కమర్షియల్ మూవీగా మే 5న రిలీజ్ అవుతున్న మా ‘అరంగేట్రం’ సినిమా ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది : దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్
రోషన్. ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుద్. పూజ, లయ, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ. తదితరులు నటీనటులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరంగేట్రం’. మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా…
దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ మూవీ పక్కా కమర్షియల్ మూవీ. అయితే సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి లవ్ స్టోరి ఉంటుంది. వీటిని లింక్ చేసేలా క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. పాటలు, ఫైట్స్, కామెడీ అన్నీ ఉంటాయి. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా. ఇందులో అనుకోకుండా నేను నటించాల్సి వచ్చింది. ఒక్కొక్క క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. వారు అందించిన సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. చిన్న సినిమానే అయినప్పటికీ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేంత ఫైనాన్షియల్ స్టామినా మాకు లేకపోయినప్పటికీ మీడియా, ఆడియెన్స్ మంచి సినిమాలను ఆదరిస్తారనే నమ్మకంతో థియేటర్స్‌లోకి వస్తున్నాం. మా సినిమాను ఆదరించండి. మా నిర్మాత మహేశ్వరిగారు, సహ నిర్మాత విజయలక్ష్మిగారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేష్‌గారికి థాంక్స్. మా మ్యూజిక్ డైరెక్టర్ గిడియాన్ కట్టాగారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. రోషన్, ముస్తఫా, అనిరుద్ సహా అందరికీ థాంక్స్. మే 5న మా సినిమాను చూసే ఆడియెన్స్ మంచి ఫీల్‌తో బయటకు వస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత మహేశ్వరి.కె మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ సినిమా చాలా బాగా వచ్చింది. మే 5న థియేటర్స్‌లో మీ ముందుకు వస్తున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
సహ నిర్మాత విజయ లక్ష్మి మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్ సినిమాను ఆదిరిస్తారనే నమ్మకంతో మే 5న ‘అరంగేట్రం’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ కట్టా మాట్లాడుతూ ‘‘నేను గతంలో మంత్ర సినిమాకు కంపోజర్‌గా వర్క్ చేశాను. చాలా కాలం ఇండస్ట్రీలో జర్నీ ఉంది. బిగినింగ్‌ను ‘అరంగేట్రం’ అని అంటారనే సంగతి తెలిసిందే. ఇది నాకొక రీ ఎంట్రీ అనాలి. నా లైఫ్‌కు మంచి సక్సెస్‌ను ఇస్తుందని భావిస్తున్నాను. ప్రతి సీన్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంటుంది. నాతో పాటు ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడ్డాం. థియేటర్స్‌కు వచ్చే ఆడియెన్స్‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.
ముస్తఫా మాట్లాడుతూ ‘‘‘అరంగేట్రం’ సినిమాలో మంచి పాత్ర చేశాను. నా చిన్నప్పటి రోల్‌లో రోషన్ నటించాడు. అందరూ అద్భుతంగా నటించారు. డైరెక్టర్ శ్రీనివాస్ ప్రభన్‌గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గిడియాన్ కట్టాగారికి థాంక్స్’’ అన్నారు.
అనిరుద్ మాట్లాడుతూ ‘‘ఈ ‘అరంగేట్రం’ సినిమాతోనే నటుడిగా అరంగేట్రం చేస్తున్నాను. గోపిగారు, సలీమ్‌గారికి థాంక్స్. ఇక మా డైరెక్టర్ శ్రీనివాస్‌గారు ఎంకరేజ్ చేస్తూ మంచి ఔట్‌పుట్ రాబట్టుకున్నారు. మా నిర్మాతగారికి థాంక్స్. మా డైరెక్టర్‌గారు ఎంతో ప్యాషన్‌తో చేసిన సినిమా. మే 5న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
రోషన్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష సినిమాలోలాగానే ‘అరంగేట్రం’లోనూ డిఫరెంట్ రోల్ చేశాను. మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీనివాస్‌గారికి, మా నిర్మాతలకు థాంక్స్. మా టీమ్‌కు థాంక్స్. మే 5న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, టెక్నీషియన్స్ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.
నటీనటులు:
రోషన్.జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుద్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శత్వం: శ్రీనివాస్ ప్రభన్
నిర్మాత: మహేశ్వరి.కె
బ్యానర్: మహి మీడియా వర్క్స్
మ్యూజిక్: గిడియాన్ కట్టా
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్(సలీమ్)
ఎడిటర్ : మధు
ప్రొడక్షన్ డిజైనర్: రమేష్ బాబు చిన్నం(గోపి)
కాస్ట్యూమ్స్: రాబాబ్ చి
స్టంట్స్: స్టార్ మల్లి
డైలాగ్స్: శ్రీనివాస్ ప్రభన్
లిరిక్స్: సంజయ్.జి
కొరియోగ్రఫీ: అన్నా రాజ్
పి.ఆర్.ఓ: నాగేశ్వరరావు (ఫ్రైడే పోస్టర్)