పరారీ మూవీ లో గరం గరం సాంగ్ ను రిలీజ్ చేసిన ఆస్కార్ అవార్డ్ విన్నర్ ప్రముఖ గేయ రచయిత చంద్ర బోస్
మార్చి 30న గ్రాండ్ రిలీజ్
శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లోని గరం గరం సాంగ్ ని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు విడుదల చేశారు
ఈ సందర్భంగా శ్రీ చంద్రబోస్ మాట్లాడుతూ: శంకర ఆర్ట్స్ బ్యానర్ లో గిరి గారు నిర్మించిన పరారీ సినిమాలో గరం గరం పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడు మహిత్, పాట పాడిన ఆదర్శిని నాకు ఆప్తులు. ఈ పాట వినులవిందు గా మాత్రమే కాకుండా కనుల విందుగా కూడా వుంది. ఖర్చుకు వెనుకాడ కుండా నిర్మాత గిరి భయ్య నిర్మించారు. మార్చి 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటి నటులకు సాంకేతిక నిపుణుల కు నా శుభాసిస్సులు అని అన్నారు
నటీ నటులు …
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,