ప్రేక్ష‌కుడికి ఆనందం – ఆలోచ‌న రెండూ అందిస్తా:
‘ద‌ర్శ‌కుడు రామ్ రెడ్డి పన్నాల’తో ఇంట‌ర్వ్యూ

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా నిల‌బ‌డే వారు కొంద‌రే. ఆడియ‌న్స్ ఇప్పుడు ఏ త‌ర‌హా కంటెంట్‌కు క‌నెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి క‌టౌట్‌ను నిల‌బెట్టాలి. అప్పుడే సూప‌ర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయోచ్చు. అలాంటి స‌త్తా ఉన్న వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కుల్లో ‘రామ్ రెడ్డి పన్నాల’ ఒక‌రు. సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో, ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని, దాని చుట్టూ అల్లుకున్న కథనం, ఎంగేజింగ్ నడిపించడంలో ఇటీవ‌ల విడుద‌లైన‌ ‘నేడే విడుద‌ల‌’ సినిమాతో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. ఫస్ట్ మూవీతోనే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాలతో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ.

ప్ర‌శ్న‌: నమస్తే.. రామ్ రెడ్డి పన్నాల గారు.. ‘నేడే విడుద‌ల‌’ సినిమాతో మీరు ఇండ‌స్ట్రీలో అంద‌రి దృష్టిలో ప‌డ్డారు. ముందుగా మీ నేపథ్యం గురుంచి చెప్పండి.

స‌మాధానం: న‌మ‌స్తే అండీ, మాది జగిత్యాల జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామం. మాది రైతు కుటుంబం. అమ్మ, నాన్న వ్వవసాయదారులు. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఈ రంగానికి వ‌చ్చాను.

ప్ర‌శ్న‌: మీరు తీసిన‌ ‘నేడే విడుద‌ల‌’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది.. ఏ జానర్ లో తీశారు?

స‌మాధానం: అవునండి.. ‘నేడే విడుద‌ల‌’ టైటిల్‌తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో పాటు, మంచి మెసేజ్ కూడా వుంది.

ప్ర‌శ్న‌: ‘నేడే విడుద‌ల‌’ విడుద‌ల‌య్యాక‌ రెస్పాన్స్ ఎలా ఉంది? అన్ని ఏరియాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది?

స‌మాధానం: సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెబుతున్నారు. సినిమాలో ముఖ్యంగా కామెడీ నచ్చి చాలా మంది ప్రేక్ష‌కులు రిపీట్‌గా చూస్తున్నారు. సినిమా విడుద‌ల‌య్యాక అన్ని కేట‌గిరి ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇలాంటి సినిమాలే చేయ‌లంటూ చాలా మంది నుంచి నాకు కాల్స్, మెసెజ్‌లు వ‌చ్చాయి. ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ కామెడీ డ్రామా. అందుకే అందరికి నచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జగిత్యాల లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ప్ర‌శ్న‌: ఫస్ట్ మూవీతోనే ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. మీరు.. ఎవరి దగ్గరైన దర్శకత్వ శాఖలో పనిచేసారా?

స‌మాధానం: నేను డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే డైరెక్టర్ మారుతీ టాకీస్‌లో కో-డైరెక్టర్ గా పనిచేసాను. నాకు డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్ గారికి ఏకలవ్య శిష్యుడిని.

ప్ర‌శ్న‌: మున్ముందు ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు?

సినిమాకు వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని ఆనందింప‌జేయ‌డం ముఖ్య‌మ‌నుకుంటాను. ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మెసెజ్ అందించాల‌నుకుంటాను. ప్రేక్ష‌కులు ఆనందపడేలా, ఆలోచింపజేసేలా వుండే సినిమాలు చేయాలనుకుంటున్నాను.
……..

“Spreading Joy and Wisdom through Cinema”*
*Interview with Director Ram Reddy Pannala

Few people are successful in the industry. Audiences now need to know what kind of content they will connect to and maintain such a cutout. Only then can you hit a super hit. The toy could be a blockbuster. ‘Ram Reddy Pannala’ is one of the directors with such ability. Director Ram Reddy Pannala has succeeded with the recently released movie ‘Nede Vidudala’ in making the main theme of the problem that the film industry is currently suffering from and creating an engaging narrative around it. A special interview with director Ram Reddy Panna who became a hot topic in the industry with his first movie.

Q: Namaste.. Ram Reddy Pannala garu.. With the movie ‘Nede Vidudala’, you caught everyone’s attention in the industry. First tell me about your background.

Answer: Namaste Andi, Lakshmipur village in Madi Jagityala district. We are a farmer family. Mom and dad are farmers. I came into this field with my love for movies since childhood.

Q: The title of your film ‘Nede Vidudala’ is very catchy.. In which genre did you film it?

Answer: Yes.. The first positive vibrations started with the title ‘Nede Vidudala’. This movie is a complete family entertainer. Along with comedy, love, emotions, it also has a good message.

Q: How was the response after the release of ‘Nede Vidudala’? What kind of response is coming from all areas?

Answer: Everyone who has seen the movie says it is good. Many viewers like the comedy especially in the movie and watch it repeatedly. After the release of the movie, there was a positive response from all categories of audience. I got calls and messages from many people asking me to do such films. This movie is a complete family comedy drama. That’s why everyone liked it. Positive response is coming from all areas. Especially good collections are coming in Jagitya.

Q: You became the talk of the town in the industry with your first movie. Have you worked in any directorate department?

Answer: I worked as an assistant director under director VN Aditya. I also worked as a co-director in director Maruti Talkies. I like director Sukumar very much. In a way, Sukumar was Eklavya’s disciple.

Q: What kind of films do you want to do in the future?

Answer: I think it is important to make the audience happy. I want to give a message along with entertainment. I want to make films that make the audience happy and think.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *