గ్రాండ్ గా మార్చి 3 న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచిగాడి పెళ్లి”
కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచి గాడి పెళ్లి ” ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ కు, టీజర్ కు, పాటలకు, ట్రైలర్ కు , ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా
*చిత్ర దర్శక, నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ..* “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం.టీజర్ చూసిన కొంతమంది ఇది 12th మ్యాన్ ఆడాప్షన్ సినిమాలా ఉంది అంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. ఇది ఏ సినిమాను చూసి కాపీ కొట్టలేదు.ఇది మా స్ట్రెయిట్ తెలుగు మూవీ.. తాజాగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేసిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. అందుకు వారికి మా ధన్యవాదాలు. మా ట్రైలర్ చూసిన తరువాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి థియేటర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మా ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. లిరిక్ రైటర్స్ అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” , శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.అలాగే మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్ మరియు ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
*నటి నటులు*
సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్,
ప్రవీణ్ రెడ్డి, బన్ని వాక్స్, సతీష్ శెట్టి, కియారా నాయుడు,
మాస్టర్ రాకేష్ తమోగ్న తదితరులు
*సాంకేతిక నిపుణులు*
సినిమా పేరు: రిచి గాడి పెళ్లి
బ్యానర్: కెఎస్ ఫిల్మ్ వర్క్స్
నిర్మాత: కేఎస్ హేమరాజ్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: KS హేమరాజ్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్
సంగీతం: సత్యన్
ఎడిటర్: అరుణ్ EM
కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి
సాహిత్యం: అనంత శ్రీరామ్ & శ్రీ మణి
పి ఆర్ ఓ : మధు వి ఆర్