అందరినీ ఆకట్టుకోనే సోదర సోదరీమణులారా మూవీ రివ్యూ...

బ్యానర్ : 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్
సినిమా : “సోదర సోదరీమణులారా”…
మామూవీ రివ్యూ రేటింగ్ : 3.25 /5
విడుదల తేదీ : 15.09.2023
నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల
రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా
నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి
నేపథ్య సంగీతం : వర్ధన్
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి
పి ఆర్ ఓ: బి ఏ రాజు ‘s టీం
పబ్లిసిటీ డిజైనర్ : వివ రెడ్డి

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా ‘సోదర సోదరీమణులారా…’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సోదర సోదరీమణులారా”.. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం

కథ

రాజు (కమల్ కామరాజు), క్యాబ్ నడుపుకుంటూ భార్య శ్రావణి (అపర్ణాదేవి), కూతురు మహా లతో హ్యాపీ గా జీవితం గడుపుతుంటాడు.అయితే ఒకరోజు రాత్రి సన్నీ అనే వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి కిరాయికి రావాలని అడగడంతో తను చెప్పిన రిసార్ట్ కు బయలు దేరుతారు. ఆ రిసార్ట్ ఊరి చివరన ఉంటుంది.ఆ రిసార్ట్స్ లో ఇల్లీగల్ బిజినెస్ లు సాగుతుంటాయి. అయితే జరిగిన కొన్ని పరిణామాలలో భాగంగా ఒక అమ్మాయిని ఈ రిసార్ట్స్ తన క్యాబ్ లో ఎక్కించుకుని తిరుగు ప్రయాణం అవుతాడు. దారిలో పోలీసులు చెక్ చేయగా క్యాబ్ లో ఉన్న అమ్మాయి మరణించి ఉంటుంది. డాక్టర్స్ చెక్ చేసి ఈ అమ్మాయి రేప్ కు గురైంది అంటారు. దీంతో పోలీసులు రాజు పై రేప్ & మర్డర్ కేస్ పెట్టి జైల్లో పెడతారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? రాజుకు, ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి?పోలీసులు చెప్పిన ప్రకారంగా రాజే ఆ ఆమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడా ? లేక ఎవరైనా రాజును ఈ కేసులో ఇరికించారా? రాజు భార్య శ్రావణి తన భర్త నిర్దోషి గా నిరూపించుకోవడానికి ఎలాంటి పోరాటం చేసింది? హోమ్ మినిష్టర్ అయిన సీనియర్ నటులు పృద్వి పాత్రేమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘సోదర సోదరీమణులారా…’ సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో కమల్ కామరాజు అమాయకుడుగా క్యారెక్టర్ కు తగ్గట్టు చక్కగా సూటయ్యడు. అలాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజు భార్య గా నటించిన శ్రావణి (అపర్ణాదేవి) ఇన్నోసెంట్ భార్యగా చక్కటి పెర్ఫార్మన్స్ చేసింది. తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది. హోం మినిస్టర్ గా సీనియర్ నటుడు పృద్వి నెగటివ్‌ షేడ్‌ లో ఆకట్టుకున్నాడు.తన పాత్రతో సినిమాకు ప్రాణం పోశాడు. సి. ఐ భాస్కర్ పాత్రలో బాహుబలి ప్రభాకర్ చక్కటి ప్రదర్శన చూపించాడు. తనపై అధికారి గా యస్. పి పాత్రలో వెంకటేశ్వర్ రావు చాలా బాగా నటించాడు.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు..

సాంకేతిక నిపుణుల పనితీరు

ఒక రిసార్ట్ కు డ్రాప్ చేయడానికి వెళ్లిన రాజు లైఫ్ ఎలా టర్న్ అయింది అనేటటువంటి ఓ రెగ్యూలర్‌ స్టోరీని తీసుకుని ఇంట్రెస్టింగ్ కలిగించే ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ఎంచుకుని ఒక్క పాట కూడా లేకుండా ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతూ ఆర్టిస్టులు రియాలిస్టిక్ పెర్ఫార్మన్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా తెరకెక్కించిన దర్శకుడు డైరెక్టర్ రఘుపతి రెడ్డి గుండాకి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్ గా మారుతుంది. మోహన్ చారి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ ఫుల్‌గా ఉన్నాయి. వర్ధన్ అందించిన నేపద్య సంగీతం ఈ సినిమాకు మైనస్ గా మారింది. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకొంచెం పని చెప్తే బాగుండేది.EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్ పై విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తెరకెక్కిన ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సోదర సోదరీమణులారా…’ ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటకు వస్తాడని చెప్పవచ్చు

మామూవీ రివ్యూ రేటింగ్ : 3.25 /5
About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *