీ ప్ర‌కాశ్‌, సుర‌భి, ముర‌ళి శ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కేట‌గిరీల వారిగా అవార్డుల‌కు ఎంపికైన సినిమాల‌ జాబితా..

ఉత్తమ చిత్రం : పుష్ప: ది రైజ్
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : నాని (శ్యామ్ సింఘ‌ రాయ్)
ఉత్తమ నటి : సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : సాయి పల్లవి (శ్యామ్ సింఘ రాయ్)
ఉత్తమ సహాయ నటుడు : మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి : టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటుడు (తొలి ప‌రిచ‌యం) : పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ నటి (తొలి ప‌రిచ‌యం) : కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బ‌మ్‌ : దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (జాను)
ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ గాయని : ఇంద్రావతి చౌహాన్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ కొరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్)

*లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు : అల్లు అరవింద్*

About Author

MaaMovie-admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *