‘కర్కశం’ చిత్ర ఫస్ట్‌ లుక్‌ విడుదల!!!                                                                                          జిఎన్‌ఆర్‌ దర్శకనిర్మాతగా జిఎన్‌ఆర్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం ‘కర్కశం’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల ఫిల్మ్‌ చాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌, నటుడు, దర్శకనిర్మాత సాయు వెంకట్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి, సమాజాన్ని జాగృత పరిచే ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన దర్శకనిర్మాత జిఎన్‌ఆర్‌ను అభినందించారు. సినిమా విజయవంతం కావాలని అభిలషించారు.

దర్శకనిర్మాత జి.ఎన్‌ఆర్‌ మాట్లాడుతూ ‘‘మా గురువు ఎంఎస్ రాజు గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశా. ఆ అనుభవంతో దర్శకుడిగా మారాను.కొన్నేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రాసుకున్నా. సమాజంలో ఆడపిల్లలపై నానాటికీ పెరిగిపోతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందనే సందేశంతో ఈ చిత్రం రూపొందుతుంది. సమాజాన్ని జాగృత పరిచే అంశాలున్నాయి. సినిమాలో చాలాభాగం హైవేలో షూటింగ్‌ చేయాల్సిన వచ్చింది. పర్మిషన్లు విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ విజయవంతంగా పూర్తి చేశాం. ఆ హైవే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అనేక వ్యయప్రయాసలతో సినిమా నిర్మించాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని అన్నారు.

నటీనటులు మాట్లాడుతూ ‘‘జిఎన్‌ఆర్‌ ఎంతో ఓపికతో మా చేత చక్కని నటన రాబట్టుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన జిఎన్‌ఆర్‌కు కృతజ్ఞతలు. నటులుగా ఈ చిత్రం మాకు గుర్తింపు తీసుకొస్తుంది’’ అని అన్నారు.

నటీనటులు – సాంకేతిక నిపుణులు: ప్రేమలత, భూమిరెడ్డి వెంకట్‌, చైత్ర, శ్రీనివాస్‌, బత్తుల గోపాల్‌, కళావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: లక్ష్మీ శ్రీరామ్‌, కూర్పు: కల్యాణ్‌, కో డైరెక్టర్ : సి.పి.ఆర్‌, కెమెరా:ఎస్‌. ప్రసాద్‌ నిర్మాణ నిర్వహణ: జి.నాగశేషు, సహనిర్మాతలు: సుధ, చంద్రిక, సంధ్య, సమర్పణ: జి.సుబ్బ లక్ష్మమ్మ, కథ-కథ-మాటలు-సంగీతం-నిర్మాత-దర్శకత్వంఫ జి.ఎన్‌.ఆర్‌.

 

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *