“మసూద” మూవీ రివ్యూ !!
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్ నటీ నటులు : సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్,
శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు
కళ: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
పిఆర్‌ఓ: బి.వీరబాబు
‘‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం భయపెట్టి ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి
కథ
నీలమ్ (సంగీత), నజియా (భాందవి) తల్లీ కూతుళ్లు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వీరి దగ్గర డబ్బు లేకపోయినా చాలా సంతోషంగా ఉంటారు. అదే అపార్ట్మెంట్ లో ఉండే గోపీ (తిరువీర్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతి భయస్తుడు.నీలమ్ ఫ్యామిలీతో గోపీకి చక్కటి అనుబంధం ఉంటుంది.ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయపడే మంచి మనస్తత్వం అతడిది. అందరూ హ్యాపీ గా ఉన్న తరుణంలో నజియా ప్రవర్తనలో మార్పు వస్తుంది. దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంటుంది. దాంతో సంగీత గోపి సహాయం కోరుతుంది. అయితే, గోపి ఓ భయస్తుడు,.సంగీతకు సహాయం చేయటానికి వెనుకడుగు వేసినా ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు..అయితే ఈ క్రమంలో వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. అయితే నజియాను ఎక్కడ చూయించినా భాగవ్వకాపోగా ఇంకా తను ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుంది.నజియా ఇలా మారడానికి కారణమేంటి అనుకున్న నేపథ్యంలోనే ‘మసూద’ అనే అమ్మాయి గురించి వారికి తెలుస్తుంది. ఎవరా మసూద? మసూదకు నజియాకు ఉన్న సంబంధం ఏంటి ? నజియాను ఆవహించిన మసూద ఎవరు?మసూద బారినుంచి నజియా ఎలా బయట పడింది ? అనేది తెలుసుకోవాలంటే “మసూద” సినిమా కచ్చితంగా చూడాల్సిందే
నటీ నటుల పనితీరు
తన కూతురిని బతికించుకోవడానికి పోరాడే తల్లిగా సంగీత నటన ఆకట్టుకుంటుంది. బలమైన భావోద్వేగాలతో కూడిన పాత్రలో ఒదిగిపోయింది. తీరువీర్ రియలిస్టిక్ యాక్టింగ్ కనబరిచాడు. కావ్య కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా మెప్పించింది. దెయ్యం పట్టిన అమ్మాయిగా భాందవి చక్కటి నటనతో మెప్పించింది. ఇంకా ఇందులో నటించిన సుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, అఖిలా రామ్ తదితర నటీనటులు వారి పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
తల్లి,కూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ తెరకెక్కిన “మసూద” సినిమా హర్రర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టేస్తోంది. నజియాను ఆవహించిన ఆత్మ ఎవరో తెలుసుకోవడానికి నీలమ్ గోపి కలిసి చేసిన పరిశోధనలో ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ సినిమా చూస్తున్నంత వరకు.. తర్వాత ఏం జరుగుతుందా అని అనిపిస్తూ అడుగడుగునా ఆసక్తికరంగా ఉండేలా దర్శకుడు సాయి కిరణ్ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు.”మసూద” ఫ్లాష్‌బ్యాక్ డిఫరెంట్‌గా ఉంది. పల్లెటూళ్లలో కనిపించే క్షుద్రపూజల పాయింట్‌ను జోడిస్తూ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌పై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు.ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ మసూద సినిమాకు హైలెట్ గా నిలిచింది.సౌండ్, విజువల్స్ అద్భుతం అని చెప్పచ్చు.నగేష్ బానెల్ కెమెరా పని తనం బాగుంది.జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పని తీరు బాగుంది.మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్
‘మసూద’ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. “మసూద’..అనే టైటిల్ ఈ సినిమా నూటికి నూరు శాతం న్యాయం జరిగింది. ఓ హర్రర్ సినిమాకు ఉండాల్సిన అన్ని కోణాలు ఉన్న
‘మసూద’ సినిమాను నమ్మి వచ్చిన ప్రేక్షకులకు డిజప్పాయింట్ చేయదని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మా మూవీ రేటింగ్ : 3.5 /5