*ME TWO కాదు
MA(N)TWO*
*++++—-++++—-*
ఈ మహిళాహంకార సమాజంలో మగాడికి రక్షణ లేదా?
స్త్రీఆధిపత్య జీవనంలో పురుషుని బాధలకు అంతం లేదా?
బార్లు, పబ్లూలలో అత్యధిక మద్యం అమ్మకాలకు కారణం ఈ మహిళాధిపత్యమేనా?
పై ప్రశ్నలకు సమాధానం చెబుతుంది *మీటూ* చిత్రం. ఏరంగంలోనైనా బలం ఉన్న జండర్… సెక్స్ వల్ గా ఎదుటి జండర్ ను సెక్స్ వల్ గా హెరాస్ చేస్తూనే ఉంటుంది. అది ఆడైనా, మగైనా! కాకపోతే ఆడ అనే సరికి అటు ఆడవారికీ, ఇటు మగవారికీ ఒకింత ఆదరణ, అదును తప్పితే అరాచకం చేయడానికైనా సాహసిస్తారు. ఇదోరకపు హైరాన! అదే మగవాడైతే నన్ను అదన్నాడు,ఇదన్నాడనీ, అక్కడాఇక్కడా ముట్టుకున్నాడని గోల , యాగీ చేసే అవకాశం ఆపోజిట్ జండర్ కు ఉంది. చివరికి ఆ ఒక్క ఆయుధంతో ఆడపిల్లలు ఎలా రెచ్చి పోయి, పగబట్టినట్టు మగవారిని హింసిస్తున్నారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపారు. ఎంతపెద్ద జోక్ అంటే *గే* ను కూడా వదలని దౌర్భల్యం! నన్ను సెక్స్ వల్ హెరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తుంది. అతను తన పరువు పోతుందని తన బలహీనత చెప్పుకోలేడు. అదే సాకుగా అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తారు. తనకు ఆ ఉద్యోగం ఎంత అవసరమో అని ఎంత ప్రాధేయపడినా కనికరించదు ఆమె! చివరకు జీవితంలో ఓడిపోయానని అతను తాను గే అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు.
ఆడదానికి ఆడదే శత్రువు అన్న నానుడి మారిపోయింది. ఇప్పుడు ఆ సామెత జంబలకిడి పంబ అయింది.
మగవాడికి మగవాడే శత్రువు ఇప్పుడు. ఏ జండర్ కైనా సెక్స్ వల్ గా ఆప్షన్స్ ఎక్కువయ్యాయి. అందుకే కార్పోరేట్ రంగంలో ఆడవారికి మగాళ్లకు వీపరీతధోరణులు వచ్చేసాయి. కార్పోరేట్ రంగంలో ఓ ప్రొడక్ట్ గూర్చి చెప్పాలంటే అమ్మాయే కావాలి. C E O అమ్మాయి చెబితేనే నచ్చి కాంట్రాక్ట్ ఇస్తాడు. అదే అబ్బాయి చెబుతుంటే పట్టించుకోకుండా తన ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. అదే అమ్మాయి చెబితే సొంగ కార్చుకుంటూ వింటాడు. ఇక్కడ సాటి మగాడిని మరో మగాడు తొక్కేసినట్టేగా…! భార్యా బాధితులంతా కలిసేది బార్ లో! సినిమా దాదాపు అరవై శాతం బార్ లో చిత్రీకరణ ఉంటుంది. కాని ఎక్కడా ఛ అనిపించదు. మగాళ్లమని మీసాలు మెలెసే వాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న వెతలన్నీ అక్కడ బీరులా పారాయి. ప్రేక్షకుడికి ఆ బాధలే మంచి కిక్కు ఇస్తాయి. ముగ్గురు స్నేహితులు టూర్ కు వెళ్లి, హిమాలయ సౌందర్యం చూస్తారు. ఆహా ఎంత ప్రశాంతంగా ఉందిక్కడ… అని ఒకడంటే… ఇక్కడ ఆడవాళ్లు లేరుగా ! అనే డైలాగ్ థియేటర్లలో పేలింది. ఇంత స్త్రీ జాతిని ఈసడించుకున్నా చివరకు ఆడపిల్ల పుట్టిందనే సరికి ఈ భార్య బాధితులందరికి ఎంత సంతోషం కలుగుతుందో ! అదే కొస మెరుపు !!
ఏది ఏమైనా ఆడపులుల బారిన పడిన అక్కు పక్షుల బాధల సమాహారంగా…. *మీటూ* అనే పదం ఆడలేడీస్ కే కాదని, ఆ పదం మగ జంట్స్ కూడా వర్తిస్తుందని ఘంటా పధం గా చెప్పిన చిత్రం *మెన్ టూ*
దర్శకత్వ పరంగా అతనికి సబ్జెక్టుపై పక్కా క్లారిటీ ఉంది. చాలా చోట్ల మెరుపులు మెరిపించి, న్యూవేవ్ చిత్రంగా మలిచాడు. కథనరీతి చెప్పిన విధానంలో ప్రేక్షకుడు ఆస్థాయిలో కెళితేనే కొన్ని అర్థమవుతాయి. వీలయితే చూడండి….. మన చుట్టూ జరుగుతున్న లోకంపోకడలు గమనించండి. ఎందుకంటే మనకూ పెళ్లికావలసిన *అబ్బాయిలు* ఉన్నారు.
…సరయు శేఖర్!