లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ “‘రుద్రవీణ’ రివ్యూ

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రుద్రవీణ’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
యానాం సిటీలో లాలప్ప (రఘు కుంచె) తన తమ్ముల్లు, ముత్తప్ప,కన్నప్ప లతో కలసి చాపల బిజినెస్ ముసుగులో , డ్రగ్స్, మర్డర్స్, మానభంగాలు చేస్తూ పెద్ద రౌడీ గా చెలామని అవుతుంటాడు.అదే యానాంలో ఒక వైపు రుద్ర (శ్రీ రామ్ నిమ్మల) చిన్న పిల్లలకు క్రికెట్ నేర్పిస్తూ మరో వైపు లాలప్ప అనుచరులను రుద్ర చంపుతుంటాడు.తన మనుషులను ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియక రుద్ర కోసం ఊరంతా గాలిస్తుంటాడు.ఎల్సా (ప్రియ) జీవ హింస పాపం అంటూ అందరికీ చెపుతూ ఆర్గాన్ డొనేషన్ చేస్తే మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారని ట్రాఫిక్ దగ్గర ప్ల కార్డు పట్టుకొని అందరికీ చెప్పే క్రమంలో ట్రాఫిక్ లో రుద్ర కు చెపుతుంది. ప్రియను చూసిన రుద్ర మొదటి చూపులోనే ప్రేమలో పడడంతో చివరకు ప్రియ ను ప్రేమలో దింపుతాడు.
మరో వైపు లాలప్ప తను చంపిన 26 మర్డర్ కేస్ లలో ఎవరైనా అబ్బాయిలు వున్నారా అని ఎంక్వయిరీ చేయించగా అబ్బాయిలు లేరని తెలుసు కుంటున్న క్రమంలో రుద్ర తన ఇద్దరు తమ్ముళ్ళని చంపేస్తాడు.
మరో వైపు జైల్లో ఉండే వీణ(శుభశ్రీ ) కు ఉరిశిక్ష విధిస్తారు
వీణ కు ఎందుకు ఉరిశిక్ష విధిస్తారు? రుద్ర లాలప్ప మనుషులను ఎందుకు మర్డర్ చేస్తుంటాడు, రుద్ర కు వీణ కు సంబంధం ఏంటి రుద్రవీణ లు ఎందుకు కలసి ట్రావెల్ చేశారు అనేదే ఈ రుద్రవీణ కథ.

నటీ నటుల పనితీరు
రుద్ర (శ్రీ రామ్ నిమ్మల) హెవీ ఎమోషన్ ఉండే చాలా పెద్ద క్యారెక్టర్ చేసినా అటు మాస్ క్యారెక్టర్ లో ఇటు క్లాస్ గా
రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా నటిస్తూ పాత్రలో ఒదిగిపోయాడు.లాలప్ప (రఘుకుంచె) ముఖంపై ఉన్న గాటు తో తన విలనిజంతో డిఫరెంట్ లుక్ తో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు. ఎల్సా (ప్రియ) తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టు కునే విధంగా బాగా నటించింది.. స్క్రీన్ పై రుద్ర, ప్రియ ల కెమిస్ట్రీ బాగా పండింది. వీణ పాత్రలో శుభ శ్రీ అద్భుతంగా నటించింది.అలాగే మరో నటి సోనియా లేడీ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ చేసింది. చలాకి చంటి, గెటప్ శ్రీను, జబర్దస్త్ బ్యాచ్ ఇలా ఇందులో నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకున్నారని అని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
లవ్, రొమాంటిక్, కామెడీ, రివేంజ్ డ్రామాగా కథను దర్శకుడు మధుసూదన్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మహావీర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న పాటలు అన్నీ ఆణిముత్యాల్లాగా ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్  : జి ఎల్ బాబు అందించిన విజువల్స్ బాగున్నాయి.ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ అందించిన ఫైట్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది.రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై నిర్మాతలు రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా చాలా చక్కగా తెరకెక్కించారు. లవ్, రొమాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు అన్ని రకాల ఫుల్ ప్యాకేజ్డ్ గా వచ్చిన “రుద్రవీణ’ సినిమా అన్ని వర్గాల వారిని కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

నటీనటులు : శ్రీరామ్ నిమ్మల,ఎల్సా, శుభశ్రీ , రఘు కుంచే (విలన్) చలాకి చంటి,సోనియా, రమణారెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత : లక్ష్మణ రావు రాగుల,
డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీను రాగుల
మ్యూజిక్ డైరెక్టర్ : మహావీర్
డి ఓ పి : జి ఎల్ బాబు
ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డి
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
కొరియోగ్రాఫర్ : మోహిన్,పైడిరాజు

మా మూవీ రేటింగ్ : 3.25 / 5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *