“అథర్వ” టీజర్ గ్రాండ్ రిలీజ్.. సినిమాపై అంచనాలు పెంచేసిన విజువల్స్

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, నటులుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా “అథర్వ” (Atharva). డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన యూనిట్.. తాజాగా వదిలిన టీజర్ తో ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది.హీరో ఆకాష్ పూరి,క్లూస్ హెడ్ వెంకన్న, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, స్పై డైరెక్టర్ & ఎడిటర్ గ్యారీ,డైరెక్టర్స్ సుశాంత్ రెడ్డి, కనక మామిడి, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోతూ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఒక నిమిషం 15 సెకనుల నిడివితో కట్ చేసిన వీడియోలోని క్రైం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచేశాయి. వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీ చేధించేందుకు సైబరాబాద్ క్లూస్ టీమ్ లో జాయిన్ అయిన హీరో.. హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి పన్నాగాలు వేశారు? అనే సీన్స్ ఆసక్తికరంగా చూపిస్తూ.. యాక్షన్ సీన్స్ కలగలిపి ప్రేక్షకుల దృష్టిని లాగేశారు మేకర్స్. ఈ వీడియోలో ”ఏరా పద్మవ్యూహంలో పెట్టి పైకి పంపిద్దాం అనుకున్నార్రా.. అసలు వ్యూహం పన్నిందే నేను రా..” అనే డైలాగ్ హైలైట్ కాగా.. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ అయింది. టీజర్ అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

*గెస్ట్ గా వచ్చిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ..* టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో కార్తీక్ రాజు చాలా బాగా నటించాడు. దర్శకుడు ఎంచుకున్న క్రైం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్టోరీ చాలా బాగుంది. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ ఇంపార్టెంట్. చరణ్ కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “అథర్వ” సినిమా దర్శక , నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..* క్లూస్ టీమ్ వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

*క్లూస్ టీం హెడ్ వెంకన్న మాట్లాడుతూ..* క్లూస్ టీం అనే సబ్జెక్టుతో వస్తున్న సినిమా ఇది. మేము ఎక్కువగా బి హైండ్ ద స్క్రీన్ లో కనిపిస్తుంటాము. ఇన్వెస్టిగేటర్స్ ముందుంటారు. చాలా సెన్సెషనల్ కేస్ లలో మేమిచ్చే లీడ్స్ తోనే ముందుకు వెళుతుంటారు. అలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకుని అథర్వ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ చాలా బాగా తీశాడు. త్వరలో వస్తున్న అథర్వ మూవీ బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

*కూచిపూడి వెంకట్ మాట్లాడుతూ..* కార్తీక్ నాకు బాగా తెలుసు. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే ఎదో తెలియని క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దర్శక, నిర్మాతలు సినిమాను చాలా బాగా తీశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

*స్పై డైరెక్టర్ & ఎడిటర్ గ్యారీ, మాట్లాడుతూ…* కార్తీక్ తో, శ్రీ చరణ్ తో ఇంతకుముందు ఒక ప్రాజెక్టు చేశాను. తనకు పట్టుదల ఎక్కువ. ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే ఆది పూర్తయ్యేవరకు వదలడు. టీజర్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ తో తీశారు. చాలా కష్టపడి పని చేసిన ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

*దర్శకులు సుశాంత్ మాట్లాడుతూ..* ముఖ్యంగా ఈ సినిమా కార్తీక్ రాజు కంటే కూడా వారి తండ్రి కోసం బాగా ఆడాలి. ఎందుకంటే వారి తండ్రికి సినిమా అంటే ఎంతో పిచ్చి. టీజర్ చాలా బాగుంది. ఏప్రిల్ మూడవ వారంలో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

*చక్రి మాట్లాడుతూ..* టీజర్ చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డి.ఓ.పి ల వర్క్ చాలా బాగుంది. కార్తీక్ రాజు ఇంతకుముందు చేసిన సినిమాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. తనను ఏ రోల్ లో చూడాలనుకున్నామో ఫైనల్ గా ఇప్పుడు ఆ రోల్ లో చూస్తున్నట్లు అనిపించింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ రగ్డ్ గా బాగా ఉంది. తనకు ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

*అంజి రామ్ మాట్లాడుతూ..* నాలుగు సంవత్సరాలనుండి ఈ స్టోరీ మీద ట్రావెల్ చేస్తున్నాడు. నాలుగు లాంగ్వేజ్ లలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ మహేష్ మంచి కథను సెలెక్టచేసుకొని తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

*గంగాధర్ మాట్లాడుతూ..* కార్తీక్ రాజు మొదటి సినిమానుండి తెలుసు. ఇందులో కార్తీక్ చాలా బాగా నటించాడు. దర్శక, నిర్మాతలు చాలా బాగా తీశారు. మ్యూజిక్ అద్భుతముగా ఉంది. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

*చిత్ర నిర్మాత సుభాష్ మాట్లాడుతూ..* మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..* మా టీజర్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ తో పాటు లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని కోణాలను టచ్ చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాలో కార్తీక్ రాజు సరసన సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ పాకాల, డి. ఓ పి,చరణ్ మాధవనేని, ఎడిటర్ ఉద్దవ్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ లతో పాటు క్లూస్ డిపార్ట్మెంట్, నటీ నటులు, టెక్నీసియన్స్ అందరూ ఫుల్ సపోర్టచేయడం తో సినిమా బాగా వచ్చింది. నిర్మాత సుభాష్ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చారు. త్వరలో వస్తున్న మా సినిమాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

*సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ..* గతంలో నేను చాలా థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చేశాను. కార్తీక్ తో ఇది నా రెండవ సినిమా. క్లూస్ డిపార్ట్మెంట్ కు రిలేటెడ్ గా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో మూడు పెప్పీ సాంగ్స్ ఉంటాయి.యంగ్ ట్యాలెంట్ ఉన్న దర్శక, నిర్మాతలతో పని చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు.

*నటుడు గగన్ మాట్లాడుతూ..* నా సినిమా ధర్మపురి సినిమాలో హీరోగా చేసిన తర్వాత మహేష్ ఫోన్ చెసి విలన్ క్యారెక్టర్ ఉందని చెప్పాడు. ఇప్పుడొస్తున్న కల్ట్ డైరెక్టర్స్ మంచి కథతో స్ట్రాంగ్ మార్క్ పడేలా చేస్తున్నారు. దాంతో నేనేమి ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

*చిత్ర హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ..* “అథర్వ” సినిమా క్లూస్ టీం పై ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఖర్చు పెట్టి తియాలంటే ఏ నిర్మాతకైనా గట్స్ ఉండాలి. క్లూస్ టీం సెట్ వేయడానికి 50 లక్షలు అవుతుందని చెపితే నిర్మాత ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా వెంటనే సినిమాకు ఏం కావాలో అన్ని సమాకుర్చారు. చరణ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ధర్మపురి లాంటి సినిమాలో హీరోగా చేసిన గగన్ చేయడం మా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

*చిత్ర హీరోయిన్ ఐర మాట్లాడుతూ..* ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

*నటుడు కిరణ్ మాట్లాడుతూ..* ఇది నాఫస్ట్ మూవీ. సినిమా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాకు అందరూ చాలా కసితో పని చేశాము. త్వరలో వస్తున్న మా “ఆథర్వ” సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటీనటులు
కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
బ్యానర్: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన,దర్శకత్వం: మహేష్ రెడ్డి
నిర్మాత: సుభాష్ నూతలపాటి
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌: విజయ, ఝాన్సీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డిఓపి చరణ్ మాధవ నేని
ఎడిటింగ్ ఎస్.బి ఉద్ధవ్
ఆర్ట్ రామ్ కుమార్
లిరిసిస్ట్ : కాసర్ల శ్యామ్ కిట్టు విస్సా ప్రగడ
కొరియోగ్రాఫర్స్ భాను రాధాకృష్ణ విజయ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్ పర్వతనేని రాంబాబు

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *