క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్, ఈవీఎం ల ట్యాంపరింగ్ పై ఒక మంచి కథగా ఈ నెల23 న యమధీర మూవీ బ్రహ్మాండమైన విడుదల
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నాయి.
నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ : ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ గారు క్రికెటర్ శ్రీశాంత్ గారు ముఖ్య పాత్రలో నటించారు. అదేవిధంగా నాగబాబు గారు, అలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధుసూదన్ గారు నటించారు. టీజర్ అండ్ ట్రైలర్ పైన చాలా అద్భుతమైన స్పందన లభించింది. సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి అదే విధంగా రోజురోజుకు థియేటర్లో పెరుగుతున్నాయి. చిన్న సినిమాలను సపోర్ట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.
టెక్నికల్ టీం :
ప్రొడక్షన్ : శ్రీ మందిరం ప్రొడక్షన్స్
కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్
మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్ : సి రవిచంద్రన్
సంగీతం : వరుణ్ ఉన్ని
నిర్మాత : వేదాల శ్రీనివాస్ రావు గారు
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్
పి ఆర్ ఓ : మధు VR