రాజ్‌తరుణ్‌ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌ బేనర్‌పై పురుషోత్తముడు చిత్రం ఘనంగా ప్రారంభం.

రాజ్‌తరుణ్‌ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌ అనే నూతన నిర్మాణ సంస్థ ‘పురుషోత్తముడు’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మేడే నాడు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించింది. రమేష్‌ తెజావత్‌, ప్రకాష్‌ తెజావత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ భీమన దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైకు చెందిన హాసిని సుధీర్‌ కథానాయికగా పరిచయం అవుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ కెమేరా స్విచ్చాన్‌ చేయగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ దామోదర్‌ ప్రసాద్‌, స్వామినాయుడు, రాజారవీంద్ర, సూర్యకిరణ్‌, చేతన్ చీను, దాసరి కిరణ్ కుమార్, మధు మదాసు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చిత్ర దర్శకుడు రామ్‌ భీమన మాట్లాడుతూ, కోవిడ్‌ తర్వాత సమయం తీసుకుని మంచి స్పాన్‌ వున్న కథను రాసుకున్నాను. ఆకతాయి చిత్రం తర్వాత చేస్తున్న సినిమా. మంచి కథ కుదిరింది. ముంబైలో సెటిల్‌ అయిన తెలుగువారైన నిర్మాతలు రమేష్‌ తెజావత్‌, ప్రకాష్‌ తెజావత్‌ నేను చెప్పిన కథను విని మన మూలాలను మర్చిపోకుండా కథను అంగీకరించారు. కథకు తగిన సాంకేతిక నిపుణులను సమకూర్చారు. పి.జి.విందా కెమెరామెన్‌గా, గోపీసుందర్‌ సంగీతపరంగా చక్కటి బాణీలు సమకూరుస్తున్నారు. సినిమా కథకు తగిన హీరోగా రాజ్‌ తరుణ్‌. తనకు కథ చెప్పగానే పూర్తిగా విన్నారు. ఆ తర్వాత ప్రతి సీన్‌ గురించి తిరిగి చెప్పడం ఆయన డెడికేషన్‌ నన్ను ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి మరిన్ని సినిమాలు తీయడానికి నాకు, నిర్మాతలకు నాంది అవుతుందని భావిస్తున్నాను. పురుషోత్తముడు అనే మంచి టైటిల్‌తో ముందుకు వస్తున్నాం. పాన్‌ ఇండియా ఆర్టిస్టులను తీసుకుంటున్నాం. మాటలపరంగా చక్కగా టీమ్‌ కుదిరింది.
ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌, రాజమండ్రి, కేరలలోనూ ఓ పాటను విదేశాలలో తీయబోతున్నాం. జూన్‌ 1నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందని అన్నారు.

కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, దర్శకుడు రామ్‌గారు కథ చెప్పగానే కొత్తగానూ ఎగైట్‌మెంట్‌ కలిగించింది. నిర్మాతలలో మంచి సినిమా తీయాలనే తపన కనిపించిది. ఈ సినిమాతో పి.జి. విందాగారితో పనిచేసే అవకాశం దొరికింది. గోపీసుందర్‌తో పనిచేయడం హ్యాపీ. హీరోయిన్‌ హాసిని తెలుగు నేర్చుకుని సినిమా చేయడం ఆమెకు సినిమాపై వున్న ప్రేమను తెలియజేస్తుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌ అన్నీ వుంటాయి. నేను ఎందులో పురుషోత్తముడు అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే అని అన్నారు.

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, గోపీసుందర్‌గారు ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. మలయాళంతోపాటు ధీటుగా తెలుగు సినిమాలకు మంచి మెలోడీ ఇస్తున్నారు. ఈ సినిమాకు పనిచేయడం మాకు చాలా ఆనందంగా వుంది. ఇందులో ఆరుపాటలుంటాయి. ఈరోజు నుంచి కంపోజ్‌ కూడా మొదలవుతుంది. రాజ్‌తరుణ్‌కు టైలర్‌ మేడ్‌ పాయింట్‌. కథలో బలం వుంది. పురుషోత్తముడు వంటి మంచి టైటిల్‌ రాజ్‌ తరుణ్‌కు అందంగా కుదిరింది. బ్రహ్మాండమైన విజయం సాధించాలని ఆకాక్షించారు.

సంగీత దర్శకుడు గోపీసుందర్‌ మాట్లాడుతూ, ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుంది. 6 సిట్యువేషన్‌ సాంగ్స్‌ వున్నాయి. అన్నీ మెలోడీ పాటలే. దర్శకుడు రామ్‌ భీమనతో పనిచేయడం హ్యాపీగా. రాజ్‌తరుణ్‌తో చేయడం మరింత హ్యాపీగా వుందని తెలిపారు.

నిర్మాత రమేష్‌ తెజావత్‌ మాట్లాడుతూ, రామ్‌గారు చెప్పిన కథ వినగానే చాలా ఆకట్టుకుంది. ఈ కథ ఇంతవరకు రాలేదని అనిపించింది. అందుకే భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. మా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్‌లో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే నమ్మకముందని పేర్కొన్నారు.

మరో నిర్మాత ప్రకాష్‌ తెజావత్‌ మాట్లాడుతూ, అమలాపురంలో పుట్టి కాకినాడలో పెరిగి ముంబైలో సెటిల్‌ అయ్యాం. రామ్‌గారు కథ చెప్పగానే నిద్రలోకూడా వెంటాడింది. అంతచక్కటి కథను తీసుకున్నాం. హాసిని ముంబై హీరోయిన్‌ అయినా తెలుగుపై ప్రేమతో భాష నేర్చుకుంది. తెలుగువారితో కలిసి చక్కటి క్వాలిటీ కథతో రాబోతున్నాం. రాజ్‌తరుణ్‌ సినిమాలంటే అందరినీ అలరించేవిధంగా వుంటాయి. ఈ సినిమా కూడా అలానే వుంటుంది అని తెలిపారు.

హీరోయిన్‌ హాసిని మాట్లాడుతూ, తెలుగులో మొదటి సినిమా నాది. రెండు సంవత్సరాలుగా నన్ను ట్రైన్‌ చేసి దర్శక నిర్మాతలు అవకాశం ఇచ్చారు. వారికి చాలా థ్యాంక్స్‌ అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ పి.జి. విందా మాట్లాడుతూ, మేడేనాడు శుభారంభం కావడం ఆనందంగా వుంది. ఫొటోగ్రఫీ, సంగీతం, హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలంటే కథే ముఖ్యం. అది రామ్‌గారి కథలో వుంది. అందుకు తగిన నిర్మాతలు లభించారు. మేకింగ్‌ ది బెస్ట్‌ అడిగారు. నేను ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తాను. సరికొత్త కథకు నిదర్శనంగా పురుషోత్తముడు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పగలను. ఎందుకంటే రామ్ గారు తయారు చేసిన కథ చాలా బాగుంది. కథకు సరైన హీరో కుదిరారు. మంచి విజయం సాధించాలి కోరుకుంటున్నానని తెలిపారు.

తారాగణం: రాజ్‌ తరుణ్‌, హాసిని సుధీర్‌ తదితరులు
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రాఫర్‌ పి.జి. విందా, మాటలు: రామస్వామి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్‌, పూర్ణా చారి, ఆర్ట్‌: వెంకటేష్‌ జి., ఎడిటర్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫైట్స్‌: పృధ్వీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంగళరావు, నిర్మాతలు: రమేష్‌ తెజావత్‌, ప్రకాష్‌ తెజావత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ భీమన.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *