నక్షలిజంపై ఎక్కుపెట్టిన బాణం సిందూరం
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ…
సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్ తో ఈ సినిమా చేశారు. తమిళ్ లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ ఈ సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోంది. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా నేచురల్ గా చేశాడు, కిషోర్ డైలాగ్స్ బాగా కుదిరాయి అన్నారు.
నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా మాట్లాడుతూ…
సిందూరం సినిమాలో నటించిన అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీసామనే సంతృప్తి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోన్న సిందూరం అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ…
డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి వచ్చి సిందూరం సినిమా కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా జానర్ విన్నప్పుడు ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్ గా కనిపించబోతున్న సిందూరం సినిమా కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిందూరం ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు.
నిర్మాత ప్రవీణ్ కు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ శ్యామ్ కు ఉన్న నాలెడ్జ్ సిందూరం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. సిందూరం లాంటి కథతో సినిమా రావాలంటే మరో 10 – 15 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. అలాంటి కథ ఇది. సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ అవుతుందని తెలిపారు.
నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్)
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా
సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం
రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ
సినిమాటోగ్రఫీ: కేశవ్
సంగీతం: హరి గౌర
ఎడిటర్: జస్విన్ ప్రభు
ఆర్ట్: ఆరే మధుబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి
పీఆర్ఒ: శ్రీధర్
Trailer: https://youtu.be/sWZq6ZnrA24