ప్రకృతికి హానీ చేయని డైమండ్స్ అంటే ఎంతో ఇష్టం – మంజుల ఘట్టమనేని
తనకు ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్వచ్ఛమైన డైమండ్లకు ఏ మాత్రం తీసిపోకుండా తక్కువ డబ్బులతో ఎక్కువ జ్యువెలరీని తీసుకోవచ్చని సినీ హీరో మహేష్‌బాబు సోదరి, నటి మంజుల ఘట్టమనేని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో లాడియా పేరుతో నూతనంగా ఏర్పాటు చేసినా లార్జెస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టోర్ ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ తనకు డైమండ్ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టమైనప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉండేదని కానీ ల్యాబ్‌గ్రోన్ డైమండ్ వల్ల ఎక్కువ రకాలను తీసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఒక డైమండ్ తయారు కావాలంటే సహజవనరులను ఎంతో పాడు చేయాల్సి ఉంటుందని అలా కాకుండా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. ఇలాంటి డైమండ్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు. హైదరాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో స్టోర్ ఏర్పాటు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న
ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ డైమండ్ రంగంలో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది ల్యాబ్ గ్రోన్ జ్యువెలరీ అని అన్నారు. ప్రకృతికి హానీ చేయకుండా ల్యాబ్‌లో మనకు నచ్చినవిధంగా దీన్ని తయారు చేయడం గొప్ప విషయం అన్నారు. దీని వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజా, అఖిల్, ప్రియా తదితరులు పాల్గొన్నారు.