జీవీ రావు రూపొందించిన “ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని” సాంగ్ రిలీజ్
క్వాలిటీ ఆఫ్ ఓటింగ్, 75 భారత స్వాతంత్ర్యంలో సాధించిన ఎన్నో ఘన విజయాలను నేపథ్యంగా ఎంచుకుని పాట రూపంలో వ్యక్తపరుస్తూ జీవీ రావు “ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని” అనే పాటను రూపొందించారు. మౌనశ్రీ మల్లిక్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు డా. యశో కృష్ణ సంగీతాన్ని అందించారు. సింగర్ హైమత్ మహమ్మద్ పాడారు. ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని పాట విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
*పాట రూపకర్త జీవీ రావు మాట్లాడుతూ* – గత మూడేళ్లుగా పంజాబ్, యూపీ, కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ కోసం 18 నుంచి 30 ఏళ్ల యువతకు అవగాహన కల్పిస్తూ పాటలు రూపొందించి వారికి యూట్యూబ్ ద్వారా పంపడం జరిగింది. ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటను 5 లక్షల మంది చూశారు. మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 75 ఏళ్ల స్వాత్రంత్య భారత ప్రగతితో పాటు 2024 ఎలక్షన్స్ ను కలిపి ఈ పాట రూపొందించాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కులం, మతం, ప్రాంతం, డబ్బు ప్రభావానికి లోను కాకుండా జాగురకతతో ఓటు వేశారు. ఇకపైనా ప్రజల్లో క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ పై అవగాహన కల్పించేలా పాటల రూపకల్పన, ఇతర కార్యక్రమాలు చేపడతాం. ప్రపంచదేశాలతో చూస్తే మన దేశంలో సగటున 67 శాతం ఓటింగ్ జరుగుతోంది. ఇది మంచి నెంబర్ గా చెప్పవచ్చు. క్వాలిటీ ఆఫ్ వోటింగ్ ఇంప్రూవ్ చేయాల్సిఉంది. ఈ పాట రూపొందించడంలో నాకు సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ మా ప్రోగ్రామ్స్ ను గైడ్ చేస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు గారు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్నారు
*రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా మాట్లాడుతూ* – జీవీ రావు నాకు యూనివర్సిటీ టైమ్ నుంచి మంచి మిత్రుడు. ఆయన గత మూడేళ్లుగా క్వాలిటీ ఆఫ్ ఓటింగ్ కోసం పాటలు రూపొందిస్తూ యువతలో, ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన మన సమాజంలో జాగురతక రావాలనే ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సాంగ్స్ ఆయన మరెన్నో రూపొందించాలని కోరుకుంటున్నా. అలాగే ఆయన పేరును జీవీ రావు కాకుండా జీవీఆర్ అని పెట్టుకుంటే మరింతగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. నా ఫ్రెండ్ జీవీ రావుకు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.