మాధవే మధుసూదన నుండి అలాంటి అందం సాంగ్ లాంచ్ చేసిన అక్కినేని నాగ చైతన్య.
బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా నాగ చైతన్య మొదటి పాటను ఆవిష్కరించారు.
అనంతరం నాగ చైతన్య మాట్లాడుతూ.. మాధవే మధుసూదన సినిమా నుంచి అలాంటి అందం సాంగ్ చూడడం జరిగింది. చాలా చాలా బావుంది. మొదటగా తేజ్ కి కంగ్రాట్యులేషన్ చెప్పాలి. బ్రదర్ నీ డాన్స్ చాలా బావుంది. యాక్టింగ్ బావుంది, అలాగే లుక్ అన్ని బాగా కుదిరాయి. ఇక మా చంద్ర గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. చిన్నప్పుడు నాకు ఒక కెమెరా అంటే తెలియనప్పుడు హాలిడేస్ లో నాన్న షూటింగ్స్ కి వెళుతుండేవాడిని. అక్కడ చంద్ర పక్కనుండి అన్నీ నేర్పించారు. అలాంటి చంద్ర ఇవ్వాళా ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చూపించిన పాట నేను ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు. చంద్ర ఇంతబాగా హ్యాండిల్ చేస్తారని, వెరీ వెరీ హ్యాపీ అన్నారు నాగ చైతన్య. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాధవే మధుసూదన కథ చాలా మంచి కథ, చాలా ఫీలున్న కథ. మంచి ఎమోషన్ అండ్ లవ్ స్టోరీ చాలా బావుంది, ఇవ్వాళ్లున్న యూత్ బాగా కనెక్ట్ అవుతారని బాగా నమ్ముతున్నాను. చంద్ర గురించి చెప్పాలంటే ఆయన ఆల్ రౌండర్. చంద్ర గారు తీసిన అవుట్ ఫుట్ చూస్తుంటే ఆనందంగా ఉంది. చంద్రకి సినిమా అంటే ఎంత పిచ్చో నాకు బాగా తెలుసు. ఒక ప్రొడ్యూసర్ గా మొదలు పెట్టి ఇవ్వాళ డైరెక్టర్ గా మారారు. డైరెక్షన్ తోనే కాదు.. ఇక వచ్చే సినిమా నుంచి మ్యూజిక్, లిరిక్స్, ఇంకా డైలాగ్స్ కూడా కవర్ చేస్తారు.. వెరీ వెరీ హ్యాపీ. అలాగే హీరోయిన్ రిషికా కు కంగ్రాట్యులేషన్, వికాస్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. ఈ ఆల్బమ్ లోని మూడు పాటలు విన్నాను. మూడు చాలా బావున్నాయి, కొరియోగ్రఫీ కూడా బావుంది. కొరియోగ్రాఫర్స్ కి రాజు మాస్టర్, రఘు మాస్టర్, బృంద మాస్టర్ ముగ్గురుకి కంగ్రాట్యులేషన్. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నవి. మిస్ అవకుండా చూడండి, మిగిలిన పాటలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇక డైరెక్టర్ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అన్నారు నాగ చైతన్య.
ఈ సినిమాకు వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్. ఉద్దవ్ ఎస్ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా బాగా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను నిర్మాతలు ప్రకటించనున్నారు.
నటీ నటులు: తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, సుమన్, రామచందర్, శైలజా ప్రియ, నవీన్ నేని, విజయ్ మాస్టర్, బేబీ సమన్విక, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీలత తదితరులు.
సమర్పణ: బొమ్మదేవర శ్రీదేవి, బ్యానర్: సాయి రత్న క్రియేషన్స్, రచన-దర్శకత్వం, నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వాసు, సంగీతం: వికాస్ బాడిస, ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్ బి, మాటలు: బి సుదర్శన్, కొరియోగ్రఫీ: రాజు-సుందరం, బృంద, రఘు, యాష్, పాటలు: శ్రీమణి, అనంత శ్రీరామ్, విరించి పుట్ల, సింగర్స్: విజయ్ ప్రకాష్, అనురాగ్ కులకర్ణి, కపిల్ కపిలన్, రమ్య బెహ్రా, హరిప్రియ, వైష్ణవి కొవ్వూరి, ఫైట్స్: విజయ్ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్ కె తాళ్ళూరి, స్టిల్స్: పాండియన్, కో డైరెక్టర్: మురళి.యన్, పి.ఆర్.ఓ: పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ ప్రసాద్, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్: మానుకొండ మురళీకృష్ణ.
———————–