ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 18న విడుదలకు సిద్దమవుతున్న ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’
శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత బీసు చందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథాచిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి మా చిత్రానికి ఎంతో డిఫరెన్స్‌ ఉంది. దర్శకుడు వినయ్‌బాబు అత్భుతమైన ట్విస్ట్‌లతో సినిమాను ఇంట్రెస్టింగ్‌గా తెరక్కించారు. కచ్చితంగా ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోంది. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. యువతో పాటు ప్రతి తల్లీదండ్రి చూడాల్సిన చిత్రమిది’ అన్నారు.
దర్శకుడు ఎం. వినయ్‌ బాబు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మంచి కంటెంట్‌తో పాటు కమర్శియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి అత్భుతమైన స్పందన వస్తోంది. మా చిత్రంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటుగా ముఖ్యపాత్రల్లో సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి, సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌, లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌.. తదితరులు నటించారు. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
డిఓపి: విజయ్‌ కుమార్‌ ఎ. ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎన్టీఆర్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.నివాస్‌, ఫైట్స్‌: రామ్‌ సుంకర, కొరియోగ్రఫీ: అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌, పిఆర్ఓ: చందు రమేష్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *