సి ఎల్ పి మూవీస్ ప్రొడక్షన్ నెం 2 చిత్రం అనౌన్స్మెంట్
కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్మెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో…
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ… ఈ నెల 19న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. జి.ఎల్.బి.శ్రీనివాస్గారికి నా అభినందనలు. ఐక్యూ కంప్లీట్ చేశాము. అందులో ఉన్నవారినే ఈ చిత్రంలో కూడా తీసుకోవడం జరిగింది. సుమన్ గారు ఈ చిత్రానికి చాలా హెల్ప్ చేశారు. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. ఐక్యూ చిత్రంగాని అలాగే ఈ చిత్రమైన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాము. ఐక్యూ చిత్రంలో హీరోగా మా అన్నయ్య కొడుకు సాయిచరణ్ నటించారు. రెండో చిత్రం ఆయన వేరే బ్యానర్లో నటిస్తే బావుంటుందని. బయట బ్యానర్కి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక ఎక్స్ పీరియన్స్ వస్తుంది అని ఆయన్ని రెండో చిత్రం వేరే బ్యానర్లో చేయమనడం జరిగింది. ఫిబ్రవరి ఫస్ట్ నా పుట్టినరోజు సందర్భంగా జియోలక్ష్మణ్గారు చెప్పినట్లు కథ రెఢీగా ఉంటే సుమన్గారిని లీడ్ తీసుకుని సినిమా చేయడానికి నేను రెఢీగా ఉన్నాను అన్నారు. నా ప్రొడక్షన్ నెం3.గా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాను అన్నారు.
దర్శకుడు జిఎల్బి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐక్యూ చిత్రం మొదటి కాపీ రావడం మరియు ఇదే బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా అనౌన్స్మెంట్ జరగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్ర షూటింగ్ 19 నుంచి అనందపురంలో మొదలవుతుంది. ఇదొక పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. భారీ తారాగణంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్గారు చాలా చక్కగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అన్నారు. ఈ చిత్రంలో ఉన్న కాస్టింగ్ మొత్తం ఐక్యూ చిత్రంలో నటించిన వారే. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
హీరో సుమన్ మాట్లాడుతూ… ఈ క్రిస్ట్మస్కి నేను ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్ళ పూర్తయి 46వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. నేను ఆ కళామతల్లికి ఎంతో రుణపడి ఉంటాను అన్నారు. 45 ఏళ్ళగా ఎన్నో చిత్రాల్లో నటించాను. తెలుగులో దాదాపు 100 చిత్రాలకు పైగా నటించాను. అలాగే తమిళ్, కన్నడ చిత్రాల్లో 50 చిత్రాల్లో నటించాను. మొత్తం మీద దాదాపు 700 చిత్రాల్లో నటించాను. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన నా దర్శక నిర్మాతలకి అలాగే నా తల్లిదండ్రులకి, నా అభిమానులకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను అన్నారు. 1977లో నేను ఫీల్డ్లోకి వచ్చాను. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అలాగే పల్లె రగునాధ్రెడ్డిగారు కూడా ఓ కలెక్టర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన ఒక మంచి పొలిటీషియన్ మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా ఓ 70 కాలేజీలు నడుపుతున్నారు. ఈ చిత్రం చాలా ఫాస్ట్గా పూర్తి చేశారని చెప్పాలి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ఏ నటుడికైనా సరే హిట్ వచ్చిన తరువాత అవకాశం రావడం గొప్ప కాదు. హిట్లు రాకపోయినా అవకాశం రావడం చాలా గొప్ప అని అన్నారు.
బాబా మాట్లాడుతూ… నేను అనంతపురం రాయదుర్గం నుంచి వచ్చాను. సుమన్గారు నాకు బాగా పరిచయం ఉండంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. అంతేకాక శ్రీనివాస్గారు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటివారు. ఇదొక చలన చిత్రం అంటే.. చలనం అంటే ఇందులో నటించే నటీ నటులు ఎంతో చలనంతో పని చేస్తారు. వారందరికీ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్ర నిర్మాత ఆర్ధికంగా స్థిరపడాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటాను అన్నారు.
హీరో భూషణ్ మాట్లాడుతూ… జిఎల్బి శ్రీనివాస్గారు నేను కలిసి ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ని రోజులకి కుదిరింది. సుమన్గారితో కలిసి గతంలో ఓ చిత్రంలో నటించాను. నలుగురి కుర్రాళ్ళలో ఒకడిగా చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో డైరెక్ట్ లీడ్గా ఆయనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కోస్టార్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెపుతున్నాను అన్నారు.
హీరోయిన్ అంకిత మాట్లాడుతూ… కెఎల్పి మూవీస్ ప్రొడక్షన్ నెం 2లో హీరోయిన్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. 19న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది. అనంతగిరిలో షూటింగ్ మొదలవుతుంది. ప్రొడ్యూసర్గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టీమ్ అందరినీ చాలా బాగా చూసుకున్నారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పల్లవి, పద్మిని, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నటీనటులుః సుమన్, భూషన్, అంకిత, పద్మిని, పల్లవి, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి, శివసాయిబాబా.
టెక్నీషియన్లుః ప్రొడ్యూసర్ః కాయగూరల లక్ష్మిపతి, కాయగూరల రాజేశ్వరి, స్క్రీన్ ప్లే డైరెక్టర్- జి.ఎల్.బి.శ్రీనివాస్, స్టోరీ- దివాకర్యడ్ల, స్టోరీ- దివాకర్ యడ్ల, డైలాగ్స్- పోలూరి టికాచలం, మ్యూజిక్- వరికుప్పల యాదగిరి.