సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల 2026 ప్రధానం

విద్యార్థుల్లోని టాలెంట్ ని వెలికితీసేందుకు కృషిచేస్తున్న సుచిర్ఇండియా ఫౌండేషన్ అధినేత… లయన్ కిరణ్
* ఘంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీనటులు శ్రీకాంత్, శివాజీ రాజా మరియు లయన్ కిరణ్ చేతుల మీదుగా సూచిరిండియా ఫౌండేషన్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ చేశారు.

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 33వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 500 పైగా పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 33వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, 20 మంది కి నేషనల్ ర్యాంక్స్, 20 మంది కి రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు 450 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని. ఈ యువ టాలెంట్ విద్యార్థులకు రవీంద్రభారతిలో అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు ఈ పురస్కారాన్ని సాధించిన ఈ యువ ప్రతిభ వెనుక ఉన్న ఉపాధ్యాయులను ఛత్రలయా పురస్కార మరియు గురు బ్రహ్మ అవార్డ్స్ తో సత్కరించారు.

ఈ అవార్డులు విద్యార్థులతో పాటు, వారి విద్యాభ్యాసానికి మార్గదర్శకులైన గురువులు మరియు విద్యాసంస్థలను కూడా గౌరవిస్తాము.

ఈ వేడుకకు సుమారు 2,000 మందికి పైగా ప్రముఖులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు మరియు మోటివేషనల్ స్పీకర్ శ్రీ సుధీర్ సంద్ర ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం ఎం.ఎల్.ఏ ఘంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీనటులు శ్రీకాంత్, శివాజీ రాజా మరియు సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా విద్యార్థులు కు బహుమతులు ప్రధానం చేశారు.
సహాయం చేసే గొప్ప ఈ గుణ్ణం అందరకీ ఉండాలి అన్ని అన్నారు.

సినీనటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు
ఘంటా శ్రీనివాసరావు, మాట్లాడుతూ
గత 33 సంవత్సరాలుగా ఈ మహాకార్యానికి లయన్ కిరణ్ గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ తెలుగు రాష్ట్రం అన్ని కలలకి అన్ని సంస్కృతులకు అన్ని సంప్రదాయాలకి ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు మంచి చేయాలి అనే ఉదేశ్యం తో ఈ కార్యక్రమం చేయడం. విద్య పట్ల ఆరోగ్యం పట్ల మన ప్రధాన బాధ్యతని ప్రాధాన్యతను తీసుకున్నారు.

