“కంచర్ల” మూవీ షూటింగ్ పూర్తి, ఆగష్టులో విడుదల
ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుత రావు ఎస్ ఎస్ ఎల్ వి క్రియేషన్స్ పతాకంపై ఒకేసారి ఎనిమిది సినిమాల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. ఆయన కుమారుడు ఉపేంద్ర బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ఉపేంద్ర గాడి అడ్డా చక్కని విజయం సాధించింది.
విశాఖ యువ కెరటం, కంచర్ల ఉపేంద్ర బాబు, హీరోగా నటిస్తున్న కంచర్ల సినిమా ఆఖరి సాంగ్ విశాఖ తొట్ల కొండ బీచ్ లో షూటింగ్ జరుపుకోవడం తెలిసిందే. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ అరకు లో గల మడగడ వ్యూ పాయింట్ వద్ద పూర్తి చేసారు. విశాఖ పరిసర ప్రాంతాలలో కూడా షూటింగ్ జరిపారు.
ఈ సందర్భంగా నగరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొడ్యూసర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, తమ కుటుంబ ఇంటి పేరు కంచర్ల టైటిల్ తో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం అన్నారు.
ఈ షెడ్యూల్ తో సినిమా మాటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపారు. సినిమాల ద్వారా వచ్చే లాభాలతో తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. తమ బ్యానర్ లో ఇది రెండో సినిమా అని గుర్తు చేశారు. తమ సినిమాలలో స్థానిక కళాకారులకు కూడా అవకాశం ఇస్తున్నాం అన్నారు. ఎనిమిది సినిమాలు నిర్మిస్తున్నాం. కంచర్ల తమ బ్యానర్ లో మొదటి సినిమా అని గుర్తు చేశారు. కానీ, బడ్జెట్ పెంచి పెద్ద సినిమాగా మారడం వల్ల విడుదలలో ఆలస్యం అయ్యింది అన్నారు. హీరో ఉపేంద్ర, హీరోయిన్ మీనాక్షి, ప్రణతి అద్భుతంగా నటించారు. ఆగస్టు 15 తరువాత సినిమా విడుదల చేస్తాం. పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆర్ ఆర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయి అన్నారు.
పిల్లల నుంచి పెద్దల వరకు మంచి కంటెంట్ తో సినిమా నిర్మించాం. డైరెక్టర్ యాద్ కుమార్ ఈ సినిమాతో విమర్శకులకు గట్టిగా సమాధానం చెబుతారు అని స్పష్టం చేశారు. ఉపేంద్ర వైవిధ్య భరితంగా సినిమాలు చేస్తున్నారు అన్నారు. ఉపేంద్ర బీ ఫార్మసీ, ఐ పి సి 396, అనగనగా కథలో, వధ, విక్రమ్ కే దాస్, సినిమాలు నిర్మాణంలో వున్నాయి. గుణశేఖర్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకు మంచి ఎసెట్ అని కొనియాడారు. రాజ్ కృష్ణ కొరి యోగ్రఫీ బాగా చేసారు అని ప్రశంసించారు. సాంకేతిక నిపుణులు అందరూ బాగా పని చేశారు అన్నారు. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది అన్నారు. మధుబాబు కథ, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి అన్నారు. త్వరలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ మధురవాడలో నిర్వహిస్తాం.
హీరో ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ, ఎస్ ఎస్ ఎల్ సి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ – 2 గా కంచర్ల సినిమా చేస్తున్నామన్నా రు. ఆఖరి షెడ్యూల్ సాంగ్స్ తో 18 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకున్నాం అని పేర్కొన్నారు. ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఒక
అద్భుతమైన కథతో తమ వంశం ఇంటి పేరు కంచర్ల టైటిల్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంటుంది అన్నారు.
చిత్రం ప్రధాన
హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ, ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది అని సంతొషం వ్యక్తం చేశారు. ఈ సినిమాఅన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకుంటుంటుంది అన్నారు. కాగా, ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అత్యంత క్వాలిటీగా, అద్భతంగా నిర్మిస్తున్నారని కొనియాడారు.
డైరెక్టర్ యాద్ కుమార్ మాట్లాడుతూ, తన గత చిత్రాల మాదిరిగానే కంచర్ల సినిమాలో కూడా మంచి సందేశం వుంటుంది అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు. నిర్మాత అచ్యుత రావు కుటుంబం భూముల దానం నేపథ్యంలో రాసుకున్న కథతో సినిమా తెరకెక్కించాం అన్నారు. రఘు కుంచె వీనుల విందైన సంగీతం అందించారు అని ప్రశంసించారు. చిత్ర నిర్మాణంలో నిర్మాత యూనిట్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని ధన్య వాదాలు తెలిపారు. నటుడు సుమన్ ఇందులో హీరో ముత్తాత పాత్రలో చేశారు అన్నారు. అజయ్ ఘోష్ పాత్ర కూడా బాగా వచ్చింది అన్నారు. సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అని పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో
కో డైరెక్టర్ త్రినాధ్, అసిస్టెంట్ డైరెక్టర్ వినోధరాని, ప్రొడక్షన్ మేనేజర్ శేఖర్, సూర్యపకాష్ పుమ్మిమి, క్యాషియర్ నాగు పాల్గొన్నారు.