శ్రీనివాసుడు కొలువై వున్న తిరుమలలో వైభవంగా రిలీజ్ అయిన “కాప్” మూవీ ట్రైలర్ !!

ప్రముఖ నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తోన్న చిత్రం “కాప్”. శత్రుపురం, ‘మన్యం రాజు’ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొన్న దర్శకుడు బి. సోముసుందరం ఈ “కాప్” చిత్రానికి దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైర్స్ తో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం వుంటుంది.. అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సోము.. కాగా ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ఏప్రిల్ 12న తిరుపతి ఎస్ వి ఇంజినీరింగ్ కాలేజ్ లో వందలాదిమంది స్టూడెంట్స్ మధ్య వైభవంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనంతరం ఎస్వీ కాలేజ్ డైరక్టర్ డా. యన్. సుధాకర్ రెడ్డి స్వశ్రీ బ్యానర్ లోగోనీ ఆవిష్కరించారు.

**అనంతరం డా. యన్. సుధాకర్ రెడ్డి మట్లాడుతూ.. “* ఎస్వీ కాలేజ్ లోనే చదువుకొని జాబ్ చేస్తూ.. యుయస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సినిమా తీసే స్థాయికి ఎదిగాడు.. మాధవన్ సురేష్. టెక్నికల్ గానే కాకుండా బిజినెస్ సైడ్ కూడా మంచి పట్టు వున్న వ్యక్తి సురేష్. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన నితిన్ కూడా మన కాలేజ్ కుర్రాడే. అతను కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.. కానీ సరైన గుర్తింపు రాలేదు.. ఈ కాప్ సినిమా మంచి సక్సెస్ అయి నితిన్ కి మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను.. అలాగే దర్శకుడు సోముకి సినిమా అంటే పిచ్చి. మన తిరుపతి లో వున్న ఆర్టిస్టులకు ఛాన్స్ ఇస్తూ ఈ కాప్ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వుంది.. అన్నారు.

*చిత్ర దర్శకుడు సోముసుందరం మట్లాడుతూ.. “* శత్రుపురం, మన్యం రాజు, చిత్రాల తర్వాత నేను డైరక్ట్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. ముఖ్యంగా మా రాధా మేడం గారు లేకపోతే ఈ సినిమా లేదు. కథ విని ఎంతో ఇంప్రెస్ అయి మా నిర్మాత మాధవన్ సురేష్ గారు ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. మా టీమ్ అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేసి సినిమా బాగా రావడానికి సహకరించారు. ట్రైలర్ అందరికీ నచ్చుతుంది. సినిమా కూడా ప్రతి ఒక్కరికీ నచ్చేలా వుంటుంది.. ఈ సమ్మర్లోనే సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

**సమర్పకురాలు రాధా సురేష్ మాట్లాడుతూ.. “* మూడేళ్లుగా డైరక్టర్ సోముతో ట్రావెల్ అవుతున్నాను. సోము కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అప్పటినుండీ ఎవరూ ప్రొడ్యూస్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా మా అబ్బాయి మాధవన్ సురేష్ ఈ సినిమా నేను తీస్తాను అని ముందుకు వచ్చాడు.. అలా సినిమా స్టార్ట్ అయింది. సినిమా అంటే ఎంతో ప్యాషన్ వున్న వ్యక్తి సోము. చాలా కష్టపడి ఈ చిత్రం తెరకెక్కించాడు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది.. మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.. డెఫినెట్ గా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు సోము. మా “కాప్” సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు.

*చిత్ర నిర్మాత మాధవన్ సురేష్ మాట్లాడుతూ.. “* మా పేరెంట్స్ లేకపోతే నేను లేను.. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంతవాడ్ని చేశారు. నేను ఎస్వీ కాలేజ్ లోనే చదువుకున్నా.. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే.. మా అమ్మ ఈ కథ నాకు ఎక్స్ ప్లెయిన్ చేసింది. నేను చాలా ఎక్సైట్ అయి మనమే ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పాను. దర్శకుడు సోము చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసి ఈ చిత్రాన్ని ముప్పై రోజుల్లో పూర్తి చేశాడు. ట్రైలర్ అధ్భుతంగా వుంది. సినిమా కూడా అదే రేంజ్ లో వుంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఈ చిత్రం వుంటుంది.. అన్నారు.

*ఈ చిత్రంలో నటించిన హీరోలు నిఖిల్, రాజశేఖర్ మాట్లాడుతూ.. “* కాప్” చిత్రంలో మంచి క్యారెక్టర్స్ చేశాం.. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా డైరక్టర్ సోము గారు ఈ సినిమాని ఎక్స్ లెంట్ గా రూపొందించారు. ఈ సినిమాతో మా అందరికీ మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటులు కేజియఫ్ ఫేం హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, మ్యూజిక్ డెరైక్టర్ మిలన్ జోషి, ఫైట్ మాస్టర్ కుంగ్ ఫు సెంథిల్, కో- ప్రొడ్యూసర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

*రవిశంకర్, తేజ, నిఖిల్, రాజశేఖర్, కెజియఫ్ హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, సోనీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా; అల్లి కట్టి, మ్యూజిక్; మిలన్ జోషి, ఎడిటర్; వెంకటేష్, ఫైట్స్; కుంగ్ ఫు సెంథిల్, కొరియో గ్రాఫర్; పవన్ విక్కీ, పి.ఆర్.ఓ; జిల్లా సురేష్, కో-ప్రొడ్యూసర్; పుష్పలత, నిర్మాత; మాధవన్ సురేష్, కథ-మాటలు- పాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం; బి. సోమసుందరం.*
………………………………………

*Trailer of “CAP” movie released in The Holy Shrine Of Tirumala !!*

“CAP” is produced by Madhavan Suresh under Swasri Creations-Vayuputra Arts banners and presented by Mrs. Radha Suresh with Nikhil, Rajashekhar, and Teja in the lead role and veteran actor Ravi Shankar in a key role. Director BM Somusundaram, who proved his talent by directing the films ‘Shathrupuram’ and ‘Manyam Raju’ and gained good recognition among the audience, is directing this film. The film, which is being made as a commercial entertainer along with political satires, has a good message that will be useful to the society. SV College Director Dr. N Sudhakar Reddy unveiled Swashri’s banner logo after the lightening of the lamp ceremony.

*Dr. N Sudhakar Reddy said, “* Madhavan Suresh studied and worked in SV College. He went to US and grew up step by step to make a film today. Suresh is a person who has a good grasp not only technically but also on the business side. Also Nitin who acted in this movie is also our college boy. He got a good name by acting in some movies but he didn’t get proper recognition. I hope this CAP movie will be a good success and a good break for Nitin. Also director Somu is crazy about movies. He made this CAP movie by giving a chance to the artists in Tirupati. The Trailer is very good. I am confident that the movie will also be a big hit”.

*The director of the film BM Somusundaram said, “* This is the third film I am directing after Shathrupuram, Manyam Raju. I have done this film very hard. Especially without our Radha madam, this film would not have happened. After hearing the story, our producer Madhavan Suresh was very impressed to make this film. They came forward. My special thanks to him. All our team supported me so much and helped to make the film good. The trailer will be liked by everyone. The movie will also be liked by everyone. We are planning to release the movie this summer itself”.

*Presenter Radha Suresh said, “* I have been traveling with director Somu for three years. When Somu told me the story, I liked it very much. Since then, I was waiting to see if anyone would produce it. Finally, my son Madhavan Suresh came forward saying that I will make this film. That’s how the film started. Somu is a very passionate person. He made this film very hard. The output is very good. We are all very happy. Somu will definitely score a hat-trick with this film. I want the audience to support our “CAP” film and make it a big hit.”.

*Madhavan Suresh, the producer of the film said, “* If it wasn’t for my parents, I wouldn’t be here. They educated me and made me this much. Even though I studied in SV College, I learned a lot here. When it comes to the film, my mother explained this story to me. I was very excited and said let’s produce this film ourselves. Director Somu planned very properly and completed this film in thirty days. The trailer is amazing. The film is also in the same range. Surely everyone will like this film”.

Actors Nikhil, and Rajashekhar said they have done good characters in the movie and hoped that they will get a good break with this movie.

Actors KGF fame Harish Roy, Crane Manohar, Jayachandra, Music Director Milan Joshi, Fight Master Kung Fu Senthil, Co-Producer Pushpalatha and others participated in this event.

*Ravi Shankar, Nikhil, Rajasekhar, Teja, KGF Harish Roy, Crane Manohar, Jayachandra, Soni etc. are acting in this movie. Camera: Alli Katti, Music: Milan Joshi, Editor: Venkatesh, Fights: Kung Fu Senthil, Choreographer: Pawan Vicky, P.R.O.: Jilla Suresh, Co-Producer: Pushpalatha, Producer: Madhavan Suresh, Story-Dailaughs-songs- Screenplay- Direction: BM Somasundaram.*

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *