రంగమార్తాండ నుండి రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ “నన్ను నన్నుగా” విడుదల
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. మెగస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ నన్ను నన్నుగా విడుదలయ్యింది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ఈ సాంగ్ లో నర్తించారు. మాస్ట్రో ఇళయరాజా తనదైన శైలిలో సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. ‘రంగమార్తాండ’ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.