“ప్రియమైన ప్రియ” మూవీ రివ్యూ
బ్యానర్ : గోల్డెన్ గ్లోరి బ్యానర్
హీరో ,హీరోయిన్ : అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్
దర్శకత్వం : AJ సుజిత్
నిర్మాతలు : J. సుజిత్, A బాబు
సహ నిర్మాత : కె లక్ష్మీ కాంత్
సంగీతం : శ్రీకాంత్ దేవా
నిర్మాణ నిర్వాహణ : సి.హెచ్ సీతారామ్
డిఓపి : షా
ఎడిటర్ : కె.ఇత్రిస్
మాటలు : యస్ మోహన్ కుమార్
స్టంట్ : డేంజర్ మణి
డ్యాన్స్ : రవిదేవ్
ఆర్ట్ : N నందకుమార్
గానం : చెరువూరి విజయకుమార్ , శ్రేష్ఠా
పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్
“ప్రియమైన ప్రియ” అంటూ ఓ సస్పెన్స్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోల్డెన్ గ్లోరి బ్యానర్‌పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ జంటగా A J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ప్రియమైన ప్రియ”. J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆగస్టు 4న థియేటర్లలో ఘనంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.
కథ:
ప్రియా(లీషా ఎక్లెయిర్స్) రేడియో మిర్చిలో రేడియో జాకీగా పని చేస్తుంది. “ప్రియమైన ప్రియ” అనే సక్సెస్ఫుల్ ప్రొగ్రామ్‌ని రన్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రియా చెప్పే మాటలకు అనాధ అయిన టాక్సీ డ్రైవర్ మార్కెండేయ (అశోక్ కుమార్) విపరీతంగా అభిమానం పెంచుకుంటాడు. ఆ అభిమానం అతి అయిపోవడంతో ప్రియా జీవితం ప్రమాదంలో పడుతుంది. అభిమానం ప్రాణాల మీదకు తెస్తుంది. అతడు ఎందుకు అంతలా అభిమానం పెంచుకుంటాడు? చివరికి ప్రియాకు ఎదురైన పరిణామాలు ఏంటీ? అనేది చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
నటీనటుల ప్రతిభ:
ఈ సినిమా అంతా హీరోయిన్ ప్రియా పాత్రలో నటించిన లీషా ఎక్లెయిర్స్ చుట్టే తిరుగుతుంది. ఆమె యాక్టింగ్ నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఒక రేడియో జాకీగా ఎంత చలాకీగా ఉండాలో అంతలా ఫర్మార్మెన్స్ చూపించింది. ఎమోషన్స్ కూడా పండించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన అశోక్ కుమార్ కూడా తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అటు హీరోగా, ఇటు విలన్‌గా అన్నట్టు రెండింటిని ఒకే పాత్రలో నటించి కొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక మిగతా పాత్రలు పరవాలేదు.
టెక్నికల్ టీమ్:
ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు. ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100వ చిత్రం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. చెరువూరి విజయకుమార్, శ్రేష్ఠా పాడిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఇక విజువల్ పరంగానూ సూపర్ అనే చెప్పొచ్చు. డీఓపీ అందించిన ‘షా’కు కూడా మంచి మార్కులు వేయవచ్చు. మాటలు రాసిన ఎస్. మోహన్ కుమార్ అక్కడక్కడ కొన్ని జీవిత సూత్రాలు చెప్పాడు. ఇక ఎడిటింగ్ పరంగా చూస్తే ఎడిటర్ కె.ఇత్రిస్ పనితనం పరవాలేదు. నిర్మాతలు J.సుజిత్, A.బాబు చిత్ర నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారని అర్థమవుతుంది.
విశ్లేషణ:
‘బలవంతం చేస్తే వచ్చేది ప్రేమ కాదు.. మరణం’ అనే మెసెజ్‌ను ఈ సినిమా చూపిస్తుంది. తమిళ్లో తెరకెక్కిన “ప్రియముడన్ ప్రియ” చిత్రం.. తెలుగులో “ప్రియమైన ప్రియ” టైటిల్‌తో విడుదలైంది. స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ A J సుజిత్ తాను రాసుకున్న కథను స్క్రీన్‌పై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రారంభం నుంచి చివరి దాక ఉత్కంఠను కొనసాగించడంలో దర్శకుడు A J సుజిత్ తన టాలెంట్ చూపించాడు. అయితే కామెడీ కొంచెం ఉండాల్సింది. థ్రిల్లింగ్ సీన్లు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూడొచ్చు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ కోరుకునే వారికి ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.
రేటింగ్: 3.5 /5