అంగరంగవైభవంగా కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, ఎమెస్కే ప్రసాద్ ల చేతుల మీదుగా జేవీఆర్జే రియల్ ఎస్టేట్ గ్రూప్ బ్రోచర్ లాంచ్

జేవీఆర్జే రియల్ ఎస్టేట్ గ్రూప్ కొత్త ప్రాజెక్టుల బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం అతిరథ మహారధుల సమక్షంలో హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక కోహినూర్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్కే ప్రసాద్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జేవీఆర్జే రియల్ ఎస్టేట్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఘట్కేసర్ ఆర్ హోమ్స్ జై వాసవి బ్లిస్ హైట్స్, పటాన్చెరువు జై వాసవి ఓఆర్ఆర్ హైట్స్ ప్రాజెక్టులకు సంబంధించిన బ్రోచర్లను విశిష్ట అతిథులుగా హాజరైన వారు లాంచ్ చేశారు. అంతకన్నా ముందే జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కపిల్ దేవ్, వివిఎస్ లక్ష్మణ్, ఎంఎస్కే ప్రసాద్.

ఇక ఈ సందర్భంగా జేవీఆర్జే రియల్ ఎస్టేట్ గ్రూప్ అధినేత భాస్కర్ గుప్తా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు ఇతర శ్రేయోభిలాషులకు తమ కస్టమర్లకు ఆహ్వానం పలికారు. జేవీఆర్జే రియల్ ఎస్టేట్ గ్రూప్ ఏం చేయబోతోంది? తమ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? అనే విషయాలు వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జేవిఆర్జె రియల్ ఎస్టేట్ గ్రూపులో ఆర్ హోమ్స్ అనేది కన్స్ట్రక్షన్ విభాగంగా ఉందని ఆర్ హోమ్ తరఫున అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టి ప్రజలకు తక్కువ ధరకే అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా పటాన్ చెరువు దగ్గర ఉన్న కడతలూరులో మూడు ఎకరాల 11 గుంటల్లో ఫేస్ 1 జి ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్స్ మూడు టవర్లలో కట్టాలని నిర్ణయించుకున్నాము, 252 యూనిట్లు వచ్చేలా ప్లాన్ చేశామని అన్నారు. ఆ తర్వాత 9 ఎకరాల ఏడు గంటలు ఫేస్ 2 కింద జి ప్లస్ 18, 6 టవర్ల తోటి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇవి కాకుండా ఘట్కేసర్ లో ఇన్ఫోసిస్ దగ్గరలో మూడు ఎకరాల వెంచర్ కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇవన్నీ కూడా హెచ్ఎండీఏ అప్రూవ్డ్, రెరా సర్టిఫైడ్ అని ఆయన వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలలో ఇప్పటికే కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైందని అన్నారు. ఇక మా ఆర్ హోమ్స్ కంపెనీకి కపిల్ దేవ్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కపిల్ దేవ్ గారి గురించి చెప్పాల్సిందేమీ లేదని ఆయన గురించి తన కన్నా ప్రతి భారతీయుడికి బాగా తెలుసని అన్నారు. భారతదేశానికి మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ సంపాదించిన కపిల్ దేవ్ గారు కావాలనుకుంటే హైదరాబాదులో ఎంతో పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించవచ్చు కానీ మేము చేసే పని మీద నమ్మకంతో ఆయన మాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నారు. దానికి మేము అదృష్టంతులుగా భావిస్తున్నామని అన్నారు. అలా జరగడానికి కర్మ, కర్త, క్రియ మొత్తం ఎమ్మెస్కే ప్రసాద్ గారేనని అన్నారు. ఆయనని కూడా తమ బ్రాండ్ ప్రమోటర్గా ఉండాలని రిక్వెస్ట్ చేయగా ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారని ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ గారి గురించి కూడా క్రికెట్ అభిమానులకు క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి అతిరథ మహారధులు బ్రాండ్ అంబాసిడర్లుగా, బ్రాండ్ ప్రమోటర్లుగా ఆర్ హోమ్స్ కి ఉండడం అనేది చాలా సంతోషం కలిగిస్తోందని ఒక రకంగా తనకు మాటలు రావడం లేదని అన్నారు. తమ ప్రొడక్ట్ని కస్టమర్లకు ఇన్ టైం లో ఇవ్వాలనే లక్ష్యంతోని రాత్రింబవళ్లు పనిచేస్తామని ఆయన అన్నారు. రెండు వెంచర్లలో కపిల్ దేవ్ గారు ఎంఎస్కే ప్రసాద్ గారు భూమి పూజకు కూడా హాజరై వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. తమ ఆర్కిటెక్ట్ జయ కుమార్ కూడా ఒక వ్యాపారంలా కాకుండా సొంత సోదరుడిలా అన్ని విషయాల్లోనూ అండదండగా నిలిచారని అన్నారు. మేము ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు చేయాలని మీడియా సహకారం అందులో ఉండాలని భాస్కర్ గుప్తా అభిలషించారు. ఇక తాము మరో నాలుగు ఐదు ప్రాజెక్టులు చేస్తున్నామని తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు ఉంటాయని అన్నారు. ఈ క్రమంలో ఒక రెండు ప్రాంతాల్లో ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలు స్థాపించి క్రీడాకారులకు తమ వంతు తోడ్పాటు అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

బ్రాండ్ ప్రమోటర్ ఎమ్మేస్కే ప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు మీడియా మిత్రులందరికి పేరుపేరునా నమస్కారాలు తెలిపారు. రెండు నెలల క్రితం భాస్కర్ గుప్తా గారు, వెంకట్ మురళి గారు వచ్చి నన్ను కలిసి వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలన్నీ చెప్పడం జరిగింది. నేను చాలా ఎమోషనల్ పర్సన్ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భాస్కర్ గుప్తా గారి లైఫ్ స్టోరీ చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. 14 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి వేరేవరో ఇంట్లో ఉండి అప్పుడే రియల్ ఎస్టేట్లోకి వెళ్లి అప్పటినుంచి రియల్ ఎస్టేట్లో మెలుకువలు నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. నాకు ఆయన స్టోరీ నచ్చి ఆయనతో పాటు ఉందాం అనే ఉద్దేశంతో వెంటనే బ్రాండ్ ప్రమోటర్గా ఉండాలని యాక్సెప్ట్ చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 60 -70 శాతం మిడిల్ క్లాస్ ప్రజలే ఉంటారు వాళ్లకు అందుబాటులో ఉండే ప్రాజెక్టులకు నేను బ్రాండ్ ప్రమోటర్గా వ్యవహరించడం గర్వంగా భావిస్తున్నాను. ఇక్కడున్న 80% ఉంది అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కలగా ఉండే సొంతింటి కలలు నిజం చేయడానికి ఈ ప్రాజెక్టులు చేస్తున్నానని గుప్తా గారు చెప్పడంతో కచ్చితంగా నేను ఈ ప్రాజెక్టులో వారితో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయాన్ని కపిల్ దేవ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా నేను రోటి కూడా తినలేని పరిస్థితుల్లో వచ్చి క్రికెట్ ఆడి నిలబడ్డాను? భాస్కర్ గుప్తా గారి కథ వింటున్న నాకు అలాంటి పోరాట పటిమే కనిపిస్తోంది. అందుకే ఆయన కూడా కచ్చితంగా కలిసి నడుస్తానని అన్నారు. ఇదంతా పది రోజుల్లోనే జరిగిపోయి ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం జరిగిపోయిందని అన్నారు. పటాన్చెరువు, ఘట్కేసర్ లో ఉన్న రెండు ప్రాజెక్టులకు సంబంధించిన భూమి పూజ కూడా ఆయనే పర్సనల్గా హాజరయ్యారని అన్నారు. తాను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి తాను బ్రాండ్ ప్రమోటర్గా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ ద్వారా గ్రాండ్ మాస్టర్ గా మారబోతున్న గుంటూరుకు చెందిన ఒక అమ్మాయికి సపోర్ట్ గా నిలవాలని భాస్కర్ గుప్తా గారి దృష్టికి వెళితే వెంటనే ఒప్పుకున్నారని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అదేవిధంగా ఒక ప్రాజెక్టుగా పదిమంది ఫాస్ట్ బౌలర్లను టీం ఇండియాకి అందించే ప్రయత్నాలు కూడా కంపెనీ తరఫున చేస్తామని అన్నారు. అలాగే మీడియా మిత్రులు కూడా ఎవరైనా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉంటే క్రికెట్ మాత్రమే కాదు ఏ ప్లేయర్ అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము సపోర్ట్ చేస్తామని అన్నారు.

ఆర్కిటెక్ట్ జయ కుమార్ మాట్లాడుతూ తన మేనేజింగ్ పార్ట్నర్ రమాకాంత్ ను మీడియాకు పరిచయం చేశారు. ఇక తనకు ఈ ప్రాజెక్టులలో డిజైన్ చేసే అవకాశం కల్పించిన భాస్కర్ గుప్తా గారికి అదేవిధంగా జేవిఆర్జే గ్రూప్ కి ధన్యవాదాలు తెలిపారు. మిడిల్ క్లాస్ ప్రజలందరూ హ్యాపీగా ఉండేలా వారి సొంత ఇంటి కలలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశామని ఆయన అన్నారు.

ఇక ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండే జేవీఆర్జే గ్రూప్ గుంటూరు జిల్లాకు చెందిన ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ రమ్యకు సంస్థ తరఫున స్కాలర్షిప్ కూడా ప్రకటించి కపిల్ దేవ్ గారు, సంస్థ అధినేత భాస్కర గుప్తా చేతుల మీదుగా చెక్ అందించారు.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *