విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌లో విడుదల చేశారు. ‘‘టైటిల్‌ బావుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్‌ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

దర్శకుడు శాంతికుమార్‌ మాట్లాడుతూ‘‘ ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్‌ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నాను’’ అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘
దర్శకుడు చెప్పిన కథనచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. బిజీగా ఉండి కూడా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన విజయేంద్రప్రసాద్‌ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించబోతున్నాం’’ అని అన్నారు.
నటీనటులు:
సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు:
కెమెరా: యూ’హ్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, బ్యాక్గ్రౌండ్: ఎస్ చిన్న, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్, కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్, ఫైట్స్: నందు, బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి, పీఆర్వో: మధు విఆర్

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *