ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ రిలీజ్
బ్లాక్ ఏంట్ పిక్చర్స్, శ్రీనాథ కథలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రణవ్ సింగంపల్లి`షగ్న శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో భువన్ రెడ్డి కొవ్వూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆన్లైన్లో విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో బుల్లితెర, వెండితెర హీరో సాగర్ చేతుల మీదుగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ…
ఈ సినిమా గ్లింప్స్ చూస్తుంటే ఒక ఫీల్‌గుడ్ మూవీలా అనిపిస్తోంది. మా మధు అన్న గారి అబ్బాయి ప్రణవ్‌కి ఈ సినిమా మంచి లాంఛింగ్ ప్రాజెక్ట్ అవ్వాలిని కోరుకుంటున్నా. దర్శకుడు శ్రీనాథ్ నాకు చాలా మంచి మిత్రుడు. మేం కలిసి ఓ ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకున్నాం, కొన్ని ఆనవార్య కారణాల వల్లా చెయ్యలేకపోయ్యము. ఈ సినిమా మంచి విజయం సాధించాలని యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా అన్నారు.
సీనియర్ నటులు మధు సింగంపల్లి మాట్లాడుతూ…
మా అబ్బాయి ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. మా తమ్ముడు సాగర్ చేతుల మీదుగా ఈ ఫస్ట్‌లుక్, రిలీజ్ కావడం చాలా హ్యాపీ. మా అబ్బాయితో పాటు యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
సంగీత దర్శకుడు కార్తిక్ మాట్లాడుతూ…
ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. మంచి పాటలకు స్కోప్ ఉన్న సినిమా. పాటల విషయంలో దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందర్నీ ఆకట్టుకునే ట్యూన్స్ ఉంటాయి ఈ సినిమాలో అన్నారు.
హీరోయిన్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంది ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ నన్ను సెలక్ట్ చేసుకోవడం నా అదృష్టం. డైరెక్టర్ శ్రీనాథ్ గారు మా నుంచి చాలా ఓపిగా నటన రాబట్టుకున్నారు. ఈ సినిమా చిత్తూరు జిల్లా బ్యాకడ్రాప్‌లో ఉండటం వల్ల ఆ స్లాంగ్ పలికే విషయంలో దర్శకుడు శ్రీనాథ్ గారు చాలా కేర్ తీసుకున్నారు. ప్రణవ్ మంచి నటుడు. అతని కోఆపరేషన్ మరువలేనిది. నిర్మాత భువన్‌రెడ్డి గారు ఎంతో ప్యాషన్‌తో సినిమాను నిర్మించారు. అందరినీ ఆకట్టుకుంటుందని గట్టిగా నమ్ముతున్నాను అన్నారు.
హీరో ప్రణవ్ మాట్లాడుతూ…
చాయ్ బిస్కెట్ టీమ్ తో నేను చేసిన యూట్యూబ్ వీడియోస్ చూసి నాకు ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు. హీరోగా నా లాంఛింగ్ ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాతో కావడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నచ్చేలా కథ ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకులు తమ కాలేజ్ డేస్‌కు వెళ్లిపోతారు. నాకు సహకరించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కు ధన్యవాదాలు అన్నారు.
నిర్మాత భువన్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ…
మా సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసిన మంత్రి మల్లారెడ్డి గారికి, ఫస్ట్ లుక్ రిలీస్ చేసిన హీరో సాగర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కథ, సినిమాను ఎంతగానో ప్రేమించి పనిచేశారు. అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది. దర్శకులు శ్రీనాథ్గారితో నా జర్నీ ‘కృష్ణా రావ్ సూపర్‌మార్కెట్’ అనే సినిమాతో ప్రారంభం అయ్యింది. మంచి ప్యాషన్ ఉన్న దర్శకుడు శ్రీనాథ్. నేను అనుకున్న దానికన్నా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. మా కో`డైరెక్టర్ వంశీ కూడా ఈ సినిమా ఇంత అద్భతంగా రావడానికి దర్శకుడితో కలిసి కష్టపడ్డారు. అలాగే డిఓపి నిఖిల్ సురేంద్రన్ మా సినిమాకు మంచి విసుయల్స్ ఇచ్చారు, ఓవరాల్‌గా ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ.. అందరినీ కదిలించే కథ అన్నారు.
దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ…
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో సాగర్ గారికి థ్యాంక్స్. ఇది రాయల సీమాలోని పుంగనూరు అని గ్రామం బాక్ డ్రాప్ గా చేసుకొని జరిగే ఇంటర్మీడియట్ టీనేజెర్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నారు. సినిమా విషయంలో కో`డైరెక్టర్ వంశీ నాకు ఎంతో సాయపడ్డాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కార్తిక్ తన అద్భుతమైన ట్యూన్స్ అందించాడు. మా నిర్మాత భువన్రెడ్డిగారు ఖర్చును చూడకు క్వాలిటీని, కంటెంట్‌ను నమ్ము అంతే అన్నారు. నేను ముందుగా ఆయనకు చెప్పిన బడ్జెట్ కంటే 5 రెట్లు ఎక్కువ అయినా కూడా ఆయన వెనకడుగు వేయలేదు అందుకే ఈరోజు మా సినిమా ని ఇంత క్వాలిటి గా తీయగలిగాము. ప్రణవ్‌పై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఈ చిత్రంలోని వాసు క్యారెక్టర్‌కు టైలర్‌మేడ్‌లా సరిపోయాడు. అలాగే హీరోయిన్ కూడా తన క్యారెక్టర్ కి న్యాయం చేసింది .. ప్రబుత్వ జూనియర్ కళాశాల అందరినీ అలరించే సినిమా అవుతుంది అన్నారు.
ఈ చిత్రానికి పాటలు: శ్రీ సాయికిరణ్, ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్యెజ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమరన్, డీఓపీ: నిఖిల్ సురేంద్రన్, సౌండ్ డిజైన్: జె.ఆర్. యతిరాజ్, ఆడియోగ్రఫీ:షామల్ సిక్దర్, కలరిస్ట్: రాజ శ్రీనివాస్ మామిడి, సింగర్స్: మంగ్లీ, చిన్మయ్ శ్రీపాద, విజయ్ ఏసుదాస్, పీఆర్వో: సురేష్ కొండేటి, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం.