Fashion

నీతో మూవీ లో మీ పాత్ర

నీతో మూవీ లో మీ పాత్ర

“నీతో” చిత్రం రెగ్యులర్ లవ్ స్టోరీ లా ఉండదు – సాత్వికా రాజ్

అభిరామ్ వర్మ (Abhiram Varma), సాత్వికా రాజ్ (Swathika Raj) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ బాలు శర్మ (Balu Sharma) దర్శకత్వం వహించిన మూవీ “నీతో” (Neetho). పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా  సాత్వికా రాజ్ “నీతో”  సినిమా గురించి  పలుఆసక్తికర విషయాలను పంచుకుంది.

నీతో మూవీ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది.?
ఈ సినిమాలో నా పాత్ర…  పెద్దగా ప్రాబ్లెమ్స్ అంటూ ఏమి లేని ఒక బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిగా కనిపిస్తాను. ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి, కొన్ని అనుకోని పరిస్థితిలు  వలన  ఎటువంటి ప్రాబ్లెమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లెమ్స్ ను ఎలా ఫేస్ చేశాను అనేది  ఈ సినిమాలో నా కేరక్టర్.

నీతో అనే ఈ సినిమా ఎలా ఉండబోతుంది.?
ఇదొక లైట్ లవ్ స్టోరీ జాన్రా, కానీ రెగ్యులర్ లవ్ స్టోరీస్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనే థీమ్ తో ఈ సినిమా మొత్తం సాగుతుంది.

వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, సో మ్యూజిక్ గురించి మీ మాటల్లో?
వివేక్ సాగర్ గారితో నాకు అంతగా ఇంట్రాక్షన్ లేదు కానీ మా సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, కథకు ఏమి కావాలి అది తన మ్యూజిక్ ద్వారా వివేక్ సాగర్ అందించారు.

అభిరామ్ వర్మ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
చాలామంచి  కో-స్టార్ అభిరామ్. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది, అభిరామ్ మంచి సపోర్టివ్ యాక్టర్, కొన్ని సీన్స్ తీసినప్పుడు కానీ, షాట్స్ లో రియాక్షన్స్ లో డైలాగ్స్ విషయం లో చాలా మంచి హెల్ప్ చేసాడు.

ఈ కథను మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.?
ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ లా కాకుండా చాలా డిఫెరెంట్ గా అనిపించింది. అది నాకు బాగా నచ్చింది. బాలు గారు నాకు ఈ కథ చాలా సేపు చెప్పారు.  చాలా లవ్ స్టోరీ లు ఉన్నాయ్, కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్ అండ్ న్యూ  లవ్ స్టోరీ   రావాలంటే కష్టం,  సో ఈ కథను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.

ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది ఆశిస్తున్నాను.

About Author

MaaMovie-admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *