పరారీ మూవీ లో ఎల్ల ఎల్ల సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు
శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం లోని ఎల్ల ఎల్ల సాంగ్ ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాథ్ రావు గారు విడుదల చేశారు
ఈ సందర్భంగా డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ: ఎల్ల ఎల్ల పాటను రిలీజ్ చేయడం సంతోషంగా వుంది. ఎప్పుడు నా క్షేమం కోరే వ్యక్తుల్లో ఈ సినిమా నిర్మాత గిరి అన్న ఒకరు.వ్యాపారంలో రాజకీయాల లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యోగి ని హీరోగా చేసి పరారీ సినిమాను నిర్మించారు. యోగి సరస్వతి పుత్రుడు. నేను ఈ సినిమాను చూసాను. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పాటలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. పాటలు వింటుంటే చక్రి సంగీతం వింటున్నట్టు ఉంది. ఒకస్టార్ హీరో సాంగ్స్ ఎలా ఉంటాయో ఖర్చుకు వెనుకాడకుండా అలా తీశారు. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా పాటను రాశారు. కామెడీ కూడా చాలా బాగుంది. గౌతం రాజు గారి ఎడిటింగ్ చాలా బాగుంది.గౌతం రాజు గారికి ఈ చిత్రం అంకితమివ్వాలి అని నిర్మాత గిరి అన్నాకు విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా మార్చి 30న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి ఈ టీం ను ఆశీర్వదించండి అని అన్నారు.
నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ; మా ఎల్ల ఎల్ల సాంగ్ ను నక్కిన త్రినాథ్ రావు గారు రిలీజ్ చెయ్యడం మా అదృష్టం గా భావిస్తున్నా. మ్యూజిక్ డైరెక్టేర్ మహిత్ నారాయణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. మా హీరో యోగి ని ప్రేక్షకుల ఆదరించాలని కోరు కుంటున్నాను. మా శంకర ఆర్ట్స్ బ్యానర్ లో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తాము. ఇందులో నటించిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ మాకు కోపరేట్ చేశారు.మార్చి 30న సినిమా రిలీజ్ అవుతుంది.మా ప్రయత్నాన్ని ఆడియన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ; సక్సెస్ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు గారు మా ఎల్ల ఎల్ల పాట ను రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది యువకులు ఒక ఇన్స్యూ పై చేసిన రన్ ఫన్ ఏమిటి అనేది ఈ సినిమా.రామ జోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు దీపక్ మంచి వాయిస్ ఇచ్చారు. మా సాంగ్స్ ని ఆదరించి సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు
హీరో యోగిశ్వర్ మాట్లాడుతూ: నక్కిన త్రినాథ్ రావు గారు మా ఎల్ల ఎల్ల సాంగ్ ని రిలీజ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. రామజోగయ్య శాస్త్రి గారికి సింగర్ దీపక్ కి థాంక్స్. మార్చి 30న సినిమా రిలీజ్ అవుతుంది అని అన్నారు
నటీ నటులు …
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,