హీరో మానస్, విష్ణు ప్రియల కాంబినేషన్ లో “గంగులు’ అనే మరో సూపర్ హిట్ సాంగ్ ను గ్రాండ్ గా విడుదల చేసిన నివృతి’ వైబ్స్.
జ్యోతి కున్నూరు నిర్మాత గా భీమ్స్ సిసిరిలియో సంగీత సారథ్యంలో ప్రముఖ కోరి్యోగ్రాఫర్ జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వంలో మానస్ , విష్ణు ప్రియ నర్తించిన ‘గంగులు’ ఫోక్ సాంగ్ ను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్,పద్మిని నాగులపల్లి, ప్రముఖ యాంకర్ , హీరోయిన్, నిర్మాత జయతి తదితరులు ముఖ్య అతిధులుగా.. సాంగ్ ను విడుదల చేశారు
తెలుగు తనం ఉట్టి పడేలా స్వచ్ఛమైన తెలుగు పదాలతో తరుణ్ సైదులు రాసిన లిరిక్స్ కు స్వరాజ్ కీర్తన్ .. అంతే వినసొంపుగా చాలా బాగా పాడాడు. ఈ పాటకు భీమ్స్ సిసిరిలియో అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగా పాటకు తగ్గట్టే సాయి శ్రీ రామ్ చాలా చక్కటి విజువల్స్ ఇచ్చాడు. శ్రష్టి వర్మ కోరియోగ్రఫీ లో వచ్చిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ముఖ్య అతిధిగా వచ్చిన జానీ మాస్టర్ మాట్లాడుతూ..భీమ్స్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ధమాకా కు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తరుణ్ చాలా చక్కటి లిరిక్స్ రాసుకున్నాడు. బుల్లి తెర మీద ఈ సాంగ్ వస్తే ఛానల్ మార్చకుండా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలా ఈ పాట చాలా బాగుంది .ఈ పాటకు మానస్, విష్ణు ప్రియలు ఇద్దరు చాలా ఎనర్జీటిక్ గా డ్యాన్స్ చేశారు. ఒకప్పుడు హిందీలో సింగిల్ ఆల్బమ్ సాంగ్స్ వచ్చేవి ఇప్పుడు మన తెలుగులో కూడా ఇలాంటి ఆల్బమ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది.డి. ఓ. పి సాయి గారు మంచివిజువల్స్ ఇచ్చాడు. సింగర్ స్వరాజ్ బాగా పాడాడు. నివృతి వారు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఏది అడిగినా కాదనకుండా ఈ టీంను ప్రియ, జ్యోతి గార్లు బాగా చూసుకున్నారు. వీరు ఇలా సాంగ్స్ మాత్రమే కాకుండా ఇలాగే మంచి సినిమా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నివ్రితి వైబ్స్ ద్వారా వస్తున్న ఈ పాట బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
యాంకర్, హీరోయిన్, నిర్మాత, జయతి మాట్లాడుతూ… ఇంతకు ముందు మానస్, విష్ణు ప్రియలు చేసిన జరీ జరీ పాట ఎంతో పాపులర్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటలో మానస్, విష్ణు ప్రియ ల డాన్స్ చాలా చూడముచ్చటగా ఉంది. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన ఆ పాటకు ప్రేక్షకులనుండి మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నాను..నివ్రితి వైబ్స్ ద్వారా వస్తున్న ఈ పాట బిగ్ హిట్ అవ్వాలి అన్నారు
నివృతి వైబ్స్ మనోహర్ మాట్లాడుతూ..హిందీలో, ఇంగ్లీషులో ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా వచ్చాయి మన తెలుగు సాహిత్యాన్ని,మన జానపద గేయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పంతో ఈ నివృతి వైబ్స్ ను ప్రారంభించడం జరిగింది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. అలాగే విష్ణు ప్రియ మానస్ కాంబినేషన్లో వస్తున్న రెండో సాంగ్ ఇది. అంతేకాకుండా బీమ్స్ గారి సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సాంగ్ కూడా ఇది రెండవది. రైటర్ తరుణ్, డి. ఓ.పి సాయి శ్రీరామ్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఆధ్వర్యంలో వస్తున్న ఈ గంగులు సాంగ్ ను ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలా తీసుకెళ్లే గలరని ఆశిస్తున్నాను ఇదివరకే మా నివృతి లో వచ్చిన జరీ జరీ సాంగ్ 50 మిలియన్లు దాటింది. ఆ సాంగును 100 మిలియన్లకు రీచ్ అయ్యేలా చేసి ఇప్పుడు వస్తున్న గంగులు సాంగ్ ను కూడా 100 మిలియన్లకు రీచ్ అయ్యేలా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను
సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ.. నివృత్తి వైబ్స్ లో ఇంతకుముందు ఒక సాంగ్ చేశాను.ఆ పాట తర్వాత నాకు పంపిన ఈ పాట లిరిక్స్ బాగా నచ్చాయి. ఇతని లిరిక్స్ వల్లే ఈ పాట చాలా బాగా వచ్చింది. ఇలాంటి ట్యాలెంట్ ఉన్న ఎంతోమంది ఉన్నత ఆశయాలతో తమ స్వస్థలాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుంది. అలా వచ్చి ప్రజల ఆశీర్వాదంతో ఒక విజేత గా నిలిచిన వ్యక్తే మన జానీ మాస్టర్.వారికి నా ధన్యవాదాలు. జ్యోతి గారు ఖర్చుకు వెనకాడకుండా తీస్తున్నారు.మానస్ నేను కృష్ణవంశీ గారి నక్షత్ర లో కలిసి పనిచేసాము. తను మంచి నటుడు.మానస్, విష్ణు ప్రియ చాలా బాగా డ్యాన్స్ చేశారు. నివృతి వైబ్స్ లో వచ్చిన అన్ని పాటలు హిట్ అయినట్లే ఇప్పుడు వస్తున్న “గంగులు” పాట కూడా అన్ని లాంగ్వేజ్ లలో బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. తరుణ్ సైదులు రాసిన గంగులు పాట చాలా బాగుంది. ఇంతకు ముందు శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లో మానస్, విష్ణు ప్రియల చేసిన “జరీ జరీ పంచెకట్టు” పాటకు ఎంత సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట కూడా అంత కంటే బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నివ్రితి వైబ్స్ వారు ఇలాగే ఎన్నో మంచి హిట్ పాటలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో మానస్ మాట్లాడుతూ.., నివృతి లో వచ్చిన సాంగ్స్ అన్ని.. ఒకదానిని మించి ఇంకొకటి ఎంతో క్వాలిటీ గా ఉంటాయి. ప్రతిసారీ మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా రీచ్ అవుతూ ఇంకా మంచి అవుట్ పుట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటారు అలాంటి మంచి అవుట్ పుట్ వచ్చిన పాటే “గంగులు”.ఈ పాటను జానీ మాస్టర్ పర్యవేక్షణలో శ్రష్టి వర్మ అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళింది. తను మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. తరుణ్ గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు.సాయి శ్రీరామ్ గారు వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు ఇప్పటివరకు మీరు చాలా సూపర్ హిట్ సాంగ్స్ విని ఉంటారు. కానీ స్వచ్ఛమైన పదాలతో ఇప్పుడు వచ్చిన ఈ ఫోక్ సాంగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ పాటకు అందరూ ఎంతో డెడికేటెడ్ వర్క్ చేశారు. అలాగే చాలా టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయడం వలనే ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది.ఇంకా ఇలాంటి మంచి పాటలు ఎన్నో తీస్తూ నివృతి’ వైబ్స్ కు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటి విష్ణు ప్రియ మాట్లాడుతూ.. గంగులు పాట నాకు గొప్ప ఆపర్చునిటీ. మానస్ తో కలసి ఇంతకుముందు జరీ జరీ పంచె కట్టు సాంగ్ కు చేసిన డాన్స్ అదిరిపోయింది.ఆ పాటకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తనతో కలసి చేస్తున్న ఈ గంగులు సాంగ్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి పాట చేసే అవకాశం ఇచ్చిన నివృతి వైబ్స్ ఛానల్ వారికి ధన్యవాదములు అన్నారు.
లిరిక్ రైటర్ తరుణ్ సైదులు మాట్లాడుతూ..నేను రాసిన పాటను బీమ్స్ అన్నకు పంపడం జరిగింది. అన్న చాలా బాగుందని చెప్పడంతో జ్యోతి మేడమ్,భీమ్స్ అన్న సాయి శ్రీరామ్ మానస్, విష్ణు ప్రియ ,ఇలా అందరూ కలసి ఈ పాటకు ప్రాణం పోశారు వారందరికీ నా ధన్యవాదాలు. మా లాంటి చిన్న రైటర్ లను ఎంకరేజ్ చేస్తూ అవకాశం కల్పించిన నివృతి వైబ్స్ ప్రొడక్షన్ వారికి నా ధన్యవాదాలు అన్నారు.
నటీ,నటులు
మానస్, విష్ణు ప్రియ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : నివృతి వైబ్స్
నిర్మాతలు : జ్యోతి కున్నూరు
కొరియోగ్రాఫర్ : శ్రష్టి వర్మ
మ్యూజిక్ : భీమ్స్ సిసిరిలియో
డి. ఓ. పి : సాయి శ్రీ రామ్
లిరిక్స్ : తరుణ్ సైదులు
సింగర్స్ : స్వరాజ్ కీర్తన్
ఆర్ట్ : రామ్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: బెక్కం రవీందర్
పి. ఆర్. ఓ : లక్ష్మీ నివాస్