నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా “నిశ్శబ్ద” సినిమా టీజర్ లాంఛ్


మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “నిశ్శబ్ద”. ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “నిశ్శబ్ద” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నటుడు సూర్య మాట్లాడుతూ – “నిశ్శబ్ద” చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఆయన ఈ చిత్రంతో ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. అన్నారు.

యువ హీరో కృష్ణ మాట్లాడుతూ – “నిశ్శబ్ద” సినిమా టీజర్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. డైరెక్టర్ రమణమూర్తి మంచి హారర్ థ్రిల్లర్ మూవీని చూపించబోతున్నాడు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఇలాగే చాలామంది యంగ్ టాలెంట్ కు అవకాశాలు ఇవ్వాలి. అన్నారు.

యువ హీరో సంజయ్ మాట్లాడుతూ – టీజర్ లాంఛ్ సందర్భంగా “నిశ్శబ్ద” టీమ్ అందిరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా. సినిమాల్లో చిన్నవి, పెద్దవి అనేది ఉండదు కంటెంట్ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. “నిశ్శబ్ద” సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉన్నట్లు టీజర్ తో తెలుస్తోంది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మనోజ్ కుమార్ మాట్లాడుతూ – “నిశ్శబ్ద” మూవీలో హీరోగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. మా డైరెక్టర్ రమణమూర్తి గారు ఇచ్చిన సజెషన్స్ వల్లే ఈ మూవీలో బాగా నటించగలిగాను. షూటింగ్ టైమ్ లో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. మాది చిన్న సినిమా కాదు. మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ హారర్ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరోయిన్ ఆశిత రెడ్డి మాట్లాడుతూ – “నిశ్శబ్ద” చిత్రంతో నేను హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నాకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు. పర్ ఫార్మెన్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశా. నాతో పాటు నటించిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రమణమూర్తి గారికి, ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్, సంధ్యారాణి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ రోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. “నిశ్శబ్ద” టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా కూడా అంతే బాగుంటుంది. త్వరలోనే మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తాం. ఇంకా నాలుగైదు ఇంట్రెస్టింగ్ మూవీస్ మా ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీలైనంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి కంటెంట్ ఉన్న మంచి చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

నిర్మాత ఎం. సంధ్యారాణి మాట్లాడుతూ – మా “నిశ్శబ్ద” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీగా మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. మా సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. అన్నారు.

డైరెక్టర్ రమణమూర్తి తంగెళ్లపల్లి మాట్లాడుతూ – నేను గతంలో ప్రేమ తరంగాలు అనే ఓ లవ్ స్టోరీ మూవీ రూపొందించాను. ఇప్పుడు “నిశ్శబ్ద” అనే హారర్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమా చేసే క్రమంలో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. మొత్తం రాత్రుళ్లు షూటింగ్ చేశాం. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 వరకు షూటింగ్ చేసేవాళ్లం. మా కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ కు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరి ఆదరణతో “నిశ్శబ్ద” సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటి నాగలక్ష్మి మాట్లాడుతూ – నేను “నిశ్శబ్ద” చిత్రంలో దెయ్యం పాత్రలో కనిపిస్తాను. నాకు నలుగురు సిస్టర్స్, వాళ్లు కూడా దెయ్యం క్యారెక్టర్స్ చేశారు. మాలాంటి యంగ్ టాలెంట్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటీనటులు: మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి, భాగ్య, హరిత, నాగ లక్ష్మి, టబు, షైని మహేశ్వరీ, తమన్నా, హనుమాన్ గారు, ఫాతిమా, రామ్ రెడ్డి, రాజు, మహేందర్ రెడ్డి, విజయ్ వరంగల్, చంటి, చిత్ర, షన్ను, చిత్ర, సై సూర్య, నయనిక, నితిన్, రమీజ షేక్, తదితరులు…

టెక్నీషియన్స్
—————-
నిర్మాత: ఎం. సంధ్యా రాణి, ఎం. శ్రీనివాస్
కథ కథనం దర్శకత్వం : రమణ మూర్తి తంగెళ్లపల్లి
డీవోపీ: నందన్ కృష్ణ
సంగీతం : అభిషేక్ రూఫుస్
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ ( చంటి )
దర్శకత్వం విభాగం: కిరణ్ కుమార్, ప్రతాప్, సుమలత, సింహా
మేనేజర్: వెంకటేశ్వర్లు
మెకప్: రమేష్
స్టిల్ ఫోటోగ్రాఫర్: చందు
ఆన్‌లైన్ ఎడిటర్: త్రివిక్రమ్
పీఆర్ఓ – ఆర్ కే చౌదరి
ప్రత్యేక కృతజ్ఞతలు : శ్రీనివాస్ .యమ్, నరేంద్ర, దశరథ్, సాయికుమార్, తదితరులు

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *