సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకున్న….అందాల నటి నందిని రాయ్
చిన్న తనంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి తన అందం, అభినయంతో పలు అందాల పోటీల్లో పాల్గొని తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది నందిని రాయ్.2011 లో “040” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నందిని రాయ్ మాయ,ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్.శివరంజని వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు లో సహజ నటి అనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ 2 లో బెస్ట్ కంటస్టెంట్ గా నిలిచి మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్.
బాలీవుడ్ లో “ఫ్యామిలీ ప్యాక్” సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఈ సుందరి “నందీ” వంటి సినిమాలతో పాటు మలయాళం లో లాల్ భాగ్, గ్రహణం , కన్నడ లో గుడ్ బాయ్ డిసెంబర్,ఖుషి ఖుషి యాగీ, ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అనతికాలంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నందిని రాయ్ తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా వుంటుంది.తాజాగా తను కోతి కొమ్మచ్చి సినిమాలోని ఒక పాటలో నటిస్తుంది. అలాగే రాధికా శరత్ కుమార్, సాయికుమార్ లు ప్రధానపాత్రలలో నటించిన “గాలి వాన” వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ నటించి మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ZEE 5 రిలీజ్ అయ్యింది మరియు హై ప్రీస్ట్, షూట్ యట్ అలైర్, మెట్రో కథలతో యాంతాలజీ సిరీస్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ అఫ్ గాడ్’ వెబ్ సిరీస్ లో నటించి అందరినీ అక్షర్యానికి గురిచేసిన ఈ అమ్మడు బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సాయి కుమార్, వరుణ్ సందేశం, రాజ్ తరుణ్ సోహెల్, రాహుల్ శిల్పిగంజ్, లహరి శారీ భాను, తనిష్క్, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘు లు హాజరయ్యారు. వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది.