“దోస్తాన్” టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు
Read Moreనవంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతున్న మూవీ “ఇన్ సేక్యూర్”. ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సిహెచ్ క్రాంతి కిరణ్ సహకారం తో
Read Moreనాన్నగారిని స్పూర్తిగా తీసుకుని విజయాలు సాధించిన ఎల్. విజయలక్ష్మిగారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి- నందమూరి బాలకృష్ణ మహిళాసాధికారికతకు ఎల్. విజయలక్ష్మిగారే నిదర్శనం- బాలకృష్ణ ఎల్.విజయలక్ష్మి బాల నటిగా
Read More‘ఆకాశం’ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ.. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ఆడియెన్స్ మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం : హీరో అశోక్ సెల్వన్
Read Moreడీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ చేత మయూఖి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న
Read Moreవాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్,
Read Moreనవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైన ” పసివాడి ప్రాణం ” గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించి విడుదలై ఘన విజయం సాధించి నేటికిని తెలుగు ప్రేక్షకుల
Read More“రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామారాజ్ అశ్విన్ & రమేష్.కె సమర్పణలో
Read More‘యశోద’లో కథే హీరో… మీ మనీకి వేల్యూ ఇచ్చే సినిమా ఇది : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ – – – – – – –
Read Moreబనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. విజువల్ ట్రీట్ లా వుంటుంది: హీరో జైద్ ఖాన్ ఇంటర్వ్యూ కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరో జైద్ ఖాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్’ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ? దాదాపు దేశం మొత్తం కవర్ చేశాం. ముంబై, పూణే, ఢిల్లీ, లక్నో, బనారస్, గురజాత్, ఆంధ్రా, తెలంగాణ, కలకత్తా, తమిళనాడు.. ఇలా దేశం అంతా తిరిగాం. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ ఈవెంట్ లో వచ్చిన రెస్పాన్ చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు చూపిన అభిమానాని కి కృతజ్ఞతలు. అలాగే లక్నో లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బనారస్ కి ముందు ఎవరైనా మిమ్మల్ని కలిశారా ? నాంది సతీష్ గారు ఒక తెలుగు సినిమా చేద్దామని కలిశారు. అయితే అప్పటికి నేను ఇంకా రెడీగా లేను. ఒక కోర్స్ ట్రైనింగ్ లో వున్నాను. అలాగే హిందీ నుండి కూడా రెండు అవకాశాలు వచ్చాయి. అయితే నా ద్రుష్టి సౌత్ సినిమాపైనే వుంది. బనారస్ ని మీరే ఎంచుకున్నారా ? దర్శకుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ? బనారస్ ఛాయిస్ నాదే. నేనే దర్శకుడు జయతీర్ధని అప్రోచ్ అయ్యాను. చాలా కాలం నుండి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కోసం ఎదురుచూశాను. ఫైనల్ గా బనారస్ తోజయతీర్ధ గారు వచ్చారు. అలా మా ప్రయాణం మొదలైయింది. కెజియఫ్, కాంతార సినిమాల విజయాలతో కన్నడ సినిమా పరిశ్రమపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు బనారస్ వస్తోంది. ఈ విషయంలో ఏమైనా ఒత్తిడి ఫీలౌతున్నారా ? ఒత్తిడి కాదు కానీ భాద్యత వుంటుంది. నేను కొత్త కావచ్చు కానీ పాన్ ఇండియా అనేది చిన్న విషయం కాదు. మా నిర్మాతలకు ముందే చెప్పాను. కెజియఫ్, కాంతార తో కన్నడ సినిమా ఒక గొప్ప స్థాయిని సంపాదించుకుంది. ఈ విషయంలో నాకు చాలా ఆనందం వుంటుంది. కన్నడ నుండి మరో పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఒక స్థాయిలో వుండాలి. బనారస్ ని అన్ని భాషల పంపిణీదారులకు చూపించాం. వాళ్ళంతా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులని అలరిస్తోందని అభిప్రాయపడిన తర్వాతే పాన్ ఇండియా విడుదలని నిర్ణయించాం. బనారస్ విజువల్స్ చూస్తుంటే బాలీవుడ్ మూవీ లా కనిపిస్తుంది ? విజువల్స్ పై నేను ప్రత్యేక ద్యాస పెట్టాను. సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ కి ఒక చిన్న చూపు వుండేది. సౌత్ సినిమాల్లో క్యాలిటీ వుందని వారు అభిప్రాయ పడేవారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకొని బనారస్ ని చాలా గ్రాండ్ గా ఎక్కడా రాజీ పడకుండా బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు ఎందులోనూ తక్కువ కాదని తెలియజేశాలా బనారస్ ని చిత్రీకరించాం. ప్రస్తుతం సౌత్ పరిశ్రమ గొప్ప స్థితిలో వుంది. బనారస్ నేపధ్యంలో సినిమా చేయడానికి కారణం ? బనారస్ కంటెంట్ లో ఒక మిస్ట్రీరియస్, డార్క్ ఎలిమెంట్ వుంది. దానికి బనారస్ నేపధ్యం ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాగ్డ్రాప్ .. రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ. 85శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. ప్రేక్షకు లకి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో టైం ట్రావెల్ కూడా వుంటుంది. అయితే అది కథలో కొంత భాగమే. ఇది మీ మొదటి సినిమా కదా.. ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ? మనకి ఏదైనా కావాలంటే దాని కోసం మనమే నిలబడాలి. అలాగే జీవితం చాలా చిన్నది. అందరితో ప్రేమగా వుండి నలుగురికి సాయపడటమే జీవితం. ఈ రెండు విషయాలు బనారస్ నుండి నేర్చుకున్నాను.
Read More