‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ సినిమా ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
డైరెక్టర్ విప్లవ్ కోనేటి మాట్లాడుతూ..
సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.
నరేష్ గారు తక్కువ సీన్స్ చేసిన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ గారి క్యారెక్టర్ చూస్తే బయట ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుంది. నన్ను నమ్మండి మీరొక డిఫరెంట్ హెబ్బాను చూస్తారు ఈ సినిమాతో. హీరో రామ్ కార్తీక్ ను మిగతా వాళ్ళు తనని డామినేట్ చెయ్యకుండా, తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ…
రెండు రోజుల్లో ఈ సినిమా ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమాను చూడండి.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ….
ముందుగా మీడియాకు థాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే , ఈ సినిమాను ఈ జోనర్ అని ప్రత్యేకంగా చెప్పలేను. బట్ ఈ సినిమా మీకు మంచి థ్రిల్ ఇస్తుంది.
సినిమా:
నటీనటులు: రామ్‌కార్తీక్, హెబ్బాపటేల్
స్క్రీన్‌కి రచన, నిర్మాత & దర్శకత్వం: విప్లవ్ కోనేటి
నిర్మాత: విప్లవ్ కోనేటి
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
బ్యానర్: సిరంజ్ సినిమా, KSV ప్రెజెంట్స్
తారాగణం: నరేష్‌వికె, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి
సాహిత్యం: డాక్టర్ జివాగో
సంగీత విద్వాంసులు:
ప్రోగ్రామింగ్ : శ్రీచరణ్ పాకాల
అదనపు ప్రోగ్రామింగ్: షమ్మా మార్కస్
ట్రైలర్ ఎడిటర్ : SJ శివకిరణ్
PRO : మధుVR
డిజిటల్ మీడియా : ధీరజ్, ప్రసాద్ లింగం