నందమూరి కళ్యాణ్ రామ్ కు శ్రీకళాసుధ ఉత్తమ నటుడి ఉగాది పురస్కారం
‘మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం తాతలాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను’ అని ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొ న్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కరము స్వీకరించిన అనంతరం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని నటీ మణి ఈశ్వరీరావు, బాపూరమణల పురస్కా రాన్ని సినీదర్శకుడు హను రాఘవపూడి, మహిళా రత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పిపి బోరా అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును బింబిసార చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్, ఉత్తమ నటీ అవార్డును నటీమణి సమంత తరపున ఆమె బంధువులు స్వీకరించారు. ఉత్తమ చిత్ర అవార్డును బింబిసార ప్రతినిధులు అందుకు న్నారు. లతా మంగేష్కర్ పురస్కారాన్ని నటీ -మణి శ్రీలేఖ, వీఎస్ఆర్ స్వామి పురస్కారాన్ని సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు స్వీకరిం చారు. ప్రముఖ వ్యాపారవేత్త వల్లేపల్లి శశి కాంత్, సుభాష్ చంద్ర విశిష్ట అవార్డులు, ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ ప్రధాన నిర్వాహకుడు రమేష్ జీవిత సాఫల్య అవార్డును స్వీకరిం చారు. అంతకుముందు అశ్విని శాస్త్రి, రోహిణి శాస్త్రి పంచాంగం వినిపించారు. తర్వాత జరిగిన మేనక పిపి బోరా బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *