అతిరథ మహారధుల సమక్షంలో ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి నెలలో రిలీజ్ కి సన్నాహాలు
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. ‘నటరత్నలు’ జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : సినిమా అనేది ఒక మెడిసిన్ లాంటిది అది ఎంత తీసుకుంటే అంత మంచిది. నటరత్నాలు టైటిల్ చాలా బాగుంది. నటరత్న అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశీస్సులతో నటరత్నాలు అనే టైటిల్ చాలా బాగా పెట్టారు. స్టీల్ ని కూడా కొలిమిలో కాలిస్తేనే ఖడ్గం లా మారుతుంది. అలా ఖడ్గంగా మారి ఉన్న వ్యక్తిత్వమే శివనాగు ది. శివనాగు మీద ఉన్న అభిమానంతోనే దర్శకులు కే. ఎస్ రవికుమార్ చౌదరి గారు, సముద్ర గారు లాంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉన్నా ఇండస్ట్రీలో నిలబడితేనే సక్సెస్. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యవస్థ. సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ సినిమా ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. మనిషికి కష్టాలున్నా బాధలున్నా ముందు వచ్చే ఆలోచన ఒక సినిమా చూడాలి. డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 గ్రాఫ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి మంచి సినిమా అవ్వాలి మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు శివనాగు మాట్లాడుతూ : సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. చాలా సంవత్సరాల నుంచి జర్నీ నాది కె ఎస్ రవికుమార్ చౌదరి గారిది మరియు సముద్ర గారిది. డైరెక్టర్స్ అవ్వకముందు నుంచే మంచి మిత్రులు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతి సినిమా సక్సెస్ కి ప్రమోషన్స్ ఏ కారణం. సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాను. నాకు ఎంత సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ అలాగే టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత చంటి యలమాటి గారు మాట్లాడుతూ : మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమా నటరత్నాలు. సూర్యకిరణ్ లో ఒక నటుడిని చూస్తారు. నేను 2002లో సినిమా మీద ఇంట్రెస్ట్ తో సినిమా ప్రొడ్యూస్ చేయాలని వచ్చాను. కానీ కొన్ని అనుకోని సంఘటన వల్ల లాస్ అయ్యాను. మళ్లీ చాలాకాలం తర్వాత డైరెక్టర్ శివ నాగు నాకు ఈ నటరత్నాలు కథ చెప్పడం జరిగింది. ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎంత బడ్జెట్ చెప్పారు అంతే బడ్జెట్లో సినిమా తీయగల దర్శకుడు శివ నాగు గారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమా ని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి గారు మాట్లాడుతూ : సినిమా అంటే ఇష్టం ఉంటే ఇండస్ట్రీలో ఎంత కష్టం ఉన్నా కూడా కష్టం అనిపియ్యదు. ముఖ్యంగా మా డైరెక్టర్ శివనాగు కష్టపడే వ్యక్తి. సినిమా మీద ఎంతో ఇష్టం ఉన్న వ్యక్తి. ఈ నటరత్నలు సినిమా చాలా ఇష్టపడి కష్టపడి తీశాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ అవుతారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని శివనాగు కి మంచి పేరు ప్రొడ్యూసర్ కి మంచి లాభాలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు సముద్ర గారు మాట్లాడుతూ : ఈ నట రత్నాలు సినిమా చాలా మంచి కథ. శివనాగు ఈ కథని చాలా ఇష్టంతో ఎంత కష్టపడి తీశారు. ఈ సినిమా మన సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి మరియు టైగర్ శేషాద్రి.
టెక్నీషియన్స్ :
నిర్మాణం : చందన ప్రొడక్షన్స్ మరియు ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : చంటి యలమాటి, డాక్టర్ దివ్య
సహ నిర్మాతలు : ఆనందాసు శ్రీ మణికంఠ, కోయి సుబ్బారావు
మ్యూజిక్ : శంకర్ మహదేవ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నర్రా శివనాగు
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పిఆర్ఓ : మధు VR