సెప్టెంబర్‌ రెండో వారంలో గ్రాండ్‌గా రాబోతున్న ‘నరకాసుర’

రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్‌లో ఉందని’ ప్రశంసించారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో    తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్‌ రెండో వారంలో  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు.

నటీనటులు:
నాజర్‌, చరణ్‌రాజ్‌, శ్రీమాన్‌, ఎస్‌ఎస్‌ కాంచీ, గాయత్రి రవిశంకర్‌, తేజ్‌ చరణ్‌రాజ్‌, కార్తిక్‌ సాహస్‌, రాజారావు, ఫిష్‌ వెంకట్‌, మస్త్‌ అలీ, భానుతేజ, లక్ష్మణ్‌, రాము, దేవంగన, పింటు శర్మ, ప్రమోద్‌, చతుర్వేది తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ – మాటలు– స్ర్కీన్‌ప్లే– దర్వకత్వం: సెబాస్టియన్‌
నిర్మాతలు: డా. అజ్జా శ్రీనివాస్‌, కారుమూరు రఘు
కెమెరా: నాని చామిడిశెట్టి
సంగీతం: ఎఐఎస్‌ నవ్‌ఫాల్‌ రాజా.
ఎడిటర్‌: సి.హెచ్‌ వంశీకృష్ణ,
మేకప్‌– ప్రోస్తటిక్‌: రషీద్‌ అహ్మద్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పూజితా తాడికొండ
ఆర్ట్‌:, సుమిత్‌ పాటిల్‌, కొప్పినీడి నాగవ్‌ తేజ్‌
కొరియోగ్రఫీ: పోలకి విజయ్‌
యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు
సౌండ్‌ ఇజైనింగ్‌ కృష్ణసుబ్రమణియన్‌
పీఆర్‌ఓ: మధు విఆర్‌

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *