మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో “ఫోక‌స్ ” మూవీ రివ్యూ…

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్నచిత్రం `ఫోక‌స్`. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నఈ చిత్రానికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు, వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మాత‌. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. అక్టోబ‌రు 28న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం

కథ
వివేక్‌ వర్మ(భాను చందర్‌)ఎస్పీగా, ,ప్రమోదా దేవి(సుహాసిని ) జడ్జ్ గా పనిచేస్తుంటారు. భార్యా భర్తలుగా వీరిద్దరి కాపురం హ్యాపీ గా సాగిపోతున్న తరుణంలో ఒకరోజు రాత్రి అనూహ్యంగా ఎస్పీ వివేక్‌ వర్మ హత్యకు గురవుతాడు. అయితే డీసీపీ(జీవా) సీపీ( షియాజీ షిండే) లు వివేక్ హత్య కేసును ఇన్వెస్టిగేషన్‌ చేయమని ఎస్‌ఐ విజయ్‌ శంకర్‌ (హీరో)కి అప్పగిస్తారు.ఈ హత్య చేసింది ఎవరని ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న సమయంలో ఎస్పీ వివేక్ వర్మ ను చంపింది నేనే అంటూ నటుడు సూర్యభగవాన్‌ పోలీసులకు లొంగిపోతాడు, దీంతో కేస్‌ క్లోజ్‌ అయ్యిందనుకున్న టైమ్ లో వివేక్‌ వర్మ దగ్గర పనిచేసే పని మనిషే డబ్బు కోసం హత్య చేసినట్టు తెలుస్తుంది.దాంతో వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వీరికి వివేక్ వర్మ పోస్ట్ మార్టమ్‌ రిపోర్ట్ వస్తుంది. దాంట్లో వివేక్ వర్మ గారు విషం తీసుకున్నట్టు రిపోర్ట్ రావడంతో అందరూ షాక్ అవుతారు .అయితే వివేక్‌ వర్మ ఎలా చనిపోయాడు? ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది? హత్య చేయకున్నా హత్య చేశానని సూర్యభగవాన్‌ పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు? ఎస్పీ వివేక్‌ వర్మ కు,సూర్యభగవాన్‌ కు, ఎస్పీ భార్య జడ్జ్(సుహాసిని)కి లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ట్విస్టు,టర్న్ లతో సాగుతున్న ఈ మర్డర్‌ మిస్టరీ కేస్ ను ఎస్‌ఐ విజయ్‌ శంకర్‌ ఇన్వెస్టిగేషన్ చేసి సక్సెస్ సాధించడా లేదా? అనేది తెలుసుకోవాలంటే `ఫోక‌స్` సినిమా చూడాల్సిందే.. నటీ నటుల పనితీరు
యస్. ఐ పాత్రలో హీరో విజయ్‌ శంకర్‌ నేచురల్ గా తన క్యారెక్టర్ కు కావాల్సిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో .ఎన్నో సినిమాలు చేసిన నటుడులా చాలా చక్కగా నటించాడు.
ఎస్పీ పాత్రలో నటించిన భానుచందర్‌, జడ్జ్ పాత్రలో నటించిన సుహాసిని, పోలీస్‌ ఆఫీసర్లుగా జీవా, షియాజీ షిండేల, హత్యకేసులో నింధితుడిగా ఉన్న సూర్యభగవాన్‌ లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఆషురెడ్డి పోలీస్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌ పాత్రలో చాలా చక్కటి నటనను కనబరచింది. హీరోకి సహాయకుడిగా భరత్‌ రెడ్డి ఇలా ఈ సినిమాలో నటించిన వారందరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఎంచుకుని ఎన్నో ఎన్నో ట్విస్ట్, టర్న్ కలిగిన మర్డర్‌ మిస్టరీ వంటి టిఫికల్ సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ చిత్రాన్ని దర్శకుడు జి. సూర్యతేజ అద్భుతంగా తెరకెక్కించాడు.సంగీత దర్శకుడు వినోద్‌ యజమాన్య మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ ఆర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ జే. ప్రభాకర్‌ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. ఛేజింగ్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. సత్య. జీ ఎడిటింగ్ పనితీరు బాగుంది. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన ఒక కొత్త త‌ర‌హా క్రైమ్ థిల్ల‌ర్. కథను నిర్మాత వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మర్డర్‌ మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడే వారికి “ఫోకస్” సినిమా కచ్చితంగా నచ్చుతుంది చెప్పొచ్చు.

మా మూవీ రేటింగ్ : 3 .25 / 5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *