ఘనంగా “ఇండియా ఫైల్స్” సినిమా ఆడియో లాంచ్
బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మకు హిమమాల సమర్పణలో డాక్టర్ బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఇండియా ఫైల్స్”. మన దేశంలోనే కల్చరల్ డి ఏన్ ఏ మీద తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే. ప్రముఖ రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ, సుమన్, శుభలేక సుధాకర్, సితార, మక్రంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్, హిమజ, జీవన్ కుమార్, సహస్ర వంటి తదితరులు నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత యం యం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణరాష్ట్ర సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ ని అభినందించి, తన బెస్ట్ విషెస్ తెలియజేసారు.
*మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి* మాట్లాడుతూ – తాను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినదగ్గర నుండి కొంతమంది హీరోలు, దర్శకులు సినిమా ఫంక్షన్ లకి పిలిచినప్పటికీ సమయం లేకపోవడం వలన అటెండ్ కాలేకపోయాను అని అన్నారు. కానీ మా అద్దంకి దయాకర్ వచ్చి 10 వ తేదీ నువ్వు ప్రసాద్ ల్యాబ్ కి రావాలి అని చెప్పగానే ఒకే అని చెప్పా.. కీరవాణి సార్ గారు కూడా వస్తున్నారు అని చెప్పగానే ఇంకా సంతోషించాం అని అన్నారు. ప్రముఖ హీరో సుమన్ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ అన్న కుమార్తె వెన్నల గారితో తన ఆప్యాయత ను పంచుకొని గద్దర్ గారి పోరాట పటిమ గురించి కొనియాడారు. ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ అండ్ సుచిత్ర చంద్రబోస్ గారి గురించి కొనియాడారు. మరి ముఖ్యంగా మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోగా నటించిన అద్దంకి దయాకర్ గురించి మాట్లాడుతూ.., ఆయన నటన నటన చూడలేదు కానీ, ఆయనకు ప్రతి సబ్జెక్ట్ అండ్ ప్రతి సమస్య పట్ల ఆయనకు ఉన్న అవగాహనా గురించి తెలిపారు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాకు తెలంగాణ గవర్నమెంట్ నుండి పూర్తి సహకారం ఉంటుంది అని భరోసా కలిగించారు. ప్రస్తుత సమాజానికి ఇండియా ఫైల్స్ లాంటి సినిమా చాలా అవసరం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది సోనియా గాంధీ అని మరోసారి గుర్తుచేశారు. కీరవాణి గారు అంటే నాకు చాలా ఇష్టం అని, తాను మన సినిమా స్థాయిని ఇంకా ఇంకా ముందుకి తీసుకెళ్లాలి అని కొనియాడారు. కీరవాణి గారిని ఆస్కార్ అవార్డు గెలిచిన తరువాత కలవడం, మా రాష్టం తరుపున ఆయనను సన్మానించడం చాలా సంతోషంగా గర్వంగా వుంది అని అన్నారు. ఇండియా ఫైల్స్ లాంటి గొప్ప సినిమా రిలీజ్ కి ఎటువంటి సహాయం కావాలి అని అడిగిన నేను ముందు ఉండి సహాయం చేస్తా అని హామీ ఇచ్చారు.ఈ సినిమా దర్శకుడు బొమ్మకు మురళి ఆశయాలు మన సమాజ అభివృద్ధికి చాలా అవసరం అని, ఇటువంటి సినిమాను ఆధరించి, భుజాల మీద మోసి పెద్ద హిట్టు చేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని అన్నారు.
*సంగీత దర్శకుడు యం యం కీరవాణి* గారు మాట్లాడుతూ .. ఇండియా ఫైల్స్ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కీరవాణి గారు మాట్లాడుతూ బొమ్మకు క్రియేషన్స్ వారి స్టూడియో విశేషాల గురించి చర్చించారు. బొమ్మకు క్రియేషన్స్ తో వారికి గల అనుబంధాన్ని గూర్చి మాట్లాడారు. తిరిగి చూడు పాట యొక్క గొప్పదనాన్ని, గద్దర్ గారితో తన పరిచయం మరియు సినిమాలో తనకి కలిగిన సరదా అనుభవాల గురించి మాట్లాడుతూ.. గద్దర్ గారు పాడి ఆడి నటించిన పాటకి తాను మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా తన సంతోషాన్ని వెళ్ళబుచ్చారు.
*చిత్ర కథానాయకుడు డాక్టర్ అద్దంకి దయాకర్* మాట్లాడుతూ.. నేను ఈ సినిమాకు హీరో చేయడానికి అవకాశం కల్పించిన బొమ్మకు మురళి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఈ సినిమాకు ముఖ్య అతిధిగా వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి చాలా థాంక్స్ అని అన్నారు. ఈ సినిమాలో ఉన్న పాటలు కోమటిరెడ్డి గారికి బాగా నచ్చాయి. నేను కోమటిరెడ్డి అన్న గురించి ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు మా గద్దర్ అన్న వెంటనే నన్ను తీసుకోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న ఇంటికి తీసుకెళ్లి నీ పెద్దన్న లాంటోడు అని చెప్పిన గద్దర్ అన్న ను గుర్తుచేసుకున్నారు. మన ఇరు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ ని ఇంకో మెట్టు ఎక్కించాలి అనే తాపత్రయంతో ఉన్నారు మన కోమటిరెడ్డి అన్న అని తెలిపారు. యాక్టింగ్ అంటే ఏంటో తెలియని నన్ను 40 రోజులు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించారు అని తెలిపారు. సుమన్ గారితో, రవి ప్రకాష్ గారితో నటించడం చాలా బాగుంది అని తెలిపారు. బొమ్మకు మురళి గారి తరువాత భారతదేశంలో ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా మంది దర్శకులు ముందుకు వస్తారు అని అన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ కానుంది, ముందు ముందు ఈ కాన్సెప్ట్ ప్రపంచ స్థాయికి వెళ్లే అంతటి కల్చరల్ డి ఎన్ ఏ కంటెంట్ మన ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని తెలిపారు.
*హీరో సుమన్ గారు* మాట్లాడుతూ.. తనకు తెలిసి సినిమా ఇండస్ట్రీ లో కేవలం సినిమా కోసమే బ్రతికిన ఏకైక హీరో కమల్ హాసన్ గారు అని ఆయన సంపాదించినా డబ్బు అంతా కేవలం సినిమాలు చిత్రీకరించడం కోసమే ఖర్చు పెట్టేవారు అని అన్నారు. ఆ తరువాత రామోజీ రావు గారు అండ్ ఆ తరువాత బొమ్మకు మురళి గారు సినిమా కోసమే బ్రతుకుతున్నారు. ఈ సినిమాలో తనకు మురళి గారు చాలా డిఫరెంట్ రోల్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. కీరవాణి గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కీరవాణి సంగీతం ప్రపంచం మొత్తం కనెక్ట్ అవుతుంది అని ప్రశంసించారు. ఈ సినిమాకు గద్దర్ గారు పాడిన పాట సినిమాకు హిట్టు ని అందిస్తుంది అని తెలిపారు. దయాకర్ గారితో నటించిన అనుభూతి చాలా బాగుంది అని తెలుపుతూ, సినిమా పెద్ద ఘనవిజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు.
*గీత రచయిత మౌనశ్రీ మల్లిక్* మాట్లాడుతూ.. తాను సీరియల్స్ లలో 700కు పైగా పాటలు రాసానని, అయితే తన జీవితంలో గుర్తుండిపోయే ఘట్టాలు గురించి మాట్లాడుకుంటే ఒకటి తన పాటను ఎస్ పి బాలసుబ్రమణ్యం గారు పాడటం, మరొకటి ఇప్పుడు తను రాసిన పాటను ఎం ఎం కీరవాణి గారు పాడటం వలన తన జన్మ చరితార్థం అయినట్టు తను భావిస్తున్నాను అని సంగీత దర్శకుడు కీరవాణి గారి పట్ల తనకున్న అభిమానాన్ని ప్రేమను తెలియజేసారు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని ఆశాభావం వ్యక్తం చేసారు.
*గద్దర్ కూతురు వెన్నల* మాట్లాడుతూ, ఇండియా ఫైల్స్ అనేది సినిమా కాదు, ఇది మన జీవితం అని కొనియాడారు. గద్దర్ గారు మన మధ్య లేకున్నా ఆయన మనలో నింపిన స్ఫూర్తి, పోరాట పటిమ మనలో ఎప్పటికి ఉంటాయి అని అన్నారు. గద్దర్ గారు చివరిరోజుల్లో మన సమాజం గురించి చెప్పిన మాటలు చెప్పి ఎమోషనల్ అయి.. గద్దర్ అన్న గురించి ఒక అద్భుతమైన పాటను పాడి సభ అంతా భళా గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న అనిపించారు ఆయన కూతురు వెన్నల. ఈ చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ తెలిపి సినిమా మంచి విజయం సాధించాలి అని ఆకాంక్షించారు.
*ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్* గారు, భారతదేశానికి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన ఎం ఎం కీరవాణి గారి పాదాల చేత పూలు తో సత్కరించి తనతో కీరవాణి గారికి ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. గద్దర్ గారి సినిమా కోసం పనిచేయడం తన అదృష్టం అని కొనియాడారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని ఆకాక్షించారు.
*ఈ సినిమా దర్శకులు – నిర్మాత అయినటువంటి డాక్టర్ బొమ్మకు మురళి* గారు మాట్లాడుతూ,నేను మీ అందరి కోసం తెరకెక్కించిన ఈ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి గారి గురించి ముందుగా మాట్లాడాలి. ఆయన మా సినిమాకు బాహుబలి సినిమా స్థాయి మ్యూజిక్ అందించారు. ప్రపంచంలో ప్రతి మూలకు వెళ్లగలిగే శక్తి ఒక్క సినిమాకు మాత్రమే ఉంది. ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమాకు ముందుగా బీజం వేసింది గద్దర్ అన్ననే అని అన్నారు. గద్దర్ అన్న ఎప్పుడూ అంటుండేవారు సంసకృతిక విప్లవం అండ్ కల్చరల్ ఇన్వెన్షన్ మన దేశంలో ఇన్ని వేల దేవుళ్ళు, ఇన్ని లక్షల ఆచారాలు, ఇన్ని కోట్ల దేవుళ్లను సృష్టించింది అని. అయితే మనిషికి కష్టం, కులం, మతం, దేవుడు అనేవి ఎలా మనల్ని ప్రభావితం చేస్తది – అది మనకు అవసరమా.? వేరే ఏ జీవరాశులకు అలంటి ఆచారాలు లేవు కదా.. అంటే మనిషి ఎదో ప్రాబ్లమ్ లో ఉన్నది, మనిషి ఆర్డర్ లో పెట్టడానికి మనం కాలక్రమేణా మనం ముందుకి తీసుకోని వస్తున్న ఒక వ్యవస్థ నే ఈ కల్చరల్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ రూపంలో వచ్చాయి అని అన్నారు. పదివేల సవంత్సరాల క్రితం పులితో కూడా పోరాడిన మనిషి నేడు అదే పులిని చూడగానే భయపడుతున్నాడు.., పారిపోతున్నాడు. అది మన డి ఎన్ ఏ లో అలా మన పంచేంద్రియాలు అలా నడిపిస్తున్నాయి. ఈ కల్చరల్ ఇన్వెన్షన్ ను ఆర్యుడు మన దేశంలోకి తీసుకొచ్చారు. ఈ సినిమాలో గద్దర్ అన్న చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు, సినిమా కథ విషయంలో నాకు ఎంతో హెల్ప్ చేసారు. ఈ కథ కోసం ఒక రియల్ టైమ్ హీరో కావాలి, ఒక రియల్ టైమ్ రాజకీయ నాయకుడు కావాలి, లీడర్ మాత్రమే మన సమాజాన్ని ప్రభావితం చేయగలడు అని నమ్మి అద్దంకి దయాకర్ గారిని హీరోగా అనుకోని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ సినిమాకు సాహిత్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మన కార్యనిర్వాహక నిర్మాత కనకదుర్గ గారి వలన నాకు పరిచయం అయిన మౌనశ్రీ మల్లిక్ గారు తిరిగి చూడు అనే అత్యంత గొప్ప పాట ను ఈ సినిమాకు రచించారు. గద్ధర్ అన్న కు కీరవాణి గారు అంటే చాలా ఇష్టం, తనే మా సినిమాకు కీరవాణి గారు సంగీతం అందించేలా చేసారు. ఆయన మంచితనం, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రేమ – గద్దర్ అన్న తరువాత నేను చూసిన అంత గొప్ప వ్యక్తి ఏం ఏం కీరవాణి గారు. మేము బ్రతికున్నంత కాలం గుర్తుపెట్టుకొని,ఈ సాంగ్స్ మేము చేసాం అనే గర్వంగా ఫీల్ అయ్యే పాటలు ఇచ్చారు కీరవాణి సార్.. మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆయన పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు డాక్టర్ బొమ్మకు మురళి. ఈ సినిమా బడ్జెట్ కష్టం అనిపించడం వలెనే నేను స్వయంగా బొమ్మకు స్టూడియోస్ అనే సంస్థను స్థాపించి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం మా స్టూడియో లోనే చేసాం, వేరే చిన్న సినిమాలకు కూడా అతి తక్కువ ధరలకే అందిస్తున్నాం అని అన్నారు. మా సినిమాకు పనిచేసిన కార్తిక్ – ఫిల్మ్ ఎడిటర్, రాజ్కిరణ్ కన్నడ సాంగ్ పాడారు, ఇలా మాకు సపోర్ట్ అందించిన అందరికి చాలా థాంక్స్. ఈ సినిమాకు గద్దర్ అన్న కు తగ్గ స్టెప్స్ నేర్పించిన సుచిత్రా చంద్రబోస్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. సుమన్ గారు మా సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు, ఆయన చాలా గొప్ప మనిషి ఆయనకు ఈ సభా ముఖంగా ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా మీ అందరికి మన సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది.. మీ అందరిని ఆలోచింపజేసి మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది అని అన్నారు.
కాగా ఈ సినిమాకు *డిఓపి జి ఏల్ బాబు, ఎడిటర్ కార్తిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనక దుర్గ, కో ప్రొడ్యూసర్స్ బొమ్మకు చైతన్య, బొమ్మకు మన్నవ్, మాటలు: భూపతి, బాద్షా, నాగులపల్లి కనకదుర్గ, పి ఆర్ ఓ:వినోద్ కావూరి,(కావూరి మీడియా) పాటలు: గద్దర్, మౌనశ్రీ మల్లిక్, ఆదేశ్ రవి, సింగర్స్: యం యం కీరవాణి, ఆదేశ్ రవి, రాజ్ కిరణ్, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్, ఫైట్ మాస్టర్: ప్రేమ్ రాజ్ గౌడ్, ఒరిజినల్ స్టోరి లైన్: గద్దర్, కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: డాక్టర్ బొమ్మకు మురళి*.