పదవీ బాధ్యతలను చేపట్టిన దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

ఈనెల 11న జరిగిన తెలుగు చలనచిత్ర దర్శకుల ఎన్నికలలో వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసినదే. కాగా ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు 16, రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని, మా సభ్యులు మాకిచ్చిన అతికొద్ది కాలంలోనే మా సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని మీడియాకు తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయిరాజేష్, వశిష్టలతో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి రామారావు, సంయుక్త కార్యదర్శులు వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, సీనియర్ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ క్రిష్ణమోహన్, కూరపాటి రామారావు,ఆకాష్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ పాల్గొన్నారు.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *