అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం
ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు
`ఫస్ట్ లిరికల్ విడుదల వేడుకలో సి. కల్యాణ్
యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`- మృణాళిని హీరో – హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ`హరిణి ఆలపించిన తొలి లిరికల్ ‘‘అల్లసాని వారి అల్లిక’’ సాంగ్ విడుదల కార్యక్రమం నిర్మాత సి. కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (9వ తేదీ) హైదరాబాద్‌లోని ఎఫ్.ఎన్.సి.సిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విచ్చేసి, ఫస్ట్ లిరికల్‌ను లాంచ్ చేశారు. ఈ సాంగ్ ‘సరిగమలు’ ద్వారా అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ…
కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్. ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకడిని. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంతమంది కాంబినేషన్ అయినా సెట్లో కూల్‌గా ఎలా ఉండాలో నేను కృష్ణారెడ్డి గారిని చూసే నేర్చుకున్నాను. మళ్లీ ఆయన గోల్డెన్ డేస్‌ని ఈ సినిమా రిపీట్ చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మా అన్నయ్య సి. కల్యాణ్‌తో నాకు ఉన్న అనుబంధం ఎంత చెప్పినా తరిగిపోదు. ఆయన నాకే కాదు.. చాలా మందికి ఇష్టమైన వ్యక్తి. ఆయన పుట్టిన రోజు వేడుకలు ఈ వేదిక మీద జరపడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ…
మా మిత్రులు, ఆత్మీయులు సి. కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఆయన చుట్టూ ఉండే అందరికీ పండగే. మా ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు లిరికల్ వేడుక కన్నా ఇది కల్యాణ్ గారి పుట్టినరోజు వేడుక వేదికగా భావిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ ఎంతో మంది దిగ్గజాలైన లీడర్స్‌ను చూసింది. ప్రస్తుతం ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, అనుక్షణం ఇండస్ట్రీ బాగుండాలి అని నిస్వార్ధంగా కోరుకునే వ్యక్తి సి. కల్యాణ్ గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా భారతీయ సినిమాకు ఆయన ఎన్నో సేవలు అందించారు. ఇండస్ట్రీకి ఏదో చేయాలనే ఆయన తపనకు రూపాన్నిస్తూ చెన్నైలో భారీస్థాయిలో ఓ అమ్యూజ్మెంట్ పార్క్‌ను తమిళనాడు ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్నారు. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణంగా మారుతుంది. ఆల్ ఇండియా ఫిలిం ఫెడరేషన్ వారి సహకారంతో ఒక ఫిలిం అవార్డ్స్‌కు రూపకల్పన చేస్తున్నారు కల్యాణ్ గారు. కల్యాణ్ గారి సహకారంతో ఆయన భార్య కోనేరు కల్పన గారు నిర్మాతగా నా సమర్పణలో రూపొందిన ‘ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు’ నిర్మించే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాంగ్ వినడానికి ఎంత మోలోడియస్గా ఉందో.. పిక్చరైజేషన్ అంతకు మించి అందంగా ఉంటుంది. సినిమా కృష్ణారెడ్డిగారి రెగ్యులర్ స్టైల్లో ఉంటూనే నేటి యంగర్ జనరేషన్‌ను ఆకర్షించే అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది. హీరో సోహెల్ సీనియర్ నటుడిలా అద్భుతంగా చేశాడు. ఖచ్చితంగా హిట్ సినిమా అవుతుంది అన్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి మాట్లాడుతూ..
ముందుగా సి. కల్యాణ్ గారికి హ్యాపీ బర్త్‌డే. సాంగ్ చాలా బాగుంది. కృష్ణారెడ్డి గారి నుంచి వస్తున్న మరో వండర్ఫుల్ ఫ్యామిలీ మూవీ ఈ ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు’. కల్యాణ్ గారి ప్రోత్సాహంతో కల్పన గారు నిర్మిస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కృష్ణారెడ్డిగారి మార్క్ సినిమా కాబట్టి తప్పకుండా మళ్లీ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం అన్నారు.
కెమెరామెన్ రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ…
ముందుగా సి. కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా వదిన కల్పనగారు అద్భుతమైన సినిమా నిర్మించారు. అచ్చిరెడ్డి గారి సపోర్ట్ చాలా బాగుంది. ఇక కృష్ణారెడ్డి గారి గురించి చెప్పేదేముంది.. ఆయన సినిమాలు అన్నీ క్లీన్ మూవీస్. సోహెల్ చాలా అందంగా ఉన్నాడు. అందరూ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. ఒక పెద్ద సినిమాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చారు. తప్పకుండా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ..
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరి సమక్షంలో ఈ బర్త్‌డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా గురువుగారు దాసరి గారి బర్త్‌డేనే మేం అందరం మా బర్త్‌డేగా ఫీలవుతాం. ఈరోజు ఆయన లేరు కాబట్టి ఆయన్ను తలుచుకుంటూ ఈ బర్త్‌డే చేసుకుంటున్నా. సినిమాల్లో నేను సంపాదించింది ఏమీ లేదు. కానీ సినిమా వాడిగా నాకున్న ఇమేజ్‌తో బయట ఇతర వ్యాపారాల్లో సంపాదించి సినిమాలు తీస్తుంటాను. చిల్లర కల్యాణ్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చింది అంటే.. అది కేవలం సినిమా పరిశ్రమ నాకు కల్పించిన అద్భుత అవకాశం. అందుకే నా ఊపిరి ఉన్నంత వరకూ సినిమా పరిశ్రమతోనే ఉంటా. కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో కల్పన నిర్మిస్తున్న ఈ సినిమా అరిటాకులో వడ్డించిన అచ్చతెలుగు భోజనం. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కేవలం తెలుగు వారే. కెమెరామెన్ రామ్‌ప్రసాద్ చాలా పట్టుదలగా ఈ సినిమా చేశాడు. సోహెల్ చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. తప్పకుండా మంచి రేంజ్‌కు చేరుకుంటాడు. కృష్ణారెడ్డి గారితో మా అనుబంధం ఈ రోజుది కాదు. ఆయన సినిమా ప్రేమికుడు. కల్పన తొలి స్ట్రెయిట్ ప్రొడక్షన్ ఆయనతో చేయడంతోనే సగం సక్సెస్ కొట్టేసింది. తెలుగు సినిమా చరిత్రలో మీ పేరు మారుమోగి పోయే ఒక ప్రాజెక్ట్ చేయండి అని ఆమె ఇచ్చిన సలహా మేరకే బాలయ్య బాబుతో ‘రామానుజాచార్య’ భారీగా తెరకెక్కించబోతున్నాను. కృష్ణారెడ్డి`అచ్చిరెడ్డి ఎప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరే వ్యక్తులు. ఈ స్క్రిప్ట్‌లో అన్నీ బాగా కుదిరాయి ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.
హీరో సోహెల్ మాట్లాడుతూ…
కృష్ణారెడ్డి గారి సినిమాలో హీరోగా నటించడం అంటేనే అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. మా జనరేషన్‌ను కూడా ఉర్రూతలూగించేలా కృష్ణారెడ్డి గారు ఈ సినిమా పాటల విషయంలో కేర్ తీసుకున్నారు. అది తెరమీద చూస్తారు. చిన్న సినిమాలను ఆదరిస్తే నా లాంటి కొత్త వారికి లైఫ్ వస్తుంది. ఈ సినిమా అవకాశం నాకు రావడానికి కారణమైన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. సి. కల్యాణ్‌గారి సతీమణి కల్పనగారి తొలి స్ట్రెయిట్ వెంచర్లో నేను చేయడం లక్కీగా ఫీలవుతున్నా. ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఈజ్ బ్యాక్ అని ఖచ్చితంగా చెపుతున్నా. నాకు సహకారం అందించిన యూనిట్ అందరికీ థ్యాంక్స్
సుమన్‌టీవీ క్రియేటివ్ హెడ్ ప్రభు మాట్లాడుతూ…
దాసరి గారిని ఆదర్శంగా తీసుకుని నెల్లూరు నుంచి వచ్చిన కల్యాణ్ గారు దర్శకుడు కాలేకపోయినా.. అగ్రశ్రేణి నిర్మాతగా అనేక చిత్రాల ద్వారా ఎందరో దర్శకులకు మంచి లైఫ్ ఇచ్చారు. గురువు గారిలోని నాయకత్వ కోణం చాలా అద్భుతమైనది. పరిశ్రమలోని సమస్యలనే ముళ్ల పొదలను తాను కౌగిలించుకుని, పరిష్కారాల పూలగుత్తులను పరిశ్రమకు పంచిన గొప్ప ట్రబుల్ షూటర్ దాసరి గారు. ఇదే లక్షణాన్ని పుణికిపుచ్చుకుని అనేక మంది సినీ కార్మికుల కష్టాలను తీరుస్తూ ముందుకు వెళుతున్నారు కల్యాణ్ గారు. అందుకే భారతదేశ స్థాయిలో సినీ పరిశ్రమకు చెందిన అనేక సంస్థల్లో ఉన్నత పదవులు అలంకరించి తన గొప్ప నాయకుడిగా ఎదిగారు కల్యాణ్ గారు. మా సినీ మీడియా మిత్రుల అందరి తరపున కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడుకు మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారే. ఆయనలాగే ఆయన సినిమాలు కూడా మిస్టర్ క్లీన్‌గా ఉంటాయి. కల్పన గారు మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…
మా అత్మీయులు సి. కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాది 42 ఏళ్ల అనుబంధం. ఆయనకు ఉన్నది ఒక్కటే అదే ధైర్యం.. ఆ ధైర్యమే ఈరోజు చిల్లర కల్యాణ్‌ను సినిమా కల్యాణ్‌ను చేసింది. మా సినిమా వేడుకలో ఆయన బర్త్‌డే చేసుకోవడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కోసం నేను, అచ్చిరెడ్డి ఎంత కష్టపడ్డామో ఈ సినిమానే మీకు చెపుతుంది. అలాగే నో కాంప్రమైజ్ అనే కల్పనగారి డేరింగ్‌నెస్ ప్రతిఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఆమె వెరీ గ్రేట్. ఆమె ఎలా ప్లాన్ చేశారో నాకు అయితే తెలియదు. లొకేషన్లో నాకు కావాల్సినవి, కావాల్సిన ట్కెంకు సమకూరాయి అంతే. హీరో సోహెల్ మంచి అందగాడు. రాంప్రసాద్ అతన్ని మరింత అందంగా చూపించాడు. నా టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవడమే నాకు గర్వంగా ఉంటుంది. నా గత చిత్రాల్లోన్ని అన్ని అంశాలనూ అంతకు మించి ఈ చిత్రంలో పొందు పరిచి మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ…
కల్యాణ్ గారితో నా అనుబంధం చాలా సంవత్సరాలది. ఇండస్ట్రీలో దాసరిగారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. వారిలో సి. కల్యాణ్ గారు కూడా ఒకరు. ఆయన కష్టపడే విధానం చాలా మందికి ఆదర్శం. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్ అన్న గారు. ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే క్లీన్ యు సర్టిఫికెట్ మూవీస్. ఆయన సినిమా సెన్సార్ అంటే నేను ముందే క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్టు మేటర్ ప్రిపేర్ చేసుకునే వాణ్ణి. అది ఆయన సినిమాల మీద నాకే కాదు.. కోట్ల మంది ప్రేక్షకులకు ఉన్న నమ్మకం. కల్పనగారు ఈ సినిమాను చాలా డేరింగ్‌గా చేశారు. ఆమె తప్ప ఈ సినిమాను ఇంత రేంజ్లో మరెవరూ చేయలేరు అన్నట్టుగా ఉంటుంది. ఈ కథ ముందుగా విన్నది నేనే. ఇండస్ట్రీకి మరో బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్’ అల్లుడు అవుతుంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రముఖ నిర్మాతలు దామోదర్, రామ సత్యనారాయణ, ఆచంట గోపి, మలినీడి సత్యనారాయణ, సుమన్ టీవీ క్రియేటివ్ హెడ్ ప్రభు తదితరులు సినిమా విజయం పట్ల ఆకాంక్షను వ్యక్తం చేయడంతో పాటు.. సి. కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: శివ, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.