కాంతారా రేంజ్ లో నరకాసుర టీజర్ .. సినిమాటోగ్రాఫర్ సెంథిల్
సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నరకాసుర. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ విడుదల అయింది.సెబాస్టియన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఈ శనివారం నరకాసుర టీజర్ లాంచ్ జరిగింది.
ఈ సందర్బంగా కోరియోగ్రాఫేర్ విజయ్ యాక్షన్ డైరెక్టర్ రాబిన్ సుబ్బు మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. రక్షిత్ గారితో పలాస మూవీ చేశాను. ఆ మూవీ లాగానే ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందనుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సెబాస్టియన్ గారికి థాంక్స్.. అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ గారు మాట్లాడుతూ .. మా టీజర్ లాంచింగ్ కు విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు. ఈ సినిమాలోని ఆర్టిస్టులంతా అద్భుతంగా చేసారు. సెబాస్టియన్ గారు బాగా డైరెక్ట్ చేసారు. డీవోపీ నాని గారి వర్క్ చాల బావుంది. మేకింగ్ టైం లో అందరు చాల కష్టపడ్డారు. ఈ మూవీలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. అన్నారు.
హీరో రక్షిత్ తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్. అందరు ఎన్నో కథలు విని ఉంటారు. అలాగే ఏకలవ్యుడి కథ కూడా. ఈ సినిమా తర్వాత మీరంతా సెబాస్టియన్ అనే ఏకలవ్యుడు గురించి మాట్లాడుకుంటారు. అది ఎందుకో సినిమా చూసాక మీకె తెలుస్తుంది.. అన్నారు.
హీరోయిన్ సంగీర్తన మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇందులో నా పాత్ర చాల పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మూవీ చేస్తోన్న టైం లో అందరు నాకు సపోర్ట్ చేసారు. వారందరికీ థాంక్స్.. అన్నారు.
మరో హీరోయిన్ అపర్ణ మాట్లాడుతూ .. నేను కేరళ నుంచి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెబాస్టియన్ సర్ కు చాల థాంక్స్. ఆయనే నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ నేను హండ్రెడ్ పర్సంట్ హిట్ అవుతుందని చెప్పగలను. నాకు టీం నుంచి మంచి సపోర్ట్ దొరికింది. అలాగే సీనియర్ యాక్టర్స్ అయిన చరణ్ రాజ్ సర్, శ్రీమాన్ సర్, నాజర్ సర్ లాంటి వారితో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు.
నటుడు చరణ్ రాజ్ మాట్లాడుతూ .. మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వంగా ఉంది. వైవిఎస్ చౌదరి నా అభిమాన దర్శకుడు. వారిని ఇక్కడ కలవడం సంతోషంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ సెబాస్టియన్ ను నమ్మి నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఏ సినిమాకు అయిన దర్శకుడే ఫైనల్. ఆయనకి సపోర్ట్ గా ఉండేది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. ఈ మూవీ కోసం అందరం చాల కష్టపడ్డాం. డిఫరెంట్ వెదర్స్ లో పని చేసాం. రక్షిత్ కు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇస్తుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో అద్భుతంగా నటించాడు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. నేను ఈ చిత్రం లో భాగం కావాలనే వెంటనే ఒపుకున్నాం. దర్శకుడికి ఒక సమస్య ఉన్నా.. దాన్ని దాటి మరీ గొప్పగా చేసారు. ఈ సినిమా అందరికి మంచి పేరు తెస్తుంది. తెలుగు సినిమాకు ఒక మైల్ స్టోన్ అవుతుంది అని చెప్పగలను.. అన్నారు .
నటుడు శ్రీమాన్ మాట్లాడుతూ .. ఈ వేదికపై ఉండటం చాల సంతోషంగా ఉంది. నేను ఎన్ని భాషలు మాట్లాడినా తెలుగు నా మాతృ భాష. ముందుగా ముఖ్య అతిథులుగా వచ్చిన ముగ్గురికీ థాంక్స్ చెబుతున్నాను. ఏ సినిమాకు అయిన నిర్మాతే ఫైనల్. చాల ఏళ్ళ తర్వాత తెలుగులో చేసే అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. డైరెక్టర్ కొత్త వాడైనా తాను అనుకున్నది వచ్చే వరకు ఎవరినీ వదల్లేదు. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా గొప్పగా డైరెక్ట్ చేసారు. తెలుగులో ఇతను పెద్ద దర్శకుడు అవుతాడు. మీ అందరికీ ఈ మూవీ ఫుల్ మీల్స్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది.. అంటూ ముగించారు.
దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ .. ఈ వైదికపై మీ అందరి ప్రెజన్స్ నాకు ఏంటో బలాన్ని ఇస్తోంది. సినిమా జరుగుతున్నప్పు ఇంత గొప్ప అవుట్ ఫుట్ వస్తుందని నేను ఎప్పుడు నమ్మలేదు. దీని కోసం ఏంటో బాధను భరించాము. త్యాగాలు చేసాం. బట్ ఈ రియాక్షన్ చూసాక అంటా మర్చిపోయాను. నేను జబల్ పూర్ లో సెటిల్ అయ్యాను స్క్రిప్ట్ కూడా అక్కడే రాసుకున్నాను. అక్కడే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేసాం. నేను స్క్రిప్ట్ రాసుకున్నదంతా తీసే ప్రయత్నం చేశాను. మాక్సిమం నేను అనుకున్న ఫలితం వచ్చింది. ఈ జర్నీ మొత్తం లో ఆర్టిస్టుల సపోర్ట్ మరువలేను. హీరో రక్షిత్ సపోర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చాల టఫ్ గా ఉన్నా వాతావరణం లో పని చేసాడు. స్క్రిప్ట్ కు తగ్గట్టుగా రకరకాలుగా కనిపించేందు రెండున్నరేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు. ఖచ్చింతంగా ఈ మూవీ తో సక్సెస్ అందుకుంటాం. ఈ సందర్బంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ మరోసకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. అన్నారు .
హీరో రక్షిత్ మాట్లాడుతూ .. ఒక టీజర్ ఇంపాక్ట్ ఏంటో పలాస టైం లో చూసాను. ఆ మూవీ తర్వాత గాప్ రావడం తో అందరూ హేళనగా మాట్లాడారు. బట్ ఈ టీజర్ వారికీ సమధానం చెబుతుంది. ఈ మూవీ కోసం రెండేళ్ల పాటు హీరోయిన్స్ కూడా కష్టపడ్డారు. ఇంతమంది సీనియర్ యాక్టర్స్ తో పని చేసే అవకాశం కల్పించిన దర్శకుడికి థాంక్స్ చెబుతున్నాను. మా డీవోపీ నాని గారు అద్భుతంగా చూపించారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం,. త్వరలోనే మరో పాటతో రాబోతున్నాం.. అన్నారు.
ముఖ్య అతిథి వైవి ఎస్ చౌదరి మాట్లాడుతూ.. నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా రక్షిత్ పరిచయం అయ్యాడు.అతన్ని కలిసినప్పుడు అతని కళ్ళు చాల బావున్నాయి అనిపించింది. యంగ్ డేస్ జగపతి బాబు లా ఉన్నాడు అనిపించింది. బట్ ఫస్ట్ మూవీకి మా కాంబినేషన్ కుదర్లేదు. రక్షిత్ రెండో సినిమా పలాస తోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇతనికి సినిమా పై మంచి పట్టు ఉంది. తన సినిమాల గురించి బాగా చెబుతాడు. వీరికి సినిమా అంటే చాల తపన ఉంది. ఈ తపన అతన్ని మంచి రేంజ్ కి తీసుకువెళ్తుందనుకుంటున్నాను. టీజర్ రిలీజ్ చేస్తున్నపుడు బావుండాలి ని కోరుకున్నాను. బట్ చూసిన తర్వాత అద్భుతం అనిపించింది. ఈ సినిమా కథ ఏంటో బాగా తెలియదు. బట్ ఉదయం ఆటకే వెళ్లాలని ఆశగా ఉంది.. అన్నారు .
అతిథి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ .. టీజర్ బావుంది. నేను పర్సనల్ గా సినిమాటోగ్రాఫర్ అయినందుకు ముఖ్యంగా తెలుగు సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా అని చూపొచ్చు. బాహుబలినుంచి మొదలై ఇప్పుడు పాన్ ఇండియా ను కూడా దాటాం. నేను కూడా ఐతే అనే చిన్న సినిమాతోనే సినిమాటోగ్రాఫర్ గా ప్రయాణం మొదలుపెట్టాను. ఈ మూవీ టీజర్ చూన తర్వాత కాంతారా రేంజ్ లో కనిపిస్తోంది. ఇప్పుడు కల్చరల్ బేస్ ఉన్నకథలకు మంచి ఆదరణ ఉంది. ఎవరినో మెప్పించాలి అని కాకుండా స్క్రిప్ట్ కు తగ్గట్టుగా పాత్రలూ, లొకేషన్స్ కరెక్ట్ గా ఎంచుకుని చేయాలి. ఈ మూవీ పెద్ద విజ్జయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
మరో గెస్ట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చినందుకు చాల హ్యాపీగా ఉంది. మా ఫాదర్ అలాగే ప్రొడ్యూసర్ ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాంకి నన్ను పిలవడమే కాదు వచ్చేవరకు రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకున్నాడు. ఈ మూవీ టీజర్ చాల బావుంది. వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను.సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ టీం మొత్తానికి అల్ ది బెస్ట్.. అని చెప్పారు.
తెలుగులతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో తారాగణం
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్
నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ (సెబి. జూనియర్)
ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా
యాక్షన్ : రోబిన్ సుబ్బు
పిఆర్ఓ : జిఎస్కే మీడియా.