శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం “ఓహ్”..

జీవిత బడుగు సమర్పణలో ఏకరీ ఫిలిమ్స్ పతాకం పై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకరీ స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కులుమునాలి వంటి అందమైన ప్రదేశంలో మొదటి షెడ్యూల్, రెండవ షెడ్యూల్ ను ఆగ్రాలో , మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లలో విజయవంతంగా షూటింగ్ జరుపుకోవడం జరిగింది.ఈ నెల 10 నుండి రెండు ఫైట్స్ వరంగల్ లో మరియు 17 నుండి గోవా లో మరో పాట చిత్రీకరించనున్న సందర్బంగా

చిత్ర దర్శక, నిర్మాత సత్యనారాయణ ఏకరి మాట్లాడుతూ.. కులుమనాలి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇది. మన భూమికి గ్రీనరీ ఎంత అవసరమో అలాగే మనం ఒక తెలుపును చూస్తే ఎలా ప్యూరిటీ గా ఫీల్ అవుతామో ఈ సినిమాకు అలాంటి ఫీల్ అయ్యే నేచర్ ఎంతో అవసరం అయినందున అక్కడున్న మంచుకొండలు, సెలయేర్లు ప్రకృతి అందాల తో ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వాలనే ఉద్దేశ్యంతో మనాలికి వెళ్లి షూట్ చెయ్యడం జరిగింది. ఇప్పటివరకు కులుమునాలి ఆగ్రా, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్నాము.ఇందులో ఐదు పాటలు , మూడు ఫైట్స్ తో ప్రేక్షకులు మెచ్చేటటువంటి ఒక కొత్త ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 29 న థియేటర్స్ లలో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

చిత్ర హీరో రఘు రామ్ మాట్లాడుతూ.. ఒక మంచి కాన్సెప్ట్ తో అందమైన లొకేషన్స్ లలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టోరీ “ఓహ్!”..టైటిల్ తగ్గట్టే సినిమా చాలా బాగుంటుంది. సున్నా డిగ్రీ లో అందమైన మంచుకొండల్లో చిత్రీకరణ జరుపుకోవడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం మా సినిమా కొత్త అనుభూతి నిస్తుందని కచ్చితంగా చెప్పగలను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన మా దర్శక , నిర్మాతకు ధన్యవాదములు అన్నారు.

చిత్ర హీరోయిన్స్ శృతి శెట్టి, నైనా పాఠక్ లు మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ ఉన్న “ఓహ్..” చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా దర్శక , నిర్మాతకు ధన్యవాదములు అన్నారు.

ముఖ్య తారాగణం :
హీరో: రఘు రామ్ హీరోయిన్లు: శృతి శెట్టి, నైనా పాఠక్ సహాయ నటులు : కల్పగురి బిక్షపతి, మనోజ్,కరణ్,తదితరులు

సాంకేతిక నిపుణులు
దర్శక, నిర్మాత : సత్యనారాయణ ఏకరి,
సంగీతం :నవనీత్ చారి,
పాటలు : భాష్య శ్రీ
సినిమాటోగ్రఫీ : లక్కీ ఏకరీ
కొరియోగ్రాఫర్ : రాజు మాస్టర్ (యస్. డి. సి )
పి.ఆర్. ఓ : ఆర్. కె చౌదరి

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *