వీబీ ఎంటర్టైన్మెంట్స్ పదో వార్షికోత్సవం 2023-2024 బుల్లితెర అవార్డులను నిర్వహించిన బొప్పన విష్ణు


విష్ణు బొప్పన గారి వీబీ ఎంటర్టైన్మెంట్స్ 2023-2024 సంవత్సరాలకు గాను, బుల్లి తెర అవార్డుని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లో ఘనంగా ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షం లో అవార్డుల ప్రధానోత్సవం చేసారు. ఈ ఈవెంట్ కి సమర్పకులు, వర్చ్యుసా లైఫ్ స్పేసెస్ కి సంబందించిన వైగండ్ల వెంకటేశ్వర్లు , వీవీకే హోసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబందించిన విజయ్ కుమార్, ఐశ్వర్య సిల్క్స్ లక్ష్మి, మరియు అడ్వాకేట్ నాగేశ్వర్ రావు పూజారి.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు, దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి, నిర్మాత కె అచ్చి రెడ్డి, నిర్మాత మరియు అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ. జేడీ లక్ష్మి నారాయణ, హీరో పూరి ఆకాష్, మరియు హీరోయిన్ అర్చన.

ఈ ఈవెంట్ లో సీనియర్ నటి శ్రీలక్ష్మి గారికి జీవన సాఫల్య పురస్కారం అందించారు. అంతే కాకుండా టీవీ ఆర్టిస్ట్స్ కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్స్ కి, యూట్యూబర్స్ కి కూడా అవార్డుని ప్రధానం చేశారు. అంతే కాకుండా, పది మంది పేద కళాకారులకి ఆర్ధిక సాయం కూడా అందించారు.

లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకున్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “వీబీ ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డు వారికి నా ధన్యవాదాలు. ఇన్నేళ్ళుగా సినిమాల్లో నటిస్తున్న నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ని అందించారు. మొదటగా నేను మా గురువు గారి జంధ్యాల గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ తర్వాత నేను పని చేసిన డైరెక్టర్స్ అందరికీ తాంక్స్. నా మీద ఎప్పటికప్పుడు విశేష ప్రజాధారణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటాను. మరొక్క సారి ఇక్కడున్న వారందరికీ వీబీ ఎంటర్టైన్మెంట్స్ కి ధన్యవాదాలు” అన్నారు.

ఈ ఈవెంట్ కి హాజరైన అతిథులందరికీ ఘానా స్వాగతం లభించింది. అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు నిర్వాహకులు.

శ్రీలక్ష్మి గారితో పాటు అవార్డ్స్ అందుకున్న వారు మరియు పాల్గొన్నవారు : మానస, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 యియర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్య వాని, రీతూ చౌదరి, బులెట్ భాస్కర్, రామ సత్యనారాయణ, మా అసోషియేషన్ మెంబర్ మాణిక్యం, మాదాల రవి

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *