అందరికీ… పాప్‌కార్న్‌లో ప్రతి సీనూ నచ్చుతుంది: అవికా గోర్

అవికా గోర్‌ మనకు చిన్నారి పెళ్లికూతురుగా తెలుసు. ఉయ్యాలజంపాలా హీరోయిన్‌గానూ తెలుసు. పలు చిత్రాలు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న క్యారక్టర్స్ చేసిన అమ్మాయిగా తెలుసు. ఇప్పుడు పాప్‌కార్న్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించట‌మే కాకుండా ప్రొడ్యూసర్‌గానూ పరిచయమవుతున్నారు. అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ముర‌ళి గంధం ద‌ర్శ‌క‌త్వంలో భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న పాప్‌కార్న్ గురించి, అందులో నటన, నిర్మాణం గురించి చాలా విషయాలు పంచుకున్నారు అవికాగోర్‌. ఆ విశేషాలు మీకోసం…

* పాప్‌కార్న్ సినిమా ఎలా మొదలైంది?

– మా దర్శకుడు మురళి ఈ స్క్రిప్ట్ తో వచ్చారు. కాన్సెప్ట్ గురించి చెప్పారు. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. 90 శాతం లిఫ్ట్ లో జరిగే కథ ఇది. ఓ నటిగా నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. రెండు గంటలా 13 నిమిషాలు జనాలు… నన్నూ, హీరోని చూస్తూ కూర్చోవాలి. అది చాలా టఫ్‌. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కి మంచి కంటెంట్‌ కావాలి, లేకుంటే మాస్‌ మసాలా కావాలి. వాటి రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ఈ కథ చెప్పారు మురళి. నటిగా నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించిన విషయం కూడా అదే. నేనెప్పుడూ చాలెంజెస్‌ తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాను. నేను గతంలో చేసిన సినిమాల్లోనూ స్క్రిప్ట్ కి ప్రాధాన్యం ఉంటుంది. నా నటనకు స్కోప్‌ ఉంటుంది. అలాగే ఈ సినిమాలోనూ నాకూ, హీరోకీ ఎక్కువ డైలాగులున్నాయి. సీన్‌ని బిల్డ్ చేయడానికి కూడా సపోర్టింగ్‌ ఆర్టిస్టులు ఉండరు. కామెడీ అయినా, ఏడుపు అయినా మేమిద్దరమే చేయాలి. అంతగా అందరినీ మెప్పించాల్సిన అంశాలు ఉండటంతో ఈ సినిమా చేయడానికి నేను రెడీ అని చెప్పాను.

* కథ నచ్చి ప్రొడ్యూస్‌ చేశారా?

– కథ వినగానే, నా పరంగా ఎక్కువ టైమ్‌, అటెన్షన్‌ ఇవ్వాల్సిందేనన్న విషయం అర్థమైంది. నటిగా సెట్‌కి వెళ్లి చెప్పింది చేసి వచ్చేస్తాం. కానీ నిర్మాతగా అయితే, అన్నీ విషయాలనూ పట్టించుకుంటాం. సినిమా ఎలా రావాలి? ఎలా ప్రమోట్‌ చేయాలి? స్క్రిప్ట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ కావాలంటే ఇంకేం చేయొచ్చు… ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. నేను నిర్మాతని కావాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈ సినిమా కథ వినగానే, ఇదే పర్ఫెక్ట్ టైమ్‌ అనిపించింది. అందుకే ఫస్ట్ స్టెప్‌ వేశాను.

* కంటిన్యూ చేస్తారా? ప్రొడక్షన్‌ హౌస్‌ని..

– చేస్తానండీ. ఇప్పుడు రెండు సినిమాల పనులు జరుగుతున్నాయి. ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతోంది. ఇంకో సినిమా షూటింగ్‌ చేశాం.

* సాయిరోనక్‌ గురించి చెప్పండి?

– చాలా అమేజింగ్‌ పర్సన్‌. సెట్స్ మీద కలిసి పనిచేసేటప్పుడు మనకి ఎగ్జయిటింగ్‌గా అనిపించాలి. అంతలా హార్డ్ వర్క్ చేస్తారు సాయి రోనక్‌. చాలా హంబుల్‌ పర్సన్‌. చాలా ఎంథూసియాస్టిక్‌గా ఉంటారు. మేం ఇంతకు ముందు హ్యాష్‌ట్యాగ్‌ బ్రో సినిమా చేశాం. అప్పుడు అతని మీద నాకు చాలా మంచి ఇంప్రషన్‌ క్రియేటైంది. ఈ సినిమాకు కూడా అతన్ని నేనే సజెస్ట్ చేశా.

‘ ప్రొడక్షన్ చేస్తానంటే ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?

– నిర్మాతనవుతానని నేను చెప్పగానే, చేయగలవంటావా? అని అడిగారు నాన్న. ఎందుకంటే నేను సినిమాల్లోకి వస్తానంటే వాళ్లు నన్ను ఎప్పుడూ వద్దని చెప్పలేదు. అలాగని మాకు సినిమాల్లో బంధువులెవరూ లేరు. గాడ్‌ఫాదర్స్ లేరు ఇక్కడ. నేను టెక్నికల్‌గా ఔట్‌సైడర్‌ని. అందుకే ముందు ఆ డిస్కషన్‌ జరిగింది. కానీ, ఇది నా కల అని చెప్పగానే మా వాళ్లు సరేనన్నారు.

‘ స్క్రిప్ట్ లో ఏమైనా ఐడియాలు షేర్‌ చేసుకున్నారా?

– లేదు. డైరక్టర్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం. ఎందుకంటే, రైటర్‌గానీ, డైరక్టర్‌గానీ వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలను చాలా బాగా స్క్రీన్‌ మీద పెడతారని నమ్మా. నా ఉయ్యాల జంపాలలోగానీ, చిన్నారి పెళ్లికూతురులోగానీ, హ్యాష్‌ట్యాగ్‌ బ్రోలోగానీ జనాలకు నచ్చింది అదే. డైరక్టర్లు వాళ్ల మనసులో ఉన్న విషయాలను స్క్రీన్‌ మీద అందంగా చూపించగలిగారు. ఎందుకంటే అది రైటర్స్ జాబ్‌. నేనైతే కథాపరంగా ఏ సజెషన్సూ ఇవ్వలేదు. కానీ నా కేరక్టర్‌ ఎలా రియాక్ట్ అయితే బావుంటుందోననే విషయాల పట్ల నాకు అనిపించిన సజెషన్స్ కొన్నిసార్లు ఇచ్చినట్టు గుర్తు.

* ప్రొడక్షన్‌ చేయడం కష్టమనిపించిందా?

– జీవితంలో ఫలానా చేయాలనే గోల్‌ మన మనసులో మెదిలిందంటేనే, దాని అర్థం.. మనం చేయగలమనే. మనం కేపబుల్‌ కాకపోతే, మన మనసులోకి ఆలోచనలు రావు. ప్రొడక్షన్‌ చేయాలని ఓ అర్ధరాత్రి అనుకున్నది కాదు. 21 ఏళ్ల వయసు నుంచీ అనుకుంటున్నా. న్యూ యార్క్ అకాడమీకి వెళ్లి చదువుకున్నా, ఎడిటింగ్‌ కోర్సులు చేసినా, డైరక్షన్‌ కోర్సులు చేసినా, దాని అర్థం ఏంటంటే నేను సినిమాను అంతగా ప్రేమిస్తున్నానో అని. నటిగా మాత్రమే కొనసాగకుండా, సినిమాల్లో ఇంకా చాలా చేయాలని అనుకున్నా. ప్రొడక్షన్‌ చేయడం కూడా అందులో భాగమే. భవిష్యత్తులో నేను డైరక్షన్‌ కూడా చేస్తానేమో.

* సినిమా చూశాక ఇండస్ట్రీ వ్యక్తులు ఏమన్నారు?

– నాగార్జున, చైతన్య, నిఖిల్‌.. వీళ్లందరూ చాలా ఆనందంగా ఫీలయ్యారు. పోస్టర్‌ చూసినప్పుడు, నేను వాళ్లతో ఈ విషయం చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకంటే ఈ వయసులో నేను ఫక్తు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ హ్యాపీగా డబ్బులు పోగేసుకోవచ్చు. కానీ, నేను ప్యాషన్‌తో చేస్తున్నాననే విషయం వాళ్లకు అర్థమైంది. జనాలు నన్ను కేవలం మాస్‌ సినిమాల్లో నటిగా చూడదలచుకోవడం లేదు. అంతకు మించి కోరుకుంటున్నారు. అందుకే నేను కూడా ఇష్టపడి చేయగలుగుతున్నా. ఎక్కడికిపోతావు చిన్నవాడాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అయినా నా పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి నేను చేశా. నా ముందుకు పది సినిమాలు బాగా డబ్బులొచ్చేవి వచ్చాయనుకుందాం. మరోవైపు ఒక సినిమా చాలా బాగా నటించడానికి స్కోప్‌ ఉన్నది వచ్చిందనుకుందాం. అప్పుడు నేను తీసుకునే ఛాయిస్‌ మీద నా కెరీర్‌గ్రాఫ్‌ ఆధారపడి ఉంటుంది. నేను నటిగా సెటిల్‌ కావాలనుకున్నా.

* భారీ సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తారా?

– ఎందుకు చేయకూడదు. చేస్తాను. కానీ ప్రస్తుతం నా ఫోకస్‌ పాప్‌కార్న్ మీదే ఉంది. ఇప్పుడు హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నా. మిగిలిన విషయాల గురించి ఇప్పుడప్పుడే చెప్పడానికి ఏమీ లేదు.

* ఈ సినిమా కథగా విన్నప్పుడు ఏమనిపించింది?

– చాలా భయమేసింది. ఎందుకంటే 90 శాతం సినిమా ఒకే చోట జరుగుతుంది. అదీ ఇద్దరి మధ్య. ఆడియన్స్ కి బోర్‌ కొట్టే ఛాన్స్ ఉంది. నేను ఓటీటీల్లో సినిమాలు చూస్తాను. థియేటర్లలో చూస్తాను. పాటలు వింటాను. అలాంటి నాకు ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు స్టార్టింగ్‌ కాస్త నమ్మడానికి టైమ్‌ పట్టింది. లిఫ్ట్ లో మూడు పాటలు ఎలా ఉంటాయి? డ్యాన్సులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ నమ్మడానికి నాకు ఇందులో రీజన్‌ కనిపించింది. అన్నిటికీ స్ట్రాంగ్‌ రీజన్‌ ఉండటంతో నేను కూడా నమ్మాను. సినిమా చేశాను.

* ఎప్పుడైనా లిఫ్టులో స్ట్రక్‌ అయ్యారా?

– లేదండీ. అసలు ఎందుకు కావాలి? ఒకవేళ ఎప్పుడైనా లిఫ్టులో నేను స్ట్రక్‌ అయితే, నా పక్కన సాయిరోనక్‌ ఉండాలి. ఎందుకంటే, నన్ను ఎలా బయటకు తీసుకురావాలో అతనికే తెలుసు కాబట్టి.

* లిఫ్టు సెట్టు వేశారా?

– అవునండీ. నాలుగు గోడలతో సెట్‌ వేశాం. నేను ఇంతకు ముందు చాలా సినిమాలు చేశాను. కిడ్నాప్‌ సీన్స్ ఎలా తీస్తారో తెలుసు. మిగిలిన సీన్లు ఎలా తీస్తారో తెలుసు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అవేమీ ఊహించలేకపోయాను. ఏది ఎలా జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ప్రతిరోజూ కొత్తగా అనిపించేది. సెట్లోకి వచ్చిన తర్వాత నాకు సీన్‌ చెప్పేవారు. ఆ ప్రాసెస్‌ నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించేది. చాలా ఎంజాయ్‌ చేసి చేశాను. అది నా పెర్ఫార్మెన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. నేను, సాయిరోనక్‌ కూడా ఈ విషయాన్నే అనుకున్నాం. ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మేమిద్దరం చాలా ఎంజాయ్‌ చేసి చేశాం. సెట్లో మంచి ర్యాపో ఉన్న వాళ్లతో చేస్తే పాజిటివ్‌గా అనిపిస్తుంది. నేను ప్రతిరోజూ తెల్లారుజామున ఐదు గంటలకే సెట్లో ఉండేదాన్ని. సాయిరోనక్‌ కూడా నాతో పాటు సెట్లో ఉండేవారు.

* పెద్ద సినిమాలు చేయలేదని ఎప్పుడైనా అనిపించిందా?

– అలాగనేం లేదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు మొదటి నుంచీ మంచి స్క్రిప్టులు చేయాలనే అనుకున్నా. అదే చేశాను. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత నేను వాంటెడ్‌గా బ్రేక్‌ తీసుకున్నా. ఆ గ్యాప్‌లోనూ నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ టైమ్‌లో వెయిట్‌లాస్‌ అయ్యాను. నన్ను నేను గ్రూమ్‌ చేసుకున్నాను. అప్పటిదాకా చేసిన సినిమాలతో పోలిస్తే, భవిష్యత్తులో ఇంకా చాలా సినిమాలు చేయాలనుకున్నా. ఆ గ్యాప్‌ వల్ల నేను గ్రో అయ్యాను. నాకంటూ ఓ రెప్యుటేషన్‌ ఉంది. మంచి కేరక్టర్లు చేస్తాననే పేరుంది. కొత్తవాళ్లతో పనిచేయడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటాను. డే ఒన్‌ నుంచి ఇప్పటికీ నన్ను ప్రేక్షకులు అంతే ప్రేమతో ఆదరిస్తున్నారు. నాకు అవార్డులు వస్తుంటాయి. కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా నన్ను జనాలు ఆదరిస్తున్న తీరు చూసి ఫిదా అయిపోతాను.

* పాప్‌కార్న్ ని ఓటీటీలో రిలీజ్‌ చేయమని సలహాలు వచ్చాయా?

– వచ్చాయి. యంగ్‌స్టర్స్ ఫోనుల్లో చూసేస్తారని అన్నారు. అయితే ఈ సినిమాను ఎక్కడా ఫార్వర్డ్ కొట్టకుండా చూడాలి. థియేటర్లలో అయితే ప్రతిదీ అర్థం చేసుకుని చూస్తారు. ఆ నమ్మకంతోనే మేం థియేటర్లలో విడుదల చేశాం. గట్‌ఫీలింగ్‌తో విడుదల చేశాం.

* నాగార్జునగారు ట్రైలర్‌ లాంచ్‌కి వచ్చినప్పుడు, మీరు భావోద్వేగానికి గురయ్యారు…

– నేను చిన్నప్పటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఉన్నా. సోషల్‌ మీడియా పుణ్యమా అని అందరికీ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నా గురించి అందరికీ అన్నీ తెలుసు. ఈ సినిమా గురించి కూడా తెలుసు. ఇలా ట్రైలర్‌ లాంచ్‌ పెట్టుకున్నానని నేను రెండు రోజుల ముందు నాగార్జున సార్‌కి ఫోన్‌ చేయగానే, నా మాట పూర్తికాకముందే, నేను వస్తున్నానని ఆయన అన్నారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అలాంటి సపోర్ట్ అందినప్పుడు భావోద్వేగానికి గురవడం కామనే. ఆ ఫ్యామిలీ నన్ను సొంత బిడ్డగా చూసుకుంది. చైతన్య ఓ పాటను విడుదల చేశారు. తెలుగు హీరోలు చాలా మంది నాకు సపోర్ట్ చేశారు.

* తెలుగులోకి వచ్చి పదేళ్లవుతోంది. మీరు హ్యాపీయేనా?

– చాలా హ్యాపీ. చాలా మంచి పాత్రలు చేశా. థాంక్యూలో నేను చైకి రాఖీ కట్టాను. చాలా మంచి కేరక్టర్‌ అది. హ్యాష్‌ట్యాగ్‌ బ్రో వల్ల మనిషిగా నాలో చాలా మార్పులొచ్చాయి. ఏ పాత్ర చేసినా దాని వల్ల మనలో మార్పు చూసుకుంటాం. నేను అలా మంచి విషయాలను అర్థం చేసుకుని, నన్ను నేను మలచుకుంటాను.

* ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ ఏంటి?

– తెలుగు సినిమాలు కొన్ని చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్ మెంట్లు వస్తాయి. హిందీలో మహేష్‌భట్‌, విక్రమ్‌భట్‌ సినిమా 1920లో చేస్తున్నా. మేలో ఆ సినిమా విడుదలవుతుంది.

* చిన్న ఇండస్ట్రీలు గ్లోరిఫై అవుతున్నాయి. మీరు గుజరాతీ కాబట్టి అక్కడ సినిమాలు చేస్తారా?

– తెలుగు ఇండస్ట్రీలో పదేళ్లు నటిగా చేశాక, ఇక్కడ సినిమా నిర్మించా. గుజరాతీ మార్కెట్‌ నాకు తెలియదు కాబట్టి ఇప్పుడప్పుడే చేస్తానని అనుకోవట్లేదు. నటిగా అవకాశాలు వస్తే చేస్తా. నాకు గుజరాతీ అంతగా మాట్లాడటానికి రాదు. మా ఇంట్లో కచ్చీ మాట్లాడుకుంటాం. గుజరాతీని మేనేజ్‌ చేయగలను.

అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు అవికా గోర్‌.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *