మొట్ట మొదటిసారి వినూత్న పద్ధతిలో “భీమదేవరపల్లి బ్రాంచి” ట్రైలర్ విడుదల.
తెరవెనుక ఉండి ఒక సంఘటనని, ఒక సందర్భాన్ని ,సామాన్యుడిని వైరల్ చేసి హీరోలుగా చేస్తారు కొందరు. టాప్ టెన్ యూట్యూబర్స్, టాప్ టెన్ ట్విట్టరైట్స్, టాప్ టెన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెసర్స్, టాప్ టెన్ ఫేస్బుక్ పేజర్స్ అందరూ తెర వెనుక హీరోలు. అలాంటి వారు అందరూ ఒకేసారి అంతర్జాతీయ వేదిక మీది కొచ్చి ఈరోజు సాయంత్రం 5గంటల 9 నిమిషాలకు “భీమదేవరపల్లి బ్రాంచి” ట్రైలర్ విడుదల చేస్తున్నారు. భీమదేవరపల్లి బ్రాంచి చిత్రం కథ నుంచి నటీనటుల ఎంపిక నుంచి నిర్మాణం, ప్రచారం, మూస దోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ వినూత్నంగా సరికొత్త పద్ధతుల్లో వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒక సినిమాని కార్టూన్స్ ద్వారా ప్రచారం చేయాలనే దర్శకుడు రమేష్ చెప్పాల ఆలోచనతో సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఫ్రెష్ ఫీల్ ఉన్న టీజర్ విడుదలై వైరల్ అయింది. జూన్ 23న విడుదల కాబోతున్న భీమదేవరపల్లి బ్రాంచి చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. ఈనెల 19న సరికొత్తగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ చేయబోతున్నారు.
నటీనటులు
అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్), రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్(బీఎస్),శుభోదయం సుబ్బారావు,గడ్డం నవీన్,వివ రెడ్డి, సి ఎస్ ఆర్,నర్సింహ రెడ్డి,పద్మ,మానుకోట ప్రసాద్,తాటి గీత, విద్యా సాగర్,మహి,వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, బైరన్న
కటారి, రజిని, సుష్మా.
సాంకేతిక నిపుణులు
రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల.
నిర్మాతలు: డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి.
కెమెరా: కె.చిట్టి బాబు.
సంగీతం: చరణ్ అర్జున్,
సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.సంజయ్ మహేష్ వర్మ,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి.
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే.
పిఆర్ఓ: సురేష్ కొండేటి.